https://oktelugu.com/

Chandramukhi 2 Review : చంద్రముఖి 2 మూవీ రివ్యూ.. హిట్టా? ఫట్టా?

ఇక చంద్రముఖి 2 మూవీ విషయానికి అవేమీ ఈ సినిమా లో పెద్దగా ఉండవు ఇక ఈ సినిమాలో హైలెట్ పోయింట అంటే ఇంటర్వల్ బ్యాంగ్ ఒక్కటి అనే చెప్పాలి

Written By:
  • Gopi
  • , Updated On : September 28, 2023 / 09:04 AM IST

    handramukhi 2 Review

    Follow us on

    Chandramukhi 2 Review : డైరెక్టర్ పి వాసు చాలా రోజుల తర్వాత రాఘవ లారెన్స్ ని కంగనా రనౌత్ ని లీడ్ రోల్స్ లో పెట్టీ తీసిన సినిమా చంద్రముఖి 2 … ఈ సినిమా ఇవాళ్ల ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అయితే 2005 లో వచ్చిన రజినీకాంత్ సూపర్ హిట్ సినిమా చంద్రముఖి కి సీక్వెల్ గా ఈ సినిమా వచ్చింది.మొదటి పార్ట్ లో రజినీకాంత్ తన నటన తో ప్రేక్షకులని విపరీతం గా అలరించాడు. ఇక ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో మంచి విజయం అందుకుంది ఇక దాదాపు 18 సంవత్సరాల తర్వాత చంద్రముఖి 2 అంటూ వచ్చిన ఈ సినిమా పరిస్థితి ఏంటి అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

    ఇక ముందుగా ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తె అందరికీ తెలిసిన స్టోరీనే ఏంటంటే ఇంతకుమందు చంద్రముఖి లో జ్యోతిక ని చంద్రముఖి ఆవహిస్తుంది దాంతో ఆమె చంద్రముఖి లా మారుతుంది.ఇక తన నుంచి చంద్రముఖి ని వేరే చేయడమే మొదటి పార్ట్ లోని ప్రధానాంశం అయితే ఈ సెకండ్ పార్ట్ లో మాత్రం డైరెక్ట్ గా చంద్రముఖి నే రంగం లోకి దిగి తనే ఆ ఇంటికి వస్తుంది ఇక ఆ ఇంట్లో ఉంటున్న ఫ్యామిలీ ఇబ్బంది పడటం తో లారెన్స్ వచ్చి ఆ చంద్రముఖి ని ఎలా బంధించాడు అలాగే ఆ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే వేటయ్య రాజు యొక్క స్పెషాలిటీ ఏంటి అసలు లారెన్స్ కి ఆ వేటయ్య రాజు కి మధ్య ఉన్న సంబంధం ఏంటి అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…

    ఇక ఈ సినిమా టెక్నికల్ విషయానికి వస్తె ఈ సినిమాలో కీరవాణి ఇచ్చిన మ్యూజిక్ పెద్దగా ఆకట్టుకోలేదు అలాగే ఈ సినిమా లో బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా పెద్దగా వినసొంపుగా లేదు అలాగే సినిమాలోని సీన్స్ ని ఎలివెట్ చేసేలా లేదు…ఇక సినిమాటోగ్రఫీ మాత్రం చాలా బాగుంది. అర్ డి రాజశేఖర్ తీసిన ప్రతి షాట్ కూడా చాలా అద్బుతం గా ఉన్నాయి. అందుకే ఈ సినిమా విజువల్ గా సూపర్ గా ఉంది.ఇక ఆర్ట్ డైరెక్టర్ తోట తరుణి గారు కూడా అన్ని సెట్స్ లలో రియాలిటీ లుక్ ని తీసుకు వస్తు చాలా గొప్ప గా ఆయన వర్క్ ఆయన చేశారు…ఇక ఎడిటర్ అంటోనీ మాత్రం తన కత్తేరకి ఇంకా కొంచం పని చెప్తే బాగుండేది… ఇక నటీనటుల అయిన రావు రమేష్ ,రాధిక శరత్ కుమార్,మహిమ నంబియార్,లక్ష్మి మీనన్,వడివేలు అందరుకూడా వల్ల పరిది మేరకు బాగా చేశారు…ఇక లారెన్స్ కంగనా మాత్రం యాక్టింగ్ బాగా చేసినప్పటికీ సినిమాలో అంత దమ్ము లేదని చెప్పవచ్చు.

    ఒక సినిమా కి సీక్వెల్ తీస్తున్నాం అంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అలాంటిది పి వాసు గారు ఆల్రెడీ ఇండస్ట్రీ నుంచి ఫేడ్ ఔట్ అయిపోయారు. ఆయన మళ్ళీ ఇప్పుడు వచ్చి కొత్తగా సినిమాలు చేస్తే బాగుండేది కానీ ఎప్పుడో వచ్చిన హిట్ సినిమాకి సీక్వెల్ తో వస్తె ఆ హైప్ లో ఈ సినిమా ఆడుతుంది అనుకుంటే పొరపాటే. ఒక సినిమా జనాలని ఎంగేజ్ చేయాలంటే ముందు గా అందులో బలమైన కథ ఉండాలి…ఇక చంద్రముఖి 2 మూవీ విషయానికి అవేమీ ఈ సినిమా లో పెద్దగా ఉండవు ఇక ఈ సినిమాలో హైలెట్ పోయింట అంటే ఇంటర్వల్ బ్యాంగ్ ఒక్కటి అనే చెప్పాలి ఇక కంగనా చంద్రముఖి గా చేసిన యాక్టింగ్ కూడా ఈ సినిమాకి అదనపు ఆకర్షణ ఇక అంతా మించి ఈ సినిమాలో పెద్ద గా ప్లస్ పాయింట్స్ అయితే ఏమి లేవు ఇక జనాలు ఈ వీకెండ్స్ లో ఒక్కసారి ఈ మూవీని చూడవచ్చు…