Radhakrishna – Ramoji Rao : డియర్‌ రాధాకృష్ణా.. రామోజీరావు చెంచాగిరీ గురించి నువ్వు చెప్పడం బాగోలేదోయ్‌!

అందరికీ తెలుసు రాధాకృష్ణా.. రామోజీరావు సుద్ధపూసేం కాదు. రాధాకృష్ణేం సత్య హరిశ్చంద్రుడేం కాదు.

Written By: NARESH, Updated On : August 20, 2023 7:12 pm
Follow us on

Radhakrishna – Ramoji Rao : సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయి. విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి. ఈ మాత్రం చెప్పడానికి మనమేం ఐన్ స్టిన్‌ కావాల్సిన అవసరం లేదు. పెద్ద పెద్ద పుస్తకాలు బట్టీ పట్టాల్సిన అవసరం అంతకన్నా లేదు. కానీ సజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి. ఇదేలా సాధ్యం అని మీరు అనకండి. ఇవ్వాళా దీ గ్రేట్‌ దమ్మున్న జర్నలిస్టు, విలువలే ఆస్తిగా బతికే పాత్రికేయుడు వేమూరి రాధాకృష్ణ.. తన ఆంధ్రజ్యోతి పత్రికలో కొత్త పలుకు పేరిట రాసిన ఓ ఎడిటోరి యల్‌లో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను చీల్చిచెండాడాడు. కానీ ఆ వ్యాస పరంపరలో తెలుగు మీడియా మొఘల్‌ రామోజీరావుకు సంఘీభావం ప్రకటించాడు. అదేంటి రామోజీరావుకు రాధాకృష్ణ సంఘీభావం ప్రకటించడం ఏంటి అని మీరు ప్రశ్నించకండి. ఎందుకంటే ఇప్పుడు జగన్‌ ఒత్తుతున్న ఒత్తుడుకు రామోజీకి ఊపిరి ఆడటం లేదు. అటు బీజేపీ నుంచి నరుక్కొచ్చినా ‘ఏహే ఎక్కడ చెప్పుకుంటావో చెప్పుకో పో’ అన్నట్టుగా జగన్‌ మార్గదర్శిలో మింగిన అక్రమ డబ్బును రామోజీ చేత కక్కిస్తున్నాడు.

ఇదే సమయంలో సొంత కులపోడు కాబట్టి రాధాకృష్ణ ఏకంగా రామోజీరావుకు అండగా నిలిచాడు. జగన్‌కు సాగిలపడటానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి చెంచాలు కావని, మిగతా మీడియా సంస్థలకు మాకు తేడా ఉందని బీరాలకు పోయాడు. కానీ ఇదే ఈనాడు ఎన్టీఆర్‌ బతికి ఉన్నప్పుడు(అప్పుడు రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి పేపర్‌లో టీడీపీ బీట్‌ రిపోర్టర్‌) రామోజీరావు ఎలాంటి వార్తలు రాశాడో తెలుగునాట అందరికీ తెలుసు. శ్రీధర్‌తో ఎలాంటి కార్టూన్లు వేయించాడో, దూబగుంట రోషమ్మ తో పోటీ పత్రికల ఆర్థిక మూలాలు దెబ్బతీసేందుకు సారా వ్యతిరేక ఉద్యమం ఎలా చేయించాడో అందరికీ విధితమే. ఇదే చెంచాగిరి తెలియని ఈనాడు(రాధాకృష్ణ పరిభాషలో) జగన్‌ అధికారంలోకి వచ్చిన రెండేళ్లల్లో ఎలాంటి వార్తలు రాసిందో అందరికీ గుర్తుకే ఉంది. జగన్‌ జాకెట్‌ యాడ్స్‌ ఇస్తున్నప్పుడు కళ్లకద్దుకుని అచ్చేసింది రామోజీరావే. తన మనమవరాళ్ల పెళ్ళిళ్లలకు స్వయంగా జగన్ ను పిలిచిందీ రామోజీరావే. శైలజ, భారతి మధ్య గంటల తరబడి చర్చలు జరిగిందీ ఆ రామోజీ ఫిలింసిటీలోనే.. ఈ వ్యవహారాలు మొత్తం రాధాకృష్ణకు తెలియవు అనుకోవాలా.. తెలిసిన జనం మర్చిపోయారు అనుకుంటున్నాడా?

చెంచాగిరి చేయబోము అని చెబుతున్న రాధాకృష్ణ.. ఆయాత చండీయాగం తర్వాత కేసీఆర్‌ గురించి కొత్తపలుకులో ఏం రాశాడో తెలుగు పాఠకులకు తెలియదా? ప్రగతిభవన్‌ డైరెక్షన్‌లోనే కదా నాడు ఈటల రాజేందర్‌ మీద వార్తలు రాసింది. కాళేశ్వరం మీద ప్రత్యేక పేజీలు ప్రచురించింది, కేసీఆర్‌ పాలన బాగుందని కీర్తించింది, చండీయాగంలో ముఖ్యమంత్రి చేతిలో సన్మానం చేయించుకుందీ.. అన్నీ అందరికీ గుర్తుకే ఉన్నాయి. ఇవి అసలే సోషల్‌ మీడియా రోజులు. కళ్ల మూసుకుని పాలు తాగుతున్నాం అనుకుంటే అంతకు మించిన మూర్ఖత్వం లేదు. అలా భ్రమపడితే బట్టలిప్పి నడిబజార్‌లో నెటిజన్లు నిలబెట్టగలరు. అన్నట్టు మార్గదర్శి మీద సొక్కం వార్తలు రాస్తున్న ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ.. అందులో చిట్టీ డబ్బులు ఏమయ్యాయో, ఖాతాదారులకు తెలియకుండా మ్యూచ్‌ వల్‌ ఫండ్స్‌లో ఎందుకు పెట్టుబడులు పెడుతున్నారో, దమ్మూధైర్యం ఉంటే కోర్టు కేసులు ఎదుర్కొక స్టేలు ఎందుకు తెచ్చుకుంటున్నారో.. అందరికీ తెలుసు రాధాకృష్ణా.. రామోజీరావు సుద్ధపూసేం కాదు. రాధాకృష్ణేం సత్య హరిశ్చంద్రుడేం కాదు. అందరివీ చెంచాగిరి బతుకులే. చెప్పుకుంటే ఇజ్జత్‌ పోతుంది. చెప్పుకోకుంటే మానం పోతుంది!