https://oktelugu.com/

Kannappa: కన్నప్పలో మంచు విష్ణుకు జంటగా యంగ్ బ్యూటీ… రవితేజ హీరోయిన్ ప్లేస్ లో!

దశాబ్దాల అనంతరం ఆ కథను కన్నప్పగా మంచు విష్ణు తెరకెక్కిస్తున్నారు. ఫస్ట్ షెడ్యూల్ న్యూజిలాండ్ లో ప్లాన్ చేశారు. షిప్ లో షూటింగ్ కి కావలసిన ప్రాపర్టీ రవాణా చేశారు.

Written By:
  • NARESH
  • , Updated On : December 15, 2023 / 12:36 PM IST

    Kannappa

    Follow us on

    Kannappa: మంచు విష్ణుకు కనీస మార్కెట్ లేదు. ఆయన హిట్ కొట్టి ఏళ్ళు అవుతుంది. అయినా పట్టుదలతో పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. కన్నప్ప టైటిల్ తో ఆయన చేస్తున్న మూవీ న్యూజిలాండ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. భారీ బడ్జెట్ తో ఈ పీరియాడిక్ డివోషనల్ మూవీ చేస్తున్నారు. భక్త కన్నప్ప కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. అప్పట్లో కృష్ణంరాజు నటించిన భక్త కన్నప్ప బ్లాక్ బస్టర్ హిట్. దర్శకుడు బాపు తెరకెక్కించిన ఈ మూవీ క్లాసిక్ గా నిలిచిపోయింది.

    దశాబ్దాల అనంతరం ఆ కథను కన్నప్పగా మంచు విష్ణు తెరకెక్కిస్తున్నారు. ఫస్ట్ షెడ్యూల్ న్యూజిలాండ్ లో ప్లాన్ చేశారు. షిప్ లో షూటింగ్ కి కావలసిన ప్రాపర్టీ రవాణా చేశారు. మరి కన్నప్ప షూటింగ్ న్యూజిలాండ్ లో చేయడానికి కారణం ఏమిటో తెలియదు. కన్నప్ప చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన గతంలో మహాభారతం సీరియల్ కి దర్శకత్వం వహించారు.

    కాగా కన్నప్ప చిత్రానికి హీరోయిన్ గా కృతి సనన్ చెల్లెలు నుపుర్ సనన్ ని ఎంచుకున్నారు. శ్రీకాళహస్తిలో జరిగిన పూజా కార్యక్రమంలో కూడా నుపుర్ సనన్ పాల్గొంది. కారణం తెలియదు కానీ షూటింగ్ కొన్ని రోజుల్లో మొదలవుతుంది అనగా ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. ఈ విషయాన్ని మంచు విష్ణు స్వయంగా తెలియజేశారు. డేట్స్ కుదరక ప్రాజెక్ట్ చేయడం లేదని చెప్పారు. తాజాగా కొత్త హీరోయిన్ ని ప్రకటించారు.

    ప్రొఫెషనల్ డాన్సర్ అయిన ప్రీతి ముకుందన్ ని కన్నప్ప హీరోయిన్ గా ఎంపిక చేశారు. కన్నప్ప లో పాత్రకు ఆమె సరిపోతుందని భావించిన యూనిట్ ఎంపిక చేశారట. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. ఇక కన్నప్ప చిత్రంలో ప్రభాస్, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, నయనతార వంటి స్టార్ క్యాస్ట్ గెస్ట్ రోల్స్ చేస్తున్నారు. పలు భాషల్లో ప్రచారం దక్కేలా ఇతర పరిశ్రమలకు చెందిన స్టార్స్ ని తీసుకున్నారు. మంచు విష్ణు ఈ చిత్రాన్ని స్వయంగా నిర్మిస్తున్నారు.