https://oktelugu.com/

రైతులకు మోదీ సర్కార్ శుభవార్త.. మళ్లీ ఖాతాల్లో రూ.2000..?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ రైతులకు శుభవార్త చెప్పింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ లో భాగంగా మళ్లీ రైతుల ఖాతాలలో 2,000 రూపాయలు డిపాజిట్ చేయడానికి సిద్ధమైంది. గతేడాది డిసెంబర్ నెలలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ ఏడవ విడత నగదు జమ కాగా ఎనిమిదో విడత నగదు మార్చి నెలలో జమ కానుంది. నివేదికలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్న నేపథ్యంలో నగదు జమైతే రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 22, 2021 12:38 pm
    Follow us on

    కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ రైతులకు శుభవార్త చెప్పింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ లో భాగంగా మళ్లీ రైతుల ఖాతాలలో 2,000 రూపాయలు డిపాజిట్ చేయడానికి సిద్ధమైంది. గతేడాది డిసెంబర్ నెలలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ ఏడవ విడత నగదు జమ కాగా ఎనిమిదో విడత నగదు మార్చి నెలలో జమ కానుంది. నివేదికలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్న నేపథ్యంలో నగదు జమైతే రైతులకు ప్రయోజనం చేకూరుతుంది.

    ఇప్పటికే మీరు పీఎం కిసాన్ స్కీమ్ కింద గతంలో జమ చేసిన సమయంలో 2,000 రూపాయలు పొందితే ఇప్పుడు కూడా 2,000 రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. ప్రతి సంవత్సరం మోదీ సర్కార్ పీఎం కిసాన్ స్కీమ్ అమలులో భాగంగా 6,000 రూపాయలు జమ చేస్తోంది. ప్రతి విడతలో 2,000 రూపాయల చొప్పున మూడు విడతల్లో ఈ నగదు రైతుల బ్యాంక్ అకౌంట్ లో జమవుతుంది. అర్హత ఉన్న ప్రతి రైతు ఖాతాలో ఈ నగదు జమవుతుంది.

    ఏదైనా కారణం వల్ల అర్హత ఉండి ఈ నగదు జమ కాకపోతే వ్యవసాయాధికారులను సంప్రదించి పీఎం కిసాన్ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. పీఎం కిసాన్ వెబ్ సైట్ ద్వారా బెనిఫీసియరీ లిస్ట్‌లో పేరు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. ఫార్మర్స్ కార్నర్ అనే ఆప్షన్ ను క్లిక్ చేసి బెనిఫీషియరీ లిస్ట్ ఆప్షన్ ను ఎంచుకుంటే ఈ ప్రయోజనాలను పొందవచ్చు.

    రాష్ట్రం, జిల్లా, ఊరు పేరు ఎంటర్ చేసి జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు ఈ స్కీమ్ కు దరఖాస్తు చేసుకోకపోయి ఉంటే ఆన్ లైన్ ద్వారా ఈ స్కీమ్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంక్ అకౌంట్, పొలం పాస్‌బుక్, ఆధార్ కార్డు ఉంటే సులభంగా ఈ స్కీమ్ లో చేరే అవకాశం ఉంటుంది.