దేశంలో చాలామంది పోస్టాఫీస్ ఖాతాలను కలిగి ఉన్నారు. పోస్టాఫీస్ ఖాతా ఉన్నవాళ్లు నగదు డిపాజిట్ చేయాలన్నా, విత్ డ్రా చేయాలన్నా ఎలాంటి ఛార్జీలను చెల్లించాల్సిన అవసరం లేదనే సంగతి తెలిసిందే. అయితే ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధనలు అమలులోకి రావడంతో పాటు నగదు ఉపసంహరణలు, డిపాజిట్లలపై చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. పోస్టల్ శాఖ ఒక ప్రకటనలో ఈ విషయాలను వెల్లడించింది.
Also Read: ఉద్యోగులకు ఆ రెండు కంపెనీలు శుభవార్త.. ఫ్రీగా కరోనా వ్యాక్సిన్..?
అయితే నెలకు నాలుగు సార్లు నగదు ఉపసంహరణ చేసుకుంటే ఎలాంటి ఛార్జీలను చెల్లించాల్సిన అవసరం లేదు. అలా కాకుండా నాలుగు కంటే ఎక్కువసార్లు నగదు విత్ డ్రా చేస్తే ప్రతి లావాదేవీకి రూ.25 చొప్పున ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే బ్యాంకుల్లో ఈ విధానం బ్యాంకుల్లో అమలులో ఉండగా పోస్టాఫీస్ లలో కూడా అమలులోకి రావడం గమనార్హం. బ్యాంకులు ఏటీఎంల నుంచి నాలుగు కంటే ఎక్కువసార్లు నగదు విత్ డ్రా చేస్తే ఛార్జీలను విధిస్తున్నాయి.
Also Read: బిచ్చగాడిగా మారిన కోటీశ్వరుడు.. అసలేం జరిగిందంటే..?
అయితే పోస్టల్ శాఖ ప్రాథమిక పొదుపు ఖాతాను కలిగి ఉన్నవాళ్లకు ఎలాంటి ఛార్జీలను వసూలు చేయదు. కరెంటు ఖాతా ఉంటే ప్రతి నెలా ఏకంగా 25 వేల రూపాయల చొప్పున విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. అదే సమయంలో నెలకు పది వేల రూపాయలు ఎటువంటి ఛార్జీలు లేకుండా డిపాజిట్ చేయవచ్చు. పదివేల కంటే ఎక్కువ మొత్తం డిపాజిట్ చేయాలంటే లావాదేవీకి 25 రూపాయల చొప్పున చెల్లించాలి.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం
ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్‌పై కూడా ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుందని సమాచారం. ఐపీపీబీయేతర నెట్ వర్క్‌లలో నెలకు మూడు లావాదేవీలు ఫ్రీగా చేయవచ్చని మినీ స్టేట్ మెంట్ తీసుకోవడానికి ఐదు రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తోంది.