PM Modi: పంజాబ్ రాష్ట్రంలో ప్రధాని నరేంద్రమోడీకి జరిగిన భద్రతాలోపం.. 20 నిమిషాల పాటు ఒక ప్రధానిని రోడ్డుపై నిలబెట్టి చేసిన అవమానం దేశమంతా సంచలనమైంది. అయితే తెలుగు మీడియా మాత్రం దాన్ని అవమానించేలా వ్యక్తీకరించింది. అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదు. ఒక దేశ ప్రధానికి భద్రతా లోపం అనేది మనకు మనం అవమానించుకోవడమే. ప్రధాని భద్రతలో రాజకీయాలు జొప్పించడమే దౌర్భాగ్యమని చెప్పొచ్చు.

కాంగ్రెస్ అధికారంలో ఉన్న పంజాబ్ లో కావాలనే ప్రధాని మోడీని అవమానించిన తీరు ఇప్పుడు దుమారం రేపింది. కాంగ్రెస్ ఎంత కవర్ చేసుకోవడానికి చూసినా మన దేశంలోనే అత్యంత భద్రత కలిగిన వ్యక్తికే ఇంతటి భద్రతా లోపం ఉంటే ఇక సామాన్యులకే ఏం రక్షణ కల్పిస్తామన్న కనీస సృహను కాంగ్రెస్ వదిలేసింది. పైగా రాజకీయాలు చేసింది. ఇంతకంటే సిగ్గుచేటు అయిన విషయం మరొకటి లేదు.
ప్రధాని పర్యటన అంటే ఎంతో భద్రత చర్యలు తీసుకుంటారు. కానీ దీన్ని కూడా కాంగ్రెస్ రాజకీయం చేసింది. కాంగ్రెస్ సీఎంలు, నేతలు దీన్ని బీజేపీ రాజకీయం చేస్తుందని ఆరోపించడం నిజంగా సిగ్గుచేటైన విషయం.
ఇప్పటికే సెక్యూరిటీ లోపంతో ఇద్దరు ప్రధాన మంత్రులను భారతదేశం కోల్పోయింది. ఇప్పుడు ప్రపంచంలోనే పవర్ ఫుల్ లీడర్ అయిన మోడీకే మన దేశంలో ఇంతటి భద్రతా వైఫల్యం చూశాక దేశ ప్రజలంతా ఖిన్నులయ్యారు. కాంగ్రెస్ సర్కార్ మోడీ విషయంలో పంజాబ్ లో వ్యవహరించిన తీరుపై అందరిలోనూ ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాన మంత్రి భద్రతా లోపంపై రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ తీరుపై ‘రామ్’ టాక్ సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.