https://oktelugu.com/

Mahesh – Rajamouli : ఎట్టకేలకు తన సినిమాలో మహేష్ క్యారెక్టర్ ఏంటో చెప్పేసిన జక్కన్న…

మరి ఈ సినిమాలో హిప్పి క్యారెక్టర్ చేయడం మహేష్ బాబు కి చాలా కొత్తగా ఉంటుంది. కాబట్టి ఈ క్యారెక్టర్ తో తను ఎంత మేరకు మెప్పిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది...

Written By:
  • Gopi
  • , Updated On : January 17, 2024 / 08:28 PM IST
    Follow us on

    Mahesh – Rajamouli : తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి ని మించిన దర్శకుడు మరొకరు లేరు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో కూడా రాజమౌళి ని కొట్టే దర్శకుడు మరొకరు కనిపించడం లేదు. చాలామంది దర్శకులు చాలా రకాల సినిమాలు తీసినప్పటికీ ఒక సినిమా మీద పిచ్చి ఉన్నోడు సినిమా తీస్తే ఎలా ఉంటుందో రాజమౌళి సినిమాలు చూస్తే మనకు అర్థమవుతుంది.

    ప్రతి ఒక్క సీన్ లో ప్రతి ఒక్క షాట్ లో తన పర్ఫెక్షన్ కనిపిస్తూనే ఉంటుంది. రాజమౌళి ఒక సినిమా తీస్తున్నాడు అంటే దానిమీద తన పూర్తి ఎఫర్ట్ పెట్టబోతున్నాడని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన చేసే సినిమాలు మామూలుగా ఉండవు కాబట్టి ఆయన తీసే సినిమాలు మాములు జనం నుంచి సినిమా పిచ్చి ఉండే వాళ్ళ దాకా అందరికీ విపరీతంగా నచ్చుతూ ఉంటాయి. ఇక అందులో భాగంగానే ఆయన తీసిన బాహుబలి, త్రిబుల్ ఆర్ సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకున్నాయి.

    ఇక ఇప్పుడు ఆయన మహేష్ బాబుతో ఒక పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి. మరి ఈ సినిమాతో ఆయన ఎంత మేరకు ప్రేక్షకులను అలరిస్తాడు అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది…ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో మహేష్ బాబు ఎలాంటి క్యారెక్టర్ పోషిస్తున్నాడు అంటూ చాలా రోజుల నుంచి చాలా వార్తలైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

    ఇక ఇప్పుడు తెలుస్తున్న సమాచారం ప్రకారం మహేష్ బాబు ఈ సినిమాలో ఒక హిప్పీ క్యారెక్టర్ లో కనిపించబోతున్నట్టుగా తెలుస్తుంది. హిప్పీ అంటే దేశ దిమ్మర్లు, ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి వలస వెళ్తూ ఉండేవారు. ఇలా తను తిరుగుతున్న ఏరియాల్లో కొన్ని ప్రాంతాల్లో జనాలు ఎదురుకుంటున్న కొన్ని ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసే వ్యక్తిగా కనిపించబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ సినిమాలో హిప్పి క్యారెక్టర్ చేయడం మహేష్ బాబు కి చాలా కొత్తగా ఉంటుంది. కాబట్టి ఈ క్యారెక్టర్ తో తను ఎంత మేరకు మెప్పిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది…