Ramoji Rao Vs Jagan: చంద్రబాబుపై కక్ష.. విద్యార్థులకు శిక్ష.. ఈరోజు ఈనాడు ఏపీ ఎడిషన్ లో రెండవ పేజీలో దాదాపు అర పేజీ వరకు పరిచిన వార్త. చంద్రబాబు పాలన స్వర్ణ యుగం. ఆయన పాలించినప్పుడు విద్యార్థులకు ఉద్యోగాలు దక్కాయి. ఒక్కొక్కరు ఒక్కో బిల్ గేట్స్ అయ్యారు. ఏపీ ఖ్యాతిని మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఇనుమడించారు. కోట్లకు ఎదిగారు. ఇప్పుడు జగన్ అధికారంలోకి వచ్చాడు. చంద్రబాబు కన్నకలలను మొత్తం చిద్రం చేస్తున్నాడు. మా విజినరీ చంద్రబాబు నిర్మించిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను మూసివేశాడు.. ఇలాంటి కోణంలో ఈనాడు రాసుకొచ్చింది.
ఈనాడు.. చంద్రబాబు క్యాంపులో ప్రధాన పత్రిక.. రామోజీరావు.. చంద్రబాబుకు రాజకీయ గురువు. ఇప్పుడు ఆయన జైల్లో ఉన్న నేపథ్యంలో ఈనాడు శోకాలు పెడుతోంది. మార్గదర్శిని ఒత్తుతుండడంతో ఈనాడు పెడబొబ్బలు పెడుతోంది. అందుకే జగన్ మీద.. జగన్ ప్రభుత్వం మీద అరపేజీ వార్త కుమ్మేసింది. ఇక ఈనాడు రాసుకొచ్చిన ఉద్దేశం ఏంటయ్యా అంటే.. ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ల వల్ల దాదాపు 2.5 లక్షల మంది ఏపీ యువతకు ఉద్యోగాలు వచ్చాయని.. చంద్రబాబు పరిపాలన కాలంలో వారంతా బాగుపడ్డారని ఈనాడు టముకు ప్రచారం చేసింది. ఇదే ఈనాడు చంద్రబాబు ఏపీని పరిపాలిస్తున్నప్పుడు అమీర్ పేట, ఎస్ ఆర్ నగర్ బోసి పోయాయని, దిల్ షుఖ్ నగర్ దివాలా తీసిందని.. ఇదంతా చంద్రబాబు తీసుకొచ్చిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో పుణ్యమని ప్రచారం చేసింది. కానీ ఇదే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ద్వారా ఏపీ కల్పించిన ఉద్యోగాలు ఎన్నో ఈనాడు రాయదు. వాస్తవానికి ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టింది ఎందుకయ్యా అంటే.. విద్యార్థుల్లో నైపుణ్యాలు మెరుగుపరిచి.. వారిని కంపెనీ అవసరాలకు అనుగుణంగా తయారు చేయడం..గుజరాత్, కర్ణాటక రాష్ట్రంలో ప్రస్తుతం ఇదే జరుగుతుంది. అక్కడ కంపెనీల అవసరాలకు అనుగుణంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచుతున్నాయి. అంతేకాకుండా కంపెనీలతో ఉద్యోగ మేళాలు నిర్వహించి.. వారికి ఉద్యోగాలు దక్కేలా చేస్తున్నాయి. ఏపీలో అలా జరిగిందా ఆంటే.. లేదు అనే చెప్పాలి.
వాస్తవానికి ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లలో యువతకు శిక్షణ ఇచ్చారు. కంపెనీలను తీసుకురాలేకపోయారు. ఇక్కడ శిక్షణ పొందిన యువత మళ్లీ బెంగళూరు, హైదరాబాదు, పూణె, అహ్మదాబాద్ ప్రాంతాలకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఆర్థిక మాంద్యం వల్ల ఐటీ కంపెనీలు నియామకాలను తగ్గించాయి. ఈ విషయాన్ని గుర్తించిన ఈనాడు కేవలం చంద్రబాబు కోణంలోనే వార్త రాసుకు వచ్చింది. మరోసారి తాను పచ్చ పత్రికను అని నిరూపించుకుంది. ఒకవేళ బాధ్యతాయుతమైన పత్రిక ఈనాడుకు కనుక పాత్రికేయ విలువలు ఉండి ఉంటే.. ఇలా రాసేది కాదు.. కర్ణాటక, గుజరాత్ రాష్ట్రంలో ఏ విధంగా అమలు చేస్తున్నారో.. అప్పుడు చంద్రబాబు హయాంలో ఉన్నప్పుడు ఎలా నిర్వహించారో రాసుకు వచ్చేది. ఇప్పటి అవసరాలకు అనుగుణంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లని ఎలా మార్చాలో రాసుకు వచ్చేది. ఇవేవీ గుర్తుఎరగకుండా కేవలం చంద్రబాబు సేవలోనే తరించింది.