https://oktelugu.com/

Rahul Gandhi : రాహుల్ గాంధీ మరోసారి నాయకుడు కాదని రుజువు చేసుకున్నాడు

నాయకుడిగా రాహుల్ అవిశ్వాస తీర్మానాన్ని సరిగ్గా వాడుకోలేదు. రాహుల్ పై అనర్హత పడ్డప్పుడు వచ్చిన సానుభూతి నిన్నటి మాటలతో దూరమైంది.

Written By:
  • NARESH
  • , Updated On : August 10, 2023 / 01:56 PM IST

    Rahul Gandhi : రాహుల్ గాంధీ మరొక్కసారి నాయకుడు కాదని రుజువు చేసుకున్నాడు. సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులతో తిరిగి లోక్ సభలో ప్రవేశించారు. రావటం.. రావటమే మంచి అవకాశం వచ్చింది. అవిశ్వాసం తీర్మానంపై మాట్లాడడం.. అసలు అవిశ్వాస తీర్మానాన్ని ముందుంచి నడిపించేది రాహుల్ గాంధీయేనని అనుకున్నారు. మొదటిరోజు రాహుల్ గాంధీ మాట్లాడలేదు. రెండోరోజు ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ గా వచ్చాడు. ఇంకేముందు ఇరగదీస్తాడని అనుకున్నారు.

    మొదటి 5 నిమిషాలు అదానీపై పడ్డాడు. మరో 15 నిమిషాలు భారత్ జోడో యాత్ర ప్రమోషన్ కోసం వాడుకున్నాడు. ఆ తర్వాత చివర్లో మణిపూర్ గురించి స్లోగన్ లు ఇచ్చుకున్నాడు. మోడీ రావణుడు అంటూ వ్యక్తిగత ఆరోపణలు చేశారు. నాయకుడిగా రాహుల్ అవిశ్వాస తీర్మానాన్ని సరిగ్గా వాడుకోలేదు. రాహుల్ పై అనర్హత పడ్డప్పుడు వచ్చిన సానుభూతి నిన్నటి మాటలతో దూరమైంది.

    రాహుల్ గాంధీ పార్లమెంట్ ప్రసంగంపై ‘రామ్’గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.