Homeజాతీయ వార్తలుPrashant Kishor: పీకే చేరికతో కాంగ్రెస్ గెలుస్తుందా? బీజేపీని ఓడించడం సాధ్యమేనా?

Prashant Kishor: పీకే చేరికతో కాంగ్రెస్ గెలుస్తుందా? బీజేపీని ఓడించడం సాధ్యమేనా?

Prashant Kishor: ఒకే ఒక్కడు. ఇప్పుడు దేశంలో అరవీర భీకరంగా తయారైన బీజేపీని మట్టికరిపించగలడా? కనీసం ఉనికి లేకుండా ఊసూరుమంటున్న కాంగ్రెస్ లో జవసత్వాలు నింపగలడా? పీకే చేరికతో కాంగ్రెస్ కు అధికారం సాధ్యమవుతుందా? బీజేపీ ఓడిపోతుందా? అన్న ప్రశ్నలు ఇప్పుడు అందరిలోనూ ఉదయిస్తున్నాయి.. అయితే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ చేరికపై కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తోంది. కొన్ని కండీషన్లు పెడుతోంది. ప్రస్తుత రాజకీయాల్లో ఇది మళ్లీ చర్చనీయాంశమైంది. కాంగ్రెస్‌లో ప్రశాంత్‌ కిషోర్‌ చేరికతో లాభం పొందే అవకాశాలున్నప్పటికీ పీకే ఇప్పటికే చేసుకున్న కమిట్మెంట్ల విషయంలో అధిష్టానం అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్ర సీఎం జగన్, వైఎస్సార్‌ టీపీ అధ్యక్షురాలు వైఎస్‌.షర్మిలతో చేసుకున్న ఒప్పందాలు రద్దు చేసుకున్న తర్వాతనే పీకే కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Prashant Kishor
Prashant Kishor

దేశంలో విజయవంతమైన ఎన్నికల వ్యూహకర్తగా పేరుపొందిన ప్రశాంత్‌ కిశోర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు ఎంత ఉత్సాహం చూపుతున్నారో, కాంగ్రెస్‌ సైతం ఆయన చేరికను అంతే కీలకంగానే భావిస్తోంది. గడిచిన ఏడేళ్లలో ఎన్నడూ లేని విధంగా అధినేత్రి సోనియాగాంధీ పార్టీయేతర వ్యక్తికి ఇంతగా ప్రాముఖ్యత ఇస్తుండటం, మూడు రోజుల వ్యవధిలో వరుసగా రెండుసార్లు పీకేతో భేటీకి పిలవడం అనూహ్య పరిణామంగా నిలిచింది.

Also Read: Nellore Politics: నెల్లూరి వైసీపీలో ఆగని రచ్చ.. సీఎం జగన్ జోక్యం చేసుకున్నా ఫలితం శూన్యం

-గాంధేయవాద పార్టీలోనే భవిష్యత్తు వెతుక్కోవాలని..
పొలిటికల్‌ స్ట్రాటజిస్టుగా భిన్న ఐడియాలజీలున్న పార్టీలతో పని చేసిన ప్రశాంత్‌ కిశోర్‌.. పొలిటీషియన్‌గా మాత్రం తాను బలంగా నమ్మే గాంధేయవాద పార్టీలోనే ఉండాలని భావిస్తున్నారు. ఇదే సమయంలో వరుసగా రెండు పర్యాయాలు కేంద్రంలో అధికారానికి దూరమైన కాంగ్రెస్‌ రాష్ట్రాల్లోనూ అధికారం కోల్పోతూ వస్తోంది. ఈ క్రమంలో పీకే చేరికతో లాభం పొందే అవకాశాలున్నప్పటికీ ఇప్పటికే పీకే చేసుకున్న కమిట్మెంట్ల విషయంలో అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో స్పష్టత వచ్చిన తర్వాతే అధికారికంగా కాంగ్రెస్‌లో పీకే చేరిక ఉంటుందని సమాచారం.

-అడ్డు వస్తున్న అంశాలు ఇవే..
కాంగ్రెస్‌ లో చేరేందుకు పీకేను అడ్డుగా నిలుస్తోన్న అంశాల్లో ప్రధానమైనది ఆయన వ్యూహకర్తగా పనిచేస్తున్న పార్టీలే. కాంగ్రెస్‌ విరోధులకు ఎన్నికల గెలుపు సలహాలు ఇస్తూ తిరిగి ఆ పార్టీలోనే నేతగా కొనసాగడం అసంభవం. వ్యూహకర్త వృత్తిని పూర్తిగా వదిలేసి, పక్కా కాంగ్రెస్‌ కార్యకర్తగా ఉంటానంటేనే కాంగ్రెస్‌లో చేరాలని సోనియాగాంధీ కండీషన్‌ పెట్టినట్లు చర్చ జరుగుతోంది. పీకే ఇప్పటికీ అనుబంధం కొనసాగిస్తున్న పార్టీల్లో టీఎంసీ అధినేత్రి, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ.. కాంగ్రెస్‌ పార్టీతో జతకట్టేందుకు సిద్ధ్దమైనట్లు ఇప్పటికే సంకేతాలిచ్చారు. డీఎంకే చీఫ్, తమిళనాడు సీఎం స్టాలిన్‌ ఎప్పటి నుంచో కాంగ్రెస్‌ భాగస్వామినే. వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్‌తో మాట కలిపే అంశాన్ని 2024 ఫలితాలను బట్టి కాంగ్రెస్‌ పునరాలోచించే అవకాశముంది. వైఎస్పార్‌ టీపీ అధినేత్రి షర్మిలతోనూ అసెంబ్లీ ఎన్నికల తర్వాతే మాట్లాడే చాన్స్‌ ఉంది. ఒక్క టీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ అంశంలోనే పీకే క్లారిటీ రావాల్సి ఉందని తెలుస్తోంది.

Prashant Kishor
Prashant Kishor

-కాంగ్రెస్‌కు పీకే ఎంతో అవసరం..
ఎన్నికల వ్యూహకర్తగా మంచి పేరున్న పీకే అవసరం ప్రస్తుతం కాంగ్రెస్‌ కు చాలా ఉంది. పడిపోతున్న కాంగ్రెస్‌ గ్రాఫ్‌ ఆయన చేరికతో పెరుగుతుందని అధిష్టానం భావిస్తోంది. ఈ క్రమంలోనే పీకేతో సంప్రదింపులు జరుపుతోంది. నిజానికి ప్రశాంత్‌ కిషోర్‌ తో చర్చలు, ఆయన చేసిన ప్రెజెంటేషన్లను వినడం, పార్టీలోకి ఆహ్వానించడం లాంటి చర్యలతో సోనియాగాంధీ తన అమితాసక్తిని ప్రదర్శిస్తున్నారు. గాంధీల కుటుంబ నాయకత్వాన్ని సవాలు చేస్తోన్న జీ–23 అసమ్మతి నేతలు మినహాయించి మిగతా సీనియర్లు చాలా మందితో పీకే చేరిక అంశంపై సోనియా అంతర్గత చర్చలు జరిపారు. 2024 సార్వత్రిక ఎన్నికలు, అంతకంటే ముందు జరుగనున్న గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల కోసం పీకే ఇచ్చిన రోడ్‌ మ్యాప్‌ను పరిశీలించేందుకు సోనియా ఓ కమిటీని కూడా నియమించాలని అనుకుంటున్నట్లు కాంగ్రెస్‌ వర్గాలే తెలిపాయి. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కటీఫ్‌ చెప్పిన తర్వాతనే తమ పార్టీలో చేరే పీకేకు రెడ్‌ కార్పెట్‌ వేయాలని సోనియాగాంధీ భావిస్తున్నట్లు ఆ పార్టీలోని నాయకులు పేర్కొంటున్నారు.

-కాంగ్రెస్ ను పీకే అధికారంలోకి తీసుకురాగలరా?

Prashant Kishor
Prashant Kishor

2014లో సామాన్యుడు, చాయ్ వాలా నినాదంతో మంచి వ్యూహాలు రూపొందించి నరేంద్రమోడీని ప్రధానిని చేసిన ఘనత పీకే. బీజేపీకి వ్యూహకర్తగా పనిచేసిన పీకే బీజేపీని నాడు అధికారంలోకి తీసుకురావడంలో తన వంతు పాత్ర పోషించారు. ఇక అప్పటి నుంచి బీజేపీ వెనుదిరిగి చూసుకోలేదు. ఇప్పుడు అఖండంగా ఎదిగిన బీజేపీని దెబ్బతీయాలంటే ఆ పార్టీని రాష్ట్రాల్లో చిత్తుగా ఓడించిన పీకే సేవలు కాంగ్రెస్ కు అత్యవసరం.. ఇప్పటికే ఢిల్లీ, బెంగాల్,పంజాబ్, తమిళనాడు, ఏపీల్లో బీజేపీని, ఇతర పార్టీలను చిత్తుగా ఓడించేలా పీకే వ్యూహాలు అద్భుతంగా పనిచేశాయి. ముఖ్యంగా బెంగాల్ లో బీజేపీతో చేతిలో ఓడిపోతుందనుకున్న మమతా బెనర్జీని పీకే తన వ్యూహాలతోనే గెలిపించారు. ఢిల్లీ, పంజాబ్ లలోనూ బీజేపీకి చుక్కలు చూపించారు. ఆ పార్టీని ఎలా ఓడగొట్టాలో పీకేకు బాగా తెలుసు. అందుకే పీకే చేరికతో కాంగ్రెస్ కు లాభమే. ఈ ప్రాంతీయ పార్టీలను పీకే దగ్గర చేర్చి కాంగ్రెస్ కు సపోర్టు చేయించగలరు. సో ఆ కమిట్ మెంట్లు అన్నింటిని కాలదన్నుకొని వస్తే పీకే చేరిక కాంగ్రెస్ కు లాభమే. ఆయనతో దేశంలో అధికారం సాధ్యమేననడంలో ఎలాంటి సందేహం లేదు. పైగా రెండు సార్లు గెలిచిన వ్యతిరేకత.. కరోనా కల్లోలం.. భారీగా ధరల పెంపుతో బీజేపీపై కాస్త వ్యతిరేకత పెరిగింది. దాన్ని క్యాష్ చేసుకోలేని నిస్సహాయ స్థితిలో కాంగ్రెస్ ఉంది. ఇప్పుడు పీకే చేరికతో ఆలోటు తీరి బీజేపీని ఓడించే ఐడియాలు పనిచేస్తాయని విశ్లేషకులు అంటున్నారు.

Also Read:BJP Focused On Khammam: ఆపరేషన్‌ కమలం: ఖమ్మంపై కాషాయ పార్టీ దృష్టి.. కేంద్ర మంత్రులు.. జాతీయ నేతల రాక

Recommended Videos:

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular