https://oktelugu.com/

Print Media: ప్రింట్ మీడియా దుకాణం బంద్ అయినట్టే.. ‘నమస్తే’ ఎఫెక్ట్ జస్ట్ శాంపిలే!

ఏపీలో అధికార పార్టీ సొంత పత్రిక ఇది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఒకేసారి 24 ఎడిషన్లతో అత్యంత ఘనంగా ప్రారంభమైంది. అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగులను ఇబ్బడి ముబ్బడిగా తీసుకుంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : January 2, 2024 / 05:45 PM IST
    Print Media

    Print Media

    Follow us on

    Print Media: మనం చాలా సార్లు చెప్పుకున్నాం కదా.. ప్రింట్ మీడియా పరిస్థితి బాగోలేదని.. ఇకపై బాగుండదని.. కోవిడ్ నెపంతో యాజమాన్యాలు అడ్డగోలుగా ఉద్యోగులను తొలగించాయి. ఉన్న ఉద్యోగుల జీతాల్లో కోతలు విధించాయి. నియామకాలను నిలుపుదల చేశాయి. తెలుగులో ఓ అగ్ర పత్రిక తప్ప దాదాపు మిగతా అన్ని పత్రికలు ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నవే. ఇంక్రిమెంట్లు ఇవ్వకుండా.. అధిక పని భారం మోపుతూ హింసిస్తున్నవే. వేరే ఉద్యోగం దొరకక, వయస్సు అయిపోయి, మీడియా అంటే ఒక వ్యసనం గా మారిపోయి.. చాలామంది దీనిని వీడటం లేదు. లేకుంటే పరిస్థితి మరో విధంగా ఉండేది. కోవిడ్ తర్వాత పేపర్ చదివే వాళ్ళు తగ్గిపోవడం.. సోషల్ మీడియా, డిజిటల్ మీడియా దూసుకు రావడంతో ప్రింట్ మీడియా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ప్రింటింగ్ వ్యయం కూడా పెరిగిపోవడం కూడా ఇందుకు కారణమని యాజమాన్యాలు చెబుతున్నాయి. ఇది తప్పని ఉద్యోగులు వారిస్తున్నారు. ఎందుకంటే సర్క్యులేషన్ ను చాలావరకు తగ్గించుకున్న పత్రికలపై వ్యయం ఎక్కడిదని వారు ప్రశ్నిస్తున్నారు. సర్కులేషన్ ను తగ్గించుకోగా, యాడ్ టారిఫ్ రేట్లను మాత్రం అడ్డగోలుగా పెంచారని వారు వివరిస్తున్నారు. ఇక తెలుగునాట అన్ని పత్రికల పరిస్థితి ఎలా ఉందో ఒకసారి గమనిస్తే..

    ఈనాడు

    ఇవాల్టికి సర్కులేషన్ ఫిగర్స్ లో ఈనాడు నెంబర్ వన్ గా కొనసాగుతోంది. కోవిడ్ సమయంలో ఉద్యోగులతో బలవంతంగా సెలవులు పెట్టించింది.. ఆ తర్వాత 50 సంవత్సరాలు దాటిన ఉద్యోగులకు గోల్డెన్ హ్యాండ్ షేక్ కింద వెళ్ళి పొమ్మని చెప్పింది. అంతే కాదు వారికి మంచి పరిహారం చెల్లించి వదిలించుకుంది. ప్రింట్ మీడియాలోకి కొత్తగా రిక్రూట్మెంట్ ను తీసుకోకుండా నిలిపివేసింది. ఈనాడు జర్నలిజం స్కూల్ ద్వారా కేవలం వెబ్, డిజిటల్ మీడియాలోకి ఉద్యోగులను తీసుకుంది. ప్రస్తుతానికి అయితే ఇంక్రిమెంట్ విషయంలో కానీ, డీఏ విషయంలో గానీ ఈనాడు వెనుకంజ వేయడం లేదు.. అయితే ఇటీవల మార్గదర్శి సంస్థల మీద ఏపీ సీఐడీ అధికారులు దాడులు చేసిన నేపథ్యంలో.. ఆ ప్రభావం ఈనాడు మీద ఉంటుందని అందరూ అనుకున్నారు.. కానీ అదేం లేకుండానే ఉద్యోగులకు సక్రమంగా వేతనాలు, ఇతర ప్రయోజనాలను ఈనాడు యాజమాన్యం కల్పించింది. గతంలో యాడ్ టారిఫ్ విషయంలో నిక్కచ్చిగా ఉండే ఈనాడు.. ఇప్పుడు చాలావరకు దిగివచ్చింది.

    సాక్షి

    ఏపీలో అధికార పార్టీ సొంత పత్రిక ఇది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఒకేసారి 24 ఎడిషన్లతో అత్యంత ఘనంగా ప్రారంభమైంది. అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగులను ఇబ్బడి ముబ్బడిగా తీసుకుంది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంది. ఫలితంగా ఆ ప్రభావం ఉద్యోగుల మీద పడింది. కాస్ట్ కటింగ్ పేరుతో చాలామంది ఉద్యోగులను ఇండ్లకు పంపించింది. అనంతరం ఏపీలో అధికారంలోకి జగన్ వచ్చిన తర్వాత జీతాల పెంపుదల విషయంలో అంతగా ఉదారత చూపలేదు. సాక్షిలో పెద్ద తలకాయలు మాత్రం జీతాలు భారీగానే పెంచుకున్నాయి. కింది స్థాయిలో మాత్రం ఆ వేతనాలు పెంపుదల అంతంత మాత్రం గానే ఉంది. ఈ సంవత్సరం పెంపుదల ఉంటుందా? లేదా? అనేది ఇంతవరకు బయటకు చెప్పడం లేదు. కోవిడ్ సమయంలో చాలామంది ఉద్యోగులు బయటకు వెళ్లిపోయారు. వారి స్థానంలో ఇంతవరకు కొత్తవారిని తీసుకోలేదు. పైగా పేపర్ల సంఖ్య కూడా కుదించడం.. ఉన్నవారితోనే పని చేయించుకుంటుంది.

    ఆంధ్రజ్యోతి

    సర్కులేషన్ ఫిగర్ తో సంబంధం లేకుండా యాడ్స్ సంపాదించుకునే పత్రిక ఏదైనా ఉందంటే అది ఆంధ్రజ్యోతి మాత్రమే. రిపోర్టర్లతో యాడ్స్, సర్కులేషన్ ఈ పత్రిక చేయించుకుంటుంది. అలాగని రిపోర్టర్లకు లైన్ ఎకౌంట్ ఇవ్వదు. కాగితాల్లో మాత్రం లైన్ ఎకౌంట్ ఇస్తున్నట్టు చెప్పుకుంటుంది. ఇక కోవిడ్ సమయంలో అడ్డగోలుగా ఉద్యోగులను తొలగించింది. అంతేకాదు ఉన్న ఉద్యోగుల వేతనాల్లో కూడా అడ్డగోలుగా కోతలు విధించింది.. కోవిడ్ తర్వాత రెండుసార్లు అంటే ఒకసారి వెయ్యి రూపాయలు, మరొకసారి వేతనంతో నిమిత్తం లేకుండా పది శాతం ఇంక్రిమెంట్ వేసింది. ప్రస్తుతం తెలంగాణలో అనుకూలమైన ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో ఈ సంస్థలో పనిచేసే ఉద్యోగులు వేతనంలో భారీ పెంపుదల ఉంటుందని ఆశిస్తున్నారు. అయితే సంస్థలో పనిచేసే ఒక పెద్ద తలకాయ దీనికి అటుపడుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. అయితే సెంట్రల్ డెస్క్ లో పనిచేసే వారికి ఇప్పటివరకు మూడుసార్లు వేతనంలో పెంపుదల జరిగింది. జిల్లాల్లో పనిచేసే వారికి మాత్రం అంతంత మాత్రం గానే వేతనాల్లో పెంపుదల ఉంది. సర్క్యులేషన్ ను అమాంతం తగ్గించుకున్న ఈ పత్రిక.. యాడ్ టారిఫ్ ను మాత్రం ఈనాడు కంటే ఎక్కువ పెంచడం విశేషం.. వెల్ఫేర్ ఫండ్ పేరుతో ఉద్యోగుల వేతనం నుంచి కొంత మినహాయించుకునే ఈ యాజమాన్యం.. కోవిడ్ సమయంలో చనిపోయిన ఏ ఒక్క ఉద్యోగికి కూడా నయా పైసా పరిహారం ఇవ్వలేదు. అంతేకాదు ఈ పత్రిక యాజమాన్యం ఉద్యోగుల విషయంలో ఏమాత్రం ఉదారత చూపదు.

    వెలుగు

    కాంగ్రెస్ నాయకుడు వివేక్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ పత్రిక.. తన యజమాని రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా వార్తలు రాస్తూ ఉంటుంది. ఆయన భారత రాష్ట్ర సమితిలో ఉన్నప్పుడు ఆ పార్టీకి అనుకూలంగా, బిజెపిలో ఉన్నప్పుడు దానికి అనుకూలంగా, ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారు కాబట్టి దానికి అనుకూలంగా వార్తలు రాస్తూ ఉంటుంది. పొలిటికల్ గా తన యజమాని స్టాండ్ తీసుకుంటుంది. వాస్తవానికి ఈ పత్రికకు ఒక దిశ దశ అంటూ లేకపోవడం విశేషం. మొదట్లో భారీగానే ఉద్యోగులను తీసుకున్నప్పటికీ.. తర్వాత క్రమక్రమంగా వారిని తొలగించింది. దీనికి సర్కులేషన్ కూడా అంతంతమాత్రమే ఉంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత పూర్తి డిజిటల్ ఎడిషన్ గా మార్చేందుకు యాజమాన్యం సన్నహాలు చేస్తున్నట్టు సమాచారం. ఇందులో పనిచేసే ఉద్యోగులకు వేతనాలు కూడా అంతంత మాత్రం గానే ఉన్నట్టు తెలుస్తున్నది.

    నమస్తే తెలంగాణ

    సరిగ్గా ఆ నెల క్రితం వరకు ఈ పత్రిక అధికారిక పత్రికగా వెలుగొందింది. అపరిమితమైన ప్రభుత్వ ఆ
    యాడ్స్, ప్రైవేట్ యాడ్స్ తో బీభత్సమైన రెవెన్యూ ను సంపాదించింది. అంతేకాదు ఎమ్మెల్యేలకు, ఎంపీలకు యాజమాన్యం సర్క్యులేషన్ బాధ్యత అప్పగించడంతో ప్రతి గులాబీ కార్యకర్త ఇంటికి ఈ పేపర్ చేరింది. ఎన్నికల సమయంలో చాలామందికి ఉచితంగానే ఈ పేపర్ ను పంపిణీ చేశారు. అంతేకాదు రోజు ప్రతిపక్షాల మీద ఈ పేపర్ ద్వారా భారత రాష్ట్ర సమితి కోట్ల లీటర్ల కొద్దీ విషం చిమ్మింది. ఆ తర్వాత అధికారం పోవడంతో ఈ పేపర్ యాజమాన్యానికి ఇప్పుడు వాస్తవ పరిస్థితి కనిపిస్తోంది. మొన్నటివరకు చాలామంది ఉద్యోగులను బయటకు వెళ్లిపోవాలని యాజమాన్యం ఆదే