Rajamouli : ఇండియన్ సినిమా హిస్టరీ లో రాజమౌళి కి ప్రత్యేక స్థానం ఉంటుందనే చెప్పాలి ఎందుకంటే బాహుబలి అనే ఒక సినిమాతో పాన్ ఇండియా అనే ఒక మార్కెట్ ని సౌత్ సినిమాలకి పరిచయం చేసిన ఒక డైరెక్టర్ అనే చెప్పాలి.నిజానికి రాజమౌళి గురించి చెప్పాలంటే ఆయన ఒక సీరియల్ డైరెక్టర్ గా ఆయన కెరియర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత స్టూడెంట్ నెంబర్ వన్ అనే ఒక సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు.ఇక అప్పటి నుంచి ఈయన చేసిన ప్రతి సినిమా ఒక సూపర్ హిట్ అనే చెప్పాలి…
తెలుగు లో ఆయన తీసిన సినిమాలు వరుసగా విజయాలను అందుకున్నాయి నిజానికి ఈయన తెలుగులో వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు.మగధీర సినిమా తర్వాత చిరంజీవి లాంటి హీరోనే రాజమౌళి గురించి మాట్లాడుతూ తమిళం లో శంకర్ లాంటి డైరెక్టర్ లు వరుస హిట్ సినిమాలు తీస్తూ ఉన్నారు. అలాంటి డైరెక్టర్లు తెలుగులో ఎవ్వరూ లేరా అని అనుకున్న టైమ్ లో రాజమౌళి వచ్చాడు.ఇక ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో రాజమౌళి లాంటి ఒక డైరెక్టర్ ఉన్నాడు అని గర్వం గా చెప్పుకుంటాం అని చెప్పాడు…అంటే రాజమౌళి గొప్పతనం ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు…
ఇక రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచ స్థాయి డైరెక్టర్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇక ఇప్పుడు ఇండియా లో ఉన్న ప్రతి ఒక్క హీరో కూడా ఆయన తో సినిమాలు చేయడానికి రెఢీ అవుతున్నారు వాళ్ల ఎంటైర్ కెరియర్ లో ఒక్కసారైనా రాజమౌళి తో నటించాలి అని అనుకుంటున్నారు. ఇక ఇలాంటి టైం లో రాజమౌళి కి ఒక హీరో తో సినిమా చేయాలని ఉంది అని చెప్పాడు ఆయన ఎవరంటే తమిళ్ లో సూపర్ స్టార్ గా గుర్తింపు పొందిన సూర్య…సూర్య తమిళ్ లోనే కాకుండా తెలుగు లో కూడా సూపర్ హీరో గా మంచి గుర్తింపు పొందాడు అయితే ఒక ఇంటర్వ్యూ లో రాజమౌళి ని మీకు ఏ హీరో తో సినిమా చేయాలని ఉంది అని అడిగితే నాకు సూర్య తో ఒక సినిమా చేయాలని ఉంది ఎందుకంటే ఆయన మంచి నటుడు ఏ క్యారెక్టర్ లో అయిన ఒదిగిపోయి నటిస్తాడు కాబట్టి ఆయనతో ఒక సినిమా చేయాలని ఉంది అని అన్నాడు…
ఇక నేను ఆయనతో సినిమా చేయాలి అంటే దానికి సరిపడా కథ దొరకాలి అందుకే వెయిట్ చేస్తున్న కానీ తొందర్లోనే ఆయనతో ఒక సినిమా చేస్తాను అని చెప్పాడు…ఇక ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు హీరో గా పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు…ప్రస్తుతం ఆయన ఈ సినిమాకి సంభందించిన ప్రి ప్రొడక్షన్ పనుల్లో బిజీ గా ఉన్నాడు…ఇక ఈ సినిమాతో వరల్డ్ లోనే ఒక సూపర్ హిట్ సినిమా తీయాలని రాజమౌళి ప్రయత్నం చేస్తున్నట్టు గా తెలుస్తుంది…ఇక ఈ సినిమా లో హీరోయిన్ ఎవరు అనేది ఇంకా ఫైనల్ కాలేదు ఇక తొందర్లోనే అన్ని వివరాలను తెలియజేస్తారు…