https://oktelugu.com/

Prabhas Shiva Look: శివుడిగా మూడు రోజులు ప్రభాస్.. లుక్ వైరల్…

గ్రాఫిక్స్ ప్రాధాన్యం ఉన్న సీన్స్ ని చిత్రీకరించే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక అందులో భాగంగానే శివుడి పాత్రను కూడా తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. దీనికోసం ప్రభాస్ ఈ సినిమాలో నటిస్తున్నాడని ఫిబ్రవరి 17 నుంచి 19వ తేదీ వరకు మూడు రోజులు ఆయన ఈ సినిమా కోసం డేట్స్ కేటాయించారని తెలుస్తుంది.

Written By:
  • Gopi
  • , Updated On : January 30, 2024 / 09:17 AM IST
    Follow us on

    Prabhas Shiva Look: మంచు విష్ణు హీరోగా నటిస్తూ నిర్మిస్తూ సినిమా భక్త కన్నప్ప. ఈ సినిమా అత్యంత ప్రస్టేజియస్ గా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాతో ఎలాగైనా సరే సక్సెస్ ని సాధించాలని మంచు విష్ణు చాలా దృఢ సంకల్పంతో ఉన్నాడు. ఇక ఇలాంటి క్రమం లోనే మధుబాల, మోహన్ లాల్, శరత్ కుమార్ లాంటి స్టార్ దిగ్గజ నటులు కూడా నటిస్తున్నారు. ఇక ఇది ఇలా ఉంటే చాలా ఈ సినిమాలో శివుడి పాత్ర లో ప్రభాస్ నటిస్తున్నాడనే వార్త సోషల్ మీడియా ల్ తెగ చక్కర్లు కొడుతుంది. మరి ఈ సినిమాలో ప్రభాస్ నటిస్తున్నాడా లేదా అనే విషయం మీద కూడా ఇంకా స్పష్టత అయితే లేదు. ఇక ప్రస్తుతం ఈ సినిమా నుంచి అందుతున్న సమాచారం ఏంటి అంటే ఇటీవలే ఈ సినిమా న్యూజిలాండ్ నుంచి ఒక పెద్ద షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకొని వచ్చారు.

    ఇక ఇప్పుడు గ్రాఫిక్స్ ప్రాధాన్యం ఉన్న సీన్స్ ని చిత్రీకరించే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక అందులో భాగంగానే శివుడి పాత్రను కూడా తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. దీనికోసం ప్రభాస్ ఈ సినిమాలో నటిస్తున్నాడని ఫిబ్రవరి 17 నుంచి 19వ తేదీ వరకు మూడు రోజులు ఆయన ఈ సినిమా కోసం డేట్స్ కేటాయించారని తెలుస్తుంది. ఇక పార్వతి పాత్రలో నయనతార నటిస్తుంది. ఇక ఈ సినిమాలో మంచు ఫ్యామిలీ కి సంబంధించిన మూడు జనరేషన్ల నటులు నటించబోతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

    మోహన్ బాబు, విష్ణు, అలాగే విష్ణు వాళ్ల కొడుకు ముగ్గురు ఈ సినిమాలో నటిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమా దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. మంచు విష్ణుకు అంత మార్కెట్ లేనప్పటికీ స్టార్ కాస్టింగ్ ని తీసుకొని ఎలాగైనా సరే ఈ సినిమాతో సక్సెస్ ని సాధించాలని చూస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకి బాలీవుడ్ డైరెక్టర్ అయిన ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు… మరి నిజంగానే ఈ సినిమా ప్రభాస్ నటిస్తున్నాడా లేదా అనే విషయాలు తెలియాల్సి ఉన్నాయి…