https://oktelugu.com/

Skanda Trailer : స్కంద ట్రైలర్ రివ్యూ : దెబ్బ తాకితే గోల్కొండ దాకా వినబడాలా… బోయపాటి మార్క్ యాక్షన్ డ్రామా!

ట్రైలర్ ఆద్యంతం యాక్షన్ సన్నివేశాలతో సాగింది. శ్రీలీలకు ఈ మూవీలో పెద్దగా స్కోప్ ఉండదేమో అనిపిస్తుంది.

Written By:
  • NARESH
  • , Updated On : August 27, 2023 / 10:11 AM IST

    skanda trailer

    Follow us on

    Skanda Trailer : బోయపాటి శ్రీను చిత్రాల్లో ఊచకోత సన్నివేశాలు కామన్. బాలయ్య వంటి మాస్ హీరోకి బోయపాటి మార్క్ యాక్షన్ బాగా సెట్ అవుతుంది. కొంచెం అతి అనిపించినా నచ్చుతుంది. అదే రేంజ్ యాక్షన్ సన్నివేశాలతో స్కంద మూవీ తెరకెక్కించారు. చెప్పాలంటే ఇంకా డోస్ ఎక్కువగానే ఉంది. బోయపాటి తన కథల్లో కుటుంబాలను బాగా ఎస్టాబ్లిష్ చేస్తాడు. భారీ తారాగణంతో ఉమ్మడి కుటుంబాలు చూపిస్తాడు. ప్రతి సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్ కూడా వాడుకుంటాడు.

    స్కందలో సైతం లెక్కకు మించిన క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ నటించారు. ఇక రామ్ పోతినేని రెండు భిన్నమైన గెటప్స్ లో కనిపించారు. కాలేజ్ స్టూడెంట్ గా ఒక పాత్ర చేసిన రామ్ మరో పాత్రలో జుట్టు పెంచి మరింత రఫ్ లుక్ ట్రై చేశాడు. ట్రైలర్ చివర్లో రామ్ పోతినేని మరో లుక్ పరిచయం చేశారు. ట్రైలర్ ఆద్యంతం యాక్షన్ సన్నివేశాలతో సాగింది. శ్రీలీలకు ఈ మూవీలో పెద్దగా స్కోప్ ఉండదేమో అనిపిస్తుంది.

    శ్రీలీల పాత్ర కేవలం రొమాంటిక్ సన్నివేశాలకు పరిమితం చేసి ఉండవచ్చు. భారీ యాక్షన్ సన్నివేశాలు, ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా స్కంద తెరకెక్కిందని ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. అయితే ఈ తరహా మాస్ చిత్రాలకు పాన్ ఇండియా మార్కెట్ ఉంటుందా అనేది సందేహం కలుగుతుంది. యూట్యూబ్ లో తన సినిమాలు దుమ్మురేపుతున్నాయని ఛత్రపతి హిందీ రీమేక్ చేసి బెల్లంకొండ శ్రీనివాస్ చేతులు కాల్చుకున్నాడు.

    అలాగే రామ్ పోతినేని సినిమాలు కూడా హిందీ యూట్యూబ్ ప్రేక్షకులు బాగా చూస్తారు. ఈ క్రమంలోనే స్కంద చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా విడుదల చేస్తున్నారు. తెలుగు ప్రేక్షకులు ఆదరించే అంశాలు ఉన్నప్పటికీ నార్త్ ఆడియన్స్ ని థియేటర్స్ కి నడిపించే సత్తా ఈ సినిమాకు ఉందా అనేది సందేహం. శ్రీనివాస చిత్తూరి ఈ చిత్ర నిర్మాత కాగా థమన్ సంగీతం అందించారు. సెప్టెంబర్ 15న విడుదల కానుంది.