Vyuham Review: ‘వ్యూహం ‘మూవీ ఫుల్ రివ్యూ…

ఏపీ పాలిటిక్స్ ని టార్గెట్ చేసి తీసిన సినిమానే 'వ్యూహం'... ఇక ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఎలా ఉంది? ఇది ఎవ్వరికీ ఫేవర్ గా మారనుంది.?

Written By: Gopi, Updated On : March 2, 2024 6:44 pm
Follow us on

Vyuham Review: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంచలన దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న రాంగోపాల్ వర్మ…ప్రతి సినిమాతో ఏదో ఒక కాంట్రవర్సీని క్రియేట్ చేస్తూ ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా కాంట్రవర్సీ లేకుండా రిలీజ్ అయిన దాఖలాలు లేవు. ఇక ఇప్పటికే ఆయన ఏపి పాలిటిక్స్ ను బేస్ చేసుకొని ‘అమ్మ రాజ్యం కడప రెడ్లు ‘ అనే సినిమా కూడా చేశాడు..ఇక ఇప్పుడు మళ్లీ ఏపీ పాలిటిక్స్ ని టార్గెట్ చేసి తీసిన సినిమానే ‘వ్యూహం’… ఇక ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఎలా ఉంది? ఇది ఎవ్వరికీ ఫేవర్ గా మారనుంది.? ఈ సినిమా ఇప్పుడు జరగబోయే ఎలక్షన్ల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపించబోతోంది.?అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

కథ
ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వడానికి 150 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేసిన కూడా ఆయనని హైకమాండ్ సిఎం చేయదు. దానికి తోడుగా రాజశేఖర్ రెడ్డి మరణ వార్త విని చనిపోయిన చాలా మంది పేదలను జగన్ ఓదార్పు యాత్ర పేరుతో కలవాలనుకుంటాడు. ఇక అలాంటి సందర్భంలో ఆయన మీద అక్రమ కేసులు పెట్టి ఆయన యాత్రను అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. ఇక అటు హై కమాండ్ ని, ఇటు చంద్రబాబు చేసే కుట్రలను ఎదిరించి ఆయన సీఎం ఎలా అయ్యాడు. అలాగే ఆయన్ని ఓడించడానికి చంద్రబాబు వేసిన స్కెచ్ లు ఏంటి అనే విషయాలు మీకు తెలియాలంటే మీరు తప్పకుండా ఈ సినిమాని చూడాల్సిందే…

విశ్లేషణ

వర్మ ఈ సినిమా స్టార్ట్ చేసిన మొదట్లో ఇది కల్పిత స్టోరీ గా తెరకెక్కిస్తున్నాం అని చెప్పినప్పటికీ ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి ఇది రాజకీయ ఎత్తుగడ కోసమే తీసిన సినిమాగా అర్థం అయిపోయింది. అయితే ఈ సినిమా జగన్ కి అనుకూలంగా తీశారా లేదా జరిగిన వాస్తవాన్ని తెరకెక్కించాడా అనేది రామ్ గోపాల్ వర్మ కే తెలియాలి. ఇక వర్మ ఈ సినిమాలో జగన్ పాత్రని హైలెట్ చేస్తూ మిగిలిన వాళ్ళ పాత్రలని తగ్గిస్తూ సినిమానైతే తీశాడు. ఇక ముఖ్యంగా చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ ని ఒక విలన్ షేడ్స్ ఉన్న పాత్రలా చూపించడం కొంతవరకు టిడిపి కార్యకర్తలకు గాని, ఆ పార్టీ ఫాలోవర్స్ కి గాని ఇబ్బంది కలిగించే విషయమనే చెప్పాలి… ఇక పవన్ కళ్యాణ్ పాత్రని చాలా కామెడీగా చూపించాడు. అలాగే నారా లోకేష్ కనిపించకుండా జస్ట్ వినిపించే పాత్రలో పెట్టి ఆయన చేత కూడా కామెడీ ని పండించాడు…ఇక ఇలాంటి ఒక నాసిరకం కథ స్క్రీన్ ప్లే తో తెరకెక్కిన ఈ సినిమా జనాల్లో ఎలాంటి ఇంపాక్ట్ అయితే చూపించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఏపి లో ఏం జరుగుతుంది. వాస్తవాలు ఏంటి అనేది జనాలకి తెలుసు…

కాబట్టి ఎవరు ఎలాంటి వారు అనే విషయం మీద జనాలు అయితే ఇప్పటికే ఒక ఉద్దేశ్యం లో ఉన్నారు. ఇప్పుడు ఏదో సినిమా చేసేసినంత మాత్రాన జనాల నిర్ణయాలను మార్చుకొని అయా పార్టీ లకి ఓటు వేసి గెలిపించేంత పిచ్చి జనాలైతే ఎవరు లేరు. నిజానికి వర్మ ఈ సినిమాని జగన్ కోసమే తీశాడని పక్కగా తెలిసిపోతుంది. ప్రతి సీన్ లో ఆయన్ని హైలైట్ చేసే ఎపిసోడ్లను మాత్రమే రాసుకున్నాడు. ఒక సీన్ జరిగింది అంటే దానికి ముందు వెనకాల ఏం జరుగుతుందో తెలుసుకోకుండా ఒంటెద్దు పోకడలో వర్మ పోయినట్టుగా కనిపిస్తుంది…తనకి తెలిసింది, అనిపించింది మాత్రమే సినిమా గా తీశాడని తెలుస్తుంది. ఇక గత 15 రోజుల క్రితమే యాత్ర 2 అనే సినిమాతో వైసీపీకి అనుకూలంగా ఒక సినిమా రిలీజ్ అయింది. అయినప్పటికీ ఈ సినిమాలో ఎవరిని విమర్శనాత్మకంగా చూపించలేదు. వాళ్లని మాత్రమే హైప్ చేసుకునే విధంగా ఆ సినిమాను తెరకెక్కించారు. అలా ఉంటే ప్రాబ్లం లేదు. కానీ మన వాళ్ళని హీరోని చేయడానికి పక్క వాళ్ళను బ్యాడ్ గా చూపించడం అనేది కూడా కరెక్ట్ కాదు. వర్మ ఈ సినిమా ఎందుకోసం చేశాడో, ఎవరికోసం చేశాడో ఆయనకే తెలియాలి…
ఇక ఈ సినిమాలో వైఎస్ మరణం తర్వాత వచ్చే ఒక సాంగ్ ఎమోషనల్ గా ప్రతి ఒక్క ఆడియన్ కి కనెక్ట్ అవుతుంది. అదొకటి మినహాయిస్తే ఈ సినిమాలో ఏ అంశం కూడా ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యే విధంగా అనిపించదు…ఇక వైసిపి అభిమానులకు, కార్యకర్తలకు, నాయకులకు ఈ సినిమా బాగా నచ్చుతుంది…

ఆర్టిస్టు పర్ఫామెన్స్

ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే జగన్ పాత్ర పోషించిన అజ్మల్.. జగన్ ఎలాగైతే నటిస్తాడో అలాంటి మ్యానురిజంతో నటించి మెప్పించాడనే చెప్పాలి. ఇక చంద్రబాబు క్యారెక్టర్ లో నటించిన ధనుంజయ్ ప్రభువు కేవలం ఆర్జీవి సినిమాల్లో నటించడానికి మాత్రమే ఉన్నట్టుగా అర్థమైపోతుంది. ఆర్జీవి కూడా అతన్ని ఇప్పుడప్పుడే వదిలే ప్రసక్తి లేనట్టుగా కనిపిస్తుంది… ఇక మిగిలిన పాత్రధారులు అందరూ ఆయా పాత్రల పరిది మేరకు నటించారు. నిజానికి వాళ్ళు నటించారు అనే కంటే వర్మ చెప్పినట్టుగా చేశారు అంటే బెటర్…

టెక్నికల్ అంశాలు

టెక్నికల్ గా ఎవరు ఉన్నా లేకపోయినా కూడా అన్ని క్రాప్ట్ లను వర్మ ఒక్కడే డీల్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఆయనకు కావాల్సిన షాట్ అయినే పెట్టుకున్నట్టు గా, ఆయనకి కావాల్సిన మ్యూజిక్ ను ఆయనే దగ్గరుండి మరి కొట్టించుకున్నాడు. ఇక వర్మకి నచ్చిన సీన్ లు ఏంటో అవి సినిమాతో సంబంధం లేకపోయిన ఆ సీన్ల ను ఎడిటర్ తీసివేస్తాను అని చెప్పిన కూడా వర్మ దగ్గరుండి మరీ ఆ సీన్ల ను సినిమాలో పెట్టించినట్టున్నాడు. ఇలా ప్రతి క్రాఫ్ట్ లో వర్మ హ్యాండ్ కనిపిస్తుంది. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ ఒకే అనేలా ఉన్నాయి…

ప్లస్ పాయింట్స్

ఈ సినిమాలో వైఎస్ మరణం తర్వాత వచ్చే సాంగ్ ఒక్కటి తప్ప..దీంట్లో ప్లస్ పాయింట్స్ అంటూ ఏమీ లేవు…

మైనస్ పాయింట్స్

ఎమోషన్ లేని సీన్లు…
క్లారిటీ లేని స్క్రీన్ ప్లే

రేటింగ్
ఈ సినిమాకు మేము ఇచ్చే రేటింగ్ 1/5

చివరి లైన్
వైసిపి అంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఒకసారి చూడవచ్చు…