https://oktelugu.com/

Rajamouli : మాకు తినడానికి తిండి లేని టైం లో ఆ ఒక్కడే మా ఫ్యామిలీని పోషించాడు : రాజమౌళి

అందువల్లే వీళ్ళిద్దరూ అంటే రాజమౌళికి చాలా ఇష్టం. అలాగే రాజమౌళి వాళ్ళ అమ్మ నాన్నలను ఎలాగైతే చూసుకుంటాడో వీళ్లిద్దరిని కూడా అలాగే చూసుకుంటాడు...

Written By:
  • NARESH
  • , Updated On : November 5, 2023 / 12:01 PM IST

    Rajamouli

    Follow us on

    Rajamouli : ప్రస్తుతం పాన్ వరల్డ్ సినిమా చేస్తున్న రాజమౌళి ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా కొనసాగాడు. ప్రస్తుతం ఆయన తెలుగులోనే కాదు ఇండియాలోనే నెంబర్ వన్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు.ఇక ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ దాటి పాన్ వరల్డ్ రేంజ్ కు వెళ్తున్నాడు…ఇక ఇదే క్రమంలో రాజమౌళి పిల్లాడి గా ఉండి చదువుకుంటున్న టైంలో రాజమౌళి వాళ్ళ నాన్న విజయేంద్రప్రసాద్, కీరవాణి వాళ్ళ నాన్న శివశక్తి దత్త సినిమా ఇండస్ట్రీలో అప్పుడప్పుడే చిన్న చిన్న సినిమాలకు కథలు రాస్తూ ఉండేవారు. ఇక ఇలాంటి సమయంలో ఇల్లు గడవడం చాలా కష్టం గా ఉండేది. వీళ్లదంత ఉమ్మడి కుటుంబం కావడం వల్ల ఇంట్లో దాదాపు 30 మంది దాకా జనాలు ఉండేవారు.

    ఇక దీంతో వీళ్ళందర్నీ పోషించడానికి శివశక్తి దత్త,విజయేంద్ర ప్రసాద్ తెచ్చే డబ్బులు సరిపోయేవి కావు ఇక ఇలాంటి సమయంలో కుటుంబ భారం మొత్తాన్ని ఎంఎం కీరవాణి తన భుజాల మీద వేసుకొని చాలా సంవత్సరాల పాటు మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి దగ్గర అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తూ ఫ్యామిలీ మొత్తాన్ని పోషిస్తూ ఉండేవాడు.ఇక ఇలాంటి క్రమంలోనే కీరవాణి వాళ్ళ వైఫ్ అయిన శ్రీవల్లి గారు రాజమౌళి, కళ్యాణ్ మాలిక్,కాంచి లాంటి వారందరినీ సొంత బిడ్డల్లాగా చూసుకునేవారు. ఒక రకంగా చెప్పాలంటే కీరవాణి అతని భార్య శ్రీవల్లి ఇద్దరూ కలిసి పనులు చేస్తూ ఉమ్మడి కుటుంబం గా ఉన్న వీళ్ళ కుటుంబాన్ని విడిపోకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళ కి తిండి దొరకని సమయంలో వీళ్ళందరికీ తిండి పెట్టింది కూడా వాళ్లే అని చెప్పాలి. ఇక ఆ కృతజ్ఞుత తోనే ప్రస్తుతం రాజమౌళి ఎంఎం కీరవాణిని తన సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగిస్తూ ఉంటాడు.

    అలాగే శ్రీవల్లి గారిని లైన్ ప్రొడ్యూసర్ గా, కాంచి గారిని స్క్రిప్ట్ కి సంబంధించిన పనుల్లో ఇన్వాల్వ్ చేస్తూ అలాగే కళ్యాణ్ మాలిక్ ని మ్యూజిక్ కి సంబంధించిన విషయంలో ఇన్వాల్వ్ చేస్తూ ఉంటారు ఇలా వీళ్ళ కుటుంబం మొత్తాన్ని రాజమౌళి తన సినిమాలో ఇన్వాల్వ్ చేసుకుంటూ వెళుతూ ఉంటాడు.ఇక ఇప్పటికి రాజమౌళికి కీరవాణి శ్రీవల్లి అంటే చాలా గౌరవం… అందుకే కీరవాణిని పెద్దన్న అని పిలుస్తూ ఉంటాడు. ఎందుకంటే కీరవాణి వీళ్ళందర్నీ పోషిస్తున్నప్పుడు అతని వైఫ్ అయిన శ్రీవల్లి ఇదంతా మనకెందుకు మన లైఫ్ మనం బతుకుదాం అని ఒక మాట చెప్పినట్టు అయితే ఫ్యామిలీ మొత్తం విడిపోయేది అలా కాకుండా ఆమె అందరిని కలుపుకుంటూ ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చింది. అందువల్లే వీళ్ళిద్దరూ అంటే రాజమౌళికి చాలా ఇష్టం. అలాగే రాజమౌళి వాళ్ళ అమ్మ నాన్నలను ఎలాగైతే చూసుకుంటాడో వీళ్లిద్దరిని కూడా అలాగే చూసుకుంటాడు…