Ramoji – ETV : రామోజీ సార్.. ఇలాంటి ధూమ్ ధామ్ దసరాలు.. ఈటీవీ ని లేపుతాయా?

మిగతా విషయాల్లో ఎలా ఉన్నా పండగలు, ప్రత్యేక రోజులల్లో ఈటీవీ కొన్ని షోస్ చేస్తుంది. గతంలో ఇవి బాగా క్లిక్ అయ్యేవి (పోటీ చానల్స్ అప్పుడు ఇంకా ఈ కేటగిరి లోకి రాలేదు.

Written By: K.R, Updated On : October 16, 2023 12:59 pm
Follow us on

Ramoji – ETV : కట్టిపడేసే సీరియల్స్, కనురెప్ప వాల్చనీయకుండా చూడాలి అనిపించే న్యూస్.. దీనికి తోడు ప్రత్యేకమైన కార్యక్రమాలు.. వెరసి ఈటీవీ అంటే తెలుగు వారి అలవాటు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సీరియల్స్ రోడ్డ కొట్టుడు వ్యవహారం అయిపోయాయి. ఢీ, జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ బూతు షోలు అయిపోయాయి. ప్రైమ్ టైం లో వచ్చే న్యూస్ తప్ప పెద్దగా రేటింగ్స్ పెంచే షోస్ లేవు. సీరియల్స్ అంతకన్నా లేవు. ఫలితంగా మూడవ స్థానానికి ఈటీవీ పడిపోయింది. గతంలో రెండవ స్థానంలో ఉండేది. క్రియేటివిటీ టీం బయటికి వెళ్లిపోవడంతో సెకండ్ కేటగిరి టీం తోనే తంతు కొనసాగించాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో రెండవ స్థానంలోకి జీ తెలుగు వచ్చింది. ప్రేక్షకుల అభిరుచి మారుతుంది కాబట్టి, తను ఎలాగూ మారలేదు కాబట్టి ఈటీవీ మూడవ స్థానానికి పడిపోయింది. ఇక కోల్పోయిన ఆ రెండవ స్థానాన్ని తిరిగి సాధించుకునేందుకు ఈటీవీ అనేక ప్రయత్నాలు సాగిస్తోంది.

మిగతా విషయాల్లో ఎలా ఉన్నా పండగలు, ప్రత్యేక రోజులల్లో ఈటీవీ కొన్ని షోస్ చేస్తుంది. గతంలో ఇవి బాగా క్లిక్ అయ్యేవి (పోటీ చానల్స్ అప్పుడు ఇంకా ఈ కేటగిరి లోకి రాలేదు. ఇప్పుడు అవి కూడా ప్రత్యేకమైన షోస్ చేస్తున్నాయి). తర్వాత ఎందుకనో వాటి మీద ఈటీవీ మేనేజ్మెంట్ (మొత్తం మల్లెమాల శ్యాంసుందర్ రెడ్డి చూస్తున్నారు) పెద్దగా కాన్సన్ట్రేట్ చేసినట్టు కనిపించలేదు. పైగా క్రియేటివిటీ ఇతర చానల్స్ లోకి వెళ్లిపోయింది. దీంతో గత్యంతరం లేక సెకండ్ కేటగిరి టీం తోనే షో స్ నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా అవి మెరుగైన రేటింగ్స్ సాధించడంలో విఫలమయ్యాయి. ఈటీవీ కాస్త కూస్తో రేటింగ్స్ సాధిస్తున్నది వాటి వల్లే కాబట్టి ఆ షో స్ ను ఇప్పట్లో వదిలిపెట్టదు. చేతిలో ఎలాగూ జబర్దస్త్, ఢీ సభ్యులు ఉన్నారు కాబట్టి వారితోనే షో స్ నడిపిస్తోంది. అయితే తాజాగా ధూమ్ ధాం దసరా అనే పేరుతో ఒక ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో కేవలం జబర్దస్త్ నటీనటులే కాకుండా చాలామంది కనిపించారు.

తమిళ నటులు ఎస్ జె సూర్య, రాఘవ లారెన్స్ వంటి వారు సందడి చేశారు. ఇటీవల వచ్చిన చిత్రంలో సిల్క్ స్మితగా నటించిన యువతి కూడా ఈ షోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఖుషి సినిమాలో నడుము ఎపిసోడ్, జూనియర్ సిల్క్ స్మిత తో స్పెషల్ కిట్, హైపర్ ఆది, రాంప్రసాద్, రవి, చలాకి చంటి కామెడీ స్కిట్స్ ఈ ప్రోమోలో కనిపించాయి. మొత్తానికి ఈటీవీ క్రియేటివిటీ టీం ఈ షో మీద భారీగానే కసరత్తు చేసినట్టు కనిపిస్తోంది. షో నిండా భారీగా తారాగణం ఉండడంతో ఎంతో కొంత క్యూరియాసిటీ కనిపిస్తోంది. కానీ గత షో ల తాలూకూ కాన్సెప్ట్ కనిపించడంతో కొత్తదనం అనిపించడం లేదు. ప్రతి ఆదివారం ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ లాగానే ఉంది ఈ దసరా ధూమ్ ధాం. ఎలాగూ పోటీ చానల్స్ ప్రోమోలు విడుదల చేయలేదు కాబట్టి.. ఈటీవీ ఈ విషయంలో కొంత సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఇప్పటికే మూడవ స్థానానికి పడిపోయిన నేపథ్యంలో ఇలాంటి దసరా ధూమ్ ధాం లు తిరిగి ఈటీవీ ప్రభను వెలిగిస్తాయా?