Homeఎంటర్టైన్మెంట్RGV Vyooham - Pawan : మరో సెన్సేషనల్ స్టిల్... పవన్ టార్గెట్ గా వర్మ...

RGV Vyooham – Pawan : మరో సెన్సేషనల్ స్టిల్… పవన్ టార్గెట్ గా వర్మ ‘వ్యూహం’

RGV Vyooham – Pawan : జగన్ అడిగితే ప్రాణాలు కాదు ఏదైనా కోసిస్తాడు మన వర్మ.. అందుకే తనకు అచ్చొచ్చిన సినిమాలతోనే కొడుతున్నాడు. జగన్ అంటే ప్రాణం.. ఆయన ప్రత్యర్థులంటే వర్మ కోపం.. అందుకే అటు చంద్రబాబును.. ఇటు పవన్ కళ్యాణ్ ను వదలడం లేదు. తాజాగా చంద్రబాబు, పవన్ లు ఏపీ సీఎం జగన్ పై చేసిన కుట్రలకు దృశ్యరూపం ఇచ్చి సినిమా తీశాడు అదే ‘వ్యూహం’. ఏపీ పాలిటిక్స్ లో ఆర్జీవీ ‘వ్యూహం’ సినిమా టీజర్ ప్రస్తుతం సంచలనం రేపుతోంది. ఇది ఏపీ సీఎం జగన్ పొలిటికల్ జర్నీపై తెరకెక్కుతున్న చిత్రమని వర్మ ఆల్రెడీ హింట్ ఇచ్చేశాడు. రామ్ గోపాల్ వర్మ విడుదల చేస్తున్న స్టిల్స్, టీజర్ ఈ విషయం స్పష్టం చేశాయి.

వ్యూహం మూవీ తెరకెక్కించే ముందు వర్మ సీఎం జగన్ కి కలిశారు. అనంతరం ఈ చిత్ర ప్రకటన చేశారు. కాబట్టి ఇది పూర్తిగా వైఎస్ జగన్ కి అనుకూలంగా తెరకెక్కనుంది. మాజీ సీఎం వై ఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం అనంతరం ఉమ్మడి ఏపీలో ఏర్పడిన పరిస్థితులు, వై ఎస్ జగన్ ఓదార్పు యాత్ర, ఆయన అరెస్ట్, పార్టీ ఏర్పాటు వంటి అంశాల సమాహారంగా సాగనుంది.

వైఎస్ జగన్ ని హీరోని చేసే క్రమంలో పలువురు పొలిటికల్ లీడర్స్ ని విలన్స్ చేయడం ఖాయం. అందులో ప్రధాన టార్గెట్ గా నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఉంటారు అనడంలో సందేహం లేదు. గతంలో కూడా ఆర్జీవీ వీరిద్దరినీ తమ చిత్రాలతో టార్గెట్ చేశారు. లక్ష్మీస్ ఎన్టీఆర్, పవర్ స్టార్ చిత్రాల్లో వీరి వ్యక్తిత్వాలను పొలిటికల్ ఇమేజ్ ని దెబ్బతీసే ప్రయత్నం చేశారు.

వ్యూహంలో ఆర్జీవీ మరోసారి పవన్ కళ్యాణ్, చంద్రబాబులను నిజస్వరూపం బయటపెట్టడానికి వర్మ రెడీ అయ్యారు. వ్యూహం నుండి బయటికి వస్తున్న ఒక్కో స్టిల్ ఈ విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి. తాజాగా మరో స్టిల్ ఆర్జీవీ విడుదల చేశారు. ముగ్గురు వ్యక్తులు కూర్చుని ఉన్న ఫోటో ఆర్జీవీ రిలీజ్ చేశాడు. చిరంజీవి, అల్లు అరవింద్, పవన్ కళ్యాణ్ ను పోలిన విధంగా ఫోటోలు ఉన్నారు. ఇది గతంలో ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం సందర్భంగా జరిగిన చర్చలకు సంబంధించిన స్టిల్స్ అని అర్థమవుతోంది. చిరంజీవి కాంగ్రెస్ లో ప్రజారాజ్యంను విలీనం చేసేటప్పుడు అల్లు అరవింద్ తో చర్చించినట్టుగా తెలుస్తోంది. తన సినిమాలో ప్రజారాజ్యం పార్టీ ప్రస్తావన ఆర్జీవీ తెస్తున్నట్టు తెలుస్తోంది. అప్పుడు పవన్ ను డమ్మీగా వర్మ చూపించబోతున్నట్టు అర్థమవుతోంది. ఈ స్టిల్ గమనిస్తే ఢిల్లీ పెద్దలతో చిరంజీవి-అల్లు అరవింద్ మాట్లాడుకుంటుంటే పవన్ కళ్యాణ్ దూరంగా కూర్చుని చూస్తున్నట్లుగా ఉంది.

ఆర్జీవీ సదరు స్టిల్ రిలీజ్ చేసి ‘వ్యూహం’ లో ఈ క్యారెక్టర్ ఎవరు? అని ప్రశ్నించాడు.ముందుగా అనుకున్నట్లే పవన్ కళ్యాణ్ ని వ్యూహం మూవీలో ఆర్జీవీ టార్గెట్ చేస్తాడని తెలుస్తోంది. ప్రస్తుతం వై ఎస్ జగన్ కి పవన్ కళ్యాణ్ బలమైన రాజకీయ ప్రత్యర్థిగా తయారయ్యాడు. కాబట్టి ఆర్జీవీ కచ్చితంగా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తాడు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version