https://oktelugu.com/

Rajini kanth: తెరమీద సూపర్ స్టార్.. నిజ జీవితంలో సూపర్ సింప్లిసిటీ.. వీడియో వైరల్

ఈ సినిమా లైకా ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో నిర్మాణం జరుపుకుంటున్నది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ అభిమానులను ఆకట్టుకుంటున్నది. ఈ చిత్రంలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, కిషోర్, మంజు వారియర్ వంటి వారు నటిస్తున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : March 1, 2024 / 08:39 PM IST
    Follow us on

    Rajinikanth : రజనీకాంత్.. తమిళనాడులో మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఈ పేరంటే ఒక వైబ్రేషన్. జపాన్, కొరియా, సింగపూర్, మలేషియా, చైనా లాంటి దేశంలో ఒక ఎమోషన్. ప్రపంచం మొత్తం కొరియా డ్రామా సినిమాలను ఇష్టపడితే.. కొరియా ప్రజలు రజనీకాంత్ స్టైల్ ను ఇష్టపడతారు. అందుకే ఆయన నటించిన సినిమాలు ఇండియాలోనే కాకుండా పై దేశాల్లోనూ సమాంతరంగా విడుదలవుతాయి. అందుకే ఆయన వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్ అయ్యారు. అంతటి స్టార్ డం ఉన్నప్పటికీ రజినీకాంత్ దానిని ఎక్కడా ప్రదర్శించరు. సినిమాల్లో మాత్రమే విగ్గు పెట్టుకునే ఆయన.. బయట సమాజంలో విగ్గులేకుండానే తిరుగుతారు. సినిమా పూర్తికాగానే హిమాలయాలకు వెళ్తారు. రాఘవేంద్ర మఠానికి వెళ్లి సామాన్య భక్తుల్లాగా పూజలు చేస్తుంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే రజనీకాంత్ సింప్లిసిటీ కి ఉదాహరణలుగా నిలిచే సంఘటనలు ఎన్నో.. అలాంటి రజనీకాంత్ మరోసారి తన సామాన్య మనిషి తత్వాన్ని మరోసారి నిరూపించుకున్నారు. ఆ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

    రజనీకాంత్ తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప నుంచి ఇండిగో విమానంలో ఎకనామి క్లాసులో ప్రయాణించారు. వాస్తవానికి రజనీకాంత్ స్టేటస్ కు స్పెషల్ చాపర్ లోనే ఆయన ప్రయాణం చేయవచ్చు. కానీ ఆయన అలా చేయకుండా సామాన్య ప్రయాణికుల లాగానే ఎకనామి క్లాసులో ప్రయాణం చేశారు. వాస్తవానికి బిజినెస్ క్లాస్ తో పోల్చితే ఎకనామి క్లాసులో తక్కువ సౌకర్యాలు ఉంటాయి. అయినప్పటికీ రజినీకాంత్ ఎకానమీ క్లాసులో ప్రయాణించడం విశేషం. తన ప్రయాణం సందర్భంగా రజనీకాంత్ తోటి ప్రయాణికులతో ముచ్చటించారు. కొందరు ఆయనతో సెల్ఫీలు దిగారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ అవుతోంది. అన్నట్టు రజినీకాంత్ కు ప్రస్తుతం 73 సంవత్సరాలు. ఆయన కొన్ని అనారోగ్య సమస్యలను ఎదుర్కొని ధైర్యంగా బయటపడ్డారు.

    రజనీకాంత్ గత ఏడాది జైలర్ సినిమాతో తన స్టామినా నిరూపించుకున్నారు. ఈ ఏడాది విడుదలైన లాల్ సలాం ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. ఇక ప్రస్తుతం రజనీకాంత్ వెట్టయన్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాను జై భీమ్ దర్శకుడు జ్ఞానవేల్ రూపొందిస్తున్నారు. ఈ సినిమా లైకా ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో నిర్మాణం జరుపుకుంటున్నది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ అభిమానులను ఆకట్టుకుంటున్నది. ఈ చిత్రంలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, కిషోర్, మంజు వారియర్ వంటి వారు నటిస్తున్నారు.