https://oktelugu.com/

Ramoji Film City : అమ్మకానికి రామోజీ ఫిల్మ్ సిటీ.. పోటీలో అదానీ, సన్ టీవీ, డిస్నీ ప్లస్ హాట్ స్టార్!?

ఇది తెగుతుందో, ముడి పడుతుందో, లేక గాలికి కొట్టుకుపోయే పేలపిండి అవుతుందో.. తెలియదు గాని మొత్తానికైతే ఒక ఇంట్రెస్టింగ్ చర్చ మాత్రం నడుస్తోంది.

Written By:
  • Rocky
  • , Updated On : October 7, 2023 / 09:55 AM IST
    Follow us on

    Ramoji Film City : డబ్బు అన్నాక చేతులు మారుతుంది. వ్యాపారం కూడా ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తి చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఆర్థిక శాస్త్రం ప్రకారం ఎక్కడ ఎంత మార్జిన్ లభిస్తే.. అక్కడ పెట్టుబడి ఆ స్థాయిలో ఉంటుంది. అందుకే కదా అంతటి తాజ్ హోటల్స్ టాటా గ్రూప్ చేతులలోకి వెళ్ళింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇండియన్ మార్కెట్ చరిత్రలో గొప్ప గొప్ప డీల్స్ చాలానే జరిగాయి. ఇక, ఇండియన్ మార్కెట్లో అంబానీ తర్వాత ఆ స్థాయిలో దూసుకుపోతోంది గౌతమ్ అదానీ. ముఖేష్ అంబానీ కి పోటీగా రకరకాల వ్యాపారాల్లో భారీ స్థాయిలో పెట్టుబడులు పెడుతున్నాడు. అంతేకాదు అంబానీ నెట్వర్క్ 18 కు పోటీగా ఎన్డిటీవీని టేక్ ఓవర్ చేశాడు. అయితే డిజిటల్ మీడియాలో మాత్రం ఇప్పటికీ ముఖేష్ అంబానీ తోపు. రోజురోజుకు దీని మార్కెట్ విలువ పెరిగిపోతున్న నేపథ్యంలో ముఖేష్ అంబానీ..డిస్నీ హాట్ స్టార్ ఇండియా టీవీకి చెందిన డిజిటల్ మీడియా వ్యాపారాన్ని( బ్రాడ్ బ్యాండ్)ను కొనుగోలు చేసేందుకు పలుమార్లు చర్చలు జరిగాయి. అయితే దీనికి సంబంధించి కీలక అడుగు ముందుకు పడనట్టుంది. ఇది జరుగుతుండగానే ముఖేష్.. తన వ్యాపార అభిరుచికి భిన్నంగా క్రికెట్ ప్రసారాలకు సంబంధించి హక్కుల కొనుగోలు విషయంలో కోట్లకు కోట్లు పెట్టుబడులు పెట్టాడు. ప్రస్తుతమైతే మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ ప్రారంభమైంది కాబట్టి.. వచ్చే రోజుల్లోనూ కీలకమైన మ్యాచులు ఉన్నాయి కాబట్టి.. ముఖేష్ భవిష్యత్తును ముందుగానే ఊహించి అందులో భారీగా పెట్టుబడులు పెట్టాడు. పైగా ఆ వ్యాపారానికి రాబోయే రోజుల్లో భారీగా స్కోప్ ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

    సో అంబానికి పోటీగా ఈ రంగంలోకి కూడా రావాలని గౌతమ్ ఎప్పటినుంచో భావిస్తున్నాడు. కేవలం ఎన్డిటివి మాత్రమే కాకుండా తనపై వచ్చే విమర్శలకు బలమైన కౌంటర్ ఇచ్చేందుకు గట్టి మీడియా గ్రూప్ కావాలి కాబట్టి ఆ దిశగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక తాజాగా టీవీ ప్రసారాల్లో నెంబర్ వన్ గా ఉన్న డిస్నీ హాట్ స్టార్ గ్రూప్ తో గౌతమ్ చర్చలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అయితే ఫైనల్ ఫిగర్ ఎంతో తెలియదు కానీ.. ఇంకా ఈ డీల్ విషయంలో ఒక ముడి పడలేదని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. కేవలం గౌతం అదానీ మాత్రమే కాకుండా సన్ టీవీ కూడా ఇదే ప్రయత్నంలో ఉంది. (“రాయిటర్స్” అనే వార్త సంస్థ రాసింది.. “బ్లూమ్ బర్గ్” న్యూస్ ఆధారంగా అది ఈ వార్తను ప్రచురించింది.) సన్ టీవీ రేటింగ్స్ విషయంలో ఉన్నతమైన స్థానంలో ఉంటుంది.. బలమైన గ్రూపు, పైగా తమిళనాడులో అధికారంలో ఉన్న స్టాలిన్ కుటుంబీకులకు చెందింది. కానీ ఆ గ్రూపు వ్యవహారాలను చూసే కళానిధి మారన్ సన్ టీవీలో తనకు ఉన్న మెజారిటీ విక్రయించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. అయితే ఈ వ్యవహారాలు అత్యంత గోప్యంగా జరుగుతున్నాయి. అయితే ఇవి ఫలప్రదం కావాలని లేదు. ఇది ఇలా జరుగుతుండగానే.. మీడియా వర్గాల్లో భూమి బద్దలై పోయే బ్రేకింగ్ న్యూస్ లాంటి ఒక చర్చ ప్రారంభమైంది. ఎందుకంటే ఆ విషయం అటువంటిది. ఎవరు కూడా కలలో ఊహించంది.

    ఇటీవల గౌతం ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిశాడు. అత్యంత రహస్యంగా ఈ కార్యక్రమం జరగాల్సి ఉన్నప్పటికీ స్థానికంగా ఉన్న మీడియా హైప్ ఇవ్వడంతో రచ్చ రచ్చ అయిపోయింది. అయితే వారిద్దరి మధ్య రామోజీ ఫిలిం సిటీ కి సంబంధించి ప్రస్థాన వచ్చినట్టు ఒక ధ్రువపడని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం చంద్రబాబు ఆర్థిక మూలాలను పెకిలించే క్రమంలో జగన్ చాలా దూకుడుగా వెళ్తున్నాడు. ఇప్పటికే చంద్రబాబు నాయుడుని రాజమండ్రి సెంట్రల్ జైల్లో విచారణ ఖైదీని చేశాడు. ఇంకా మరిన్ని కేసులను తోడుతున్నాడు. ఇది చాలదన్నట్టు రాజు గురువు లాంటి రామోజీరావును అష్టదిగ్బంధనం చేసి, గౌతమ్ అదాని ద్వారా రామోజీ ఫిలిం సిటీ టేక్ ఓవర్ చేయిస్తాడని మీడియా వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే ఈనాడు, రామోజీ ఫిలిం సిటీ లో ముఖేష్ అంబానికి వాటాలు ఉన్నాయి..సో, అంబానీ పక్కన పెట్టేసి గౌతమ్ అదానీ రామోజీ ఫిలిం సిటీని తీసుకుంటాడు అనేది అత్యంత నమ్మశక్యంగా లేదు. పైగా వేలాది ఎకరాల భూమిని, అది కూడా హైదరాబాద్ నగర శివారులో ఉంటే ముఖేష్ అంబానీ ఎందుకు వదిలేసుకుంటాడు? ఈ చర్చ సంగతి పక్కన పెడితే.. తనకు నచ్చిన వ్యాపారాన్ని కేంద్ర పెద్దల ద్వారా తన కాళ్ల దగ్గరికి తెచ్చుకునే సత్తా గౌతమ్ అదానికి ఉంది. అలాంటి అతడు రామోజీరావును ఎలా లొంగ తీసుకుంటాడు? రామోజీరావు కూడా ఇలాంటివి చాలా చూసినవాడే కదా.. ఇది తెగుతుందో, ముడి పడుతుందో, లేక గాలికి కొట్టుకుపోయే పేలపిండి అవుతుందో.. తెలియదు గాని మొత్తానికైతే ఒక ఇంట్రెస్టింగ్ చర్చ మాత్రం నడుస్తోంది.