https://oktelugu.com/

Narendra Modi : ఈ ఒక్క వీడియో చాలు.. మోడీ మనసు ఎంత గొప్పదో తెలియడానికి..

ఇటీవల ప్రధానమంత్రి ఓ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆ సభలో మోడీ ప్రసంగాని కంటే ముందు ఓ యువతి తన చేతిలో పూరి జగన్నాథుడి ఫోటో పట్టుకొని అటూ ఇటూ ఊపుతూ కనిపించింది. ఆ యువతి చేస్తున్న పనిని ప్రధానమంత్రి నిశితంగా పరిశీలించారు. సెక్యూరిటీ నిబంధనల నేపథ్యంలో ప్రధాని ఆ యువతి దగ్గరికి వెళ్ళలేకపోయారు.

Written By:
  • NARESH
  • , Updated On : March 11, 2024 / 10:32 PM IST
    Follow us on

    Narendra Modi : దేశానికి ప్రధానమంత్రయినప్పటికీ.. నరేంద్ర మోడీ పెద్దగా దర్పాన్ని ప్రదర్శించరు. తనకు ప్రోటోకాల్ లాంటి నిబంధనలు ఉన్నప్పటికీ సామాన్య మనుషులతో కలిసి పోవడానికి ఇష్టపడుతుంటారు. వారితో ముచ్చటిస్తుంటారు.. ప్రేమగా మాట్లాడుతుంటారు. ఇటీవల భారత మండపంలో చిన్న పిల్లలతో ఏర్పాటుచేసిన శిక్షణ కార్యక్రమాన్ని ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన చిన్నారులతో ముచ్చటించారు. వారు చెప్పే విషయాలను ఆసక్తిగా ఉన్నారు. ఆ వీడియో అప్పట్లో సోషల్ మీడియాను షేక్ చేసింది. ఆ మధ్య తనను కలవడానికి వచ్చిన ఓ ఎంపీతో ప్రధానమంత్రి మాట్లాడారు. వస్తూ వస్తూ ఆ ఎంపీ తన భార్యను, చిన్న బాబును ప్రధాని వద్దకు తీసుకొని వచ్చారు. ఆ చిన్న బాబును చూసిన ప్రధాని తను కూడా చిన్నపిల్లాడయిపోయారు. ఆ బాబుతో కొంతసేపు ఆటలాడారు. దానికి సంబంధించిన వీడియో కూడా అప్పట్లో సంచలనంగా మారింది. ఈ విషయాలు ఎందుకు చెప్తున్నామంటే.. ఊపిరి సలపనంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ.. క్షణం తీరికలేని పర్యటనలు ఉన్నప్పటికీ.. మోడీ తన సాధారణ జీవితాన్ని వదిలిపెట్టరు. మనుషులతో సంభాషించడాన్ని మర్చిపోరు.

    ఇటీవల ప్రధానమంత్రి ఓ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆ సభలో మోడీ ప్రసంగాని కంటే ముందు ఓ యువతి తన చేతిలో పూరి జగన్నాథుడి ఫోటో పట్టుకొని అటూ ఇటూ ఊపుతూ కనిపించింది. ఆ యువతి చేస్తున్న పనిని ప్రధానమంత్రి నిశితంగా పరిశీలించారు. సెక్యూరిటీ నిబంధనల నేపథ్యంలో ప్రధాని ఆ యువతి దగ్గరికి వెళ్ళలేకపోయారు. అయితే ఆ యువతి తనను ప్రధానమంత్రి చూడలేదనుకున్నది. కానీ మోడీ అలా కాదు కదా.. ప్రతి విషయాన్ని అత్యంత సూక్ష్మంగా పరిశీలిస్తారు. అందుకే తన వ్యక్తిగత భద్రతా సిబ్బందిని పిలిపించి ఆ యువతి వివరాలు కనుక్కోమని చెప్పారు. ఆ సభలో మోడీ ప్రసంగం పూర్తి అయిన తర్వాత.. ఆ యువతి దగ్గరికి సెక్యూరిటీ సిబ్బంది వెళ్లిపోయారు. ఆమె వద్ద నుంచి పూరి జగన్నాథుడి చిత్రపటాన్ని తీసుకొని మళ్లీ వేదిక వద్దకు వచ్చారు.

    అలా సెక్యూరిటీ సిబ్బంది తీసుకొచ్చిన పూరి జగన్నాధుడి ఫోటోను ప్రధానమంత్రికి అందజేశారు. ప్రధానమంత్రి ఆ ఫోటోను చేత పట్టుకొని వేదిక ముందుకు వచ్చి అటూ ఇటూ ఊపుతూ కనిపించారు. దీంతో ఆ యువతి ఆనందానికి అవధులు లేవు. తను ఇవ్వాలనుకున్న ఫోటోను అంతమంది సభికుల మధ్యన, తనను ఉద్దేశించి చూపడం పట్ల ఆ యువతి ఉబ్బితబ్బిబయింది. ఈ దృశ్యాన్ని బిజెపి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా లక్షల్లో వ్యూస్ నమోదయ్యాయి. వేలాదిమంది తమ స్పందనలు తెలియజేశారు.”ప్రధాని ప్రతీ విషయాన్ని పరిశీలిస్తారు. తన కలవలేకపోయిన వ్యక్తులను ఇలా ఆనందింప చేస్తారంటూ” నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.