https://oktelugu.com/

PIC OF THE DAY : లోకేష్, బాలయ్యలకు ‘పవన్ కళ్యాణ్’నే సారథి

చంద్రబాబుతో భేటి తర్వాత పవన్ కళ్యాణ్ ముందుండి నడిచారు. బాలయ్య, లోకేష్ లు వెనుక రాగా.. జనసేనాని.. వీరి సైన్యాన్ని నడిపించే యోధుడిగా కనిపించాడు.

Written By:
  • NARESH
  • , Updated On : September 14, 2023 / 02:29 PM IST

    pawan pic

    Follow us on

    Pawan Kalyan : కొన్ని దృశ్యాలు కదిలిస్తాయి.. స్పూర్తినిస్తాయి. నాయకత్వ లోపంతో భవిష్యత్ పై బెంగతో ఉన్న తెలుగుదేశానికి వెన్నుదన్నుగా నిలబడుతాయి. ఇన్నాళ్లు టీడీపీ అంటే చంద్రబాబు.. చంద్రబాబు అంటే టీడీపీ.. వారసుడిగా లోకేష్ శక్తి సామర్థ్యాలు సరిపోవడం లేదు. బామ్మర్ధి బాలయ్య అండ మాత్రమే కనిపిస్తోంది. ఈ క్రమంలోనే చంద్రబాబు జైలు పాలు అవ్వగానే అంతా తలకిందులైంది. నారా ఫ్యామిలీ రోడ్డునపడింది. రాజమండ్రి జైలులో బీద చూపులు చూస్తోంది.

    ఇప్పుడు తెలుగుదేశం పార్టీని నడిపించి బలమైన జగన్ మెడలు వంచే నాయకుడు కావాలి. జగన్ పాలిటిక్స్ కు 45 ఇయర్స్ తలపండిన పాలిటిక్స్ చేసిన చంద్రబాబే తట్టుకోవడం లేదు.. ఇక లోకేష్, బాలయ్యలు ఏం సరిపోతారు. అందుకే ప్రజల్లో బలంగా నిలబడుతున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు వారికి అండదండగా ఉన్నారు.

    ఇప్పటికే ‘తాను ఒంటరిని కాదని.. తనకు అన్న పవన్ కళ్యాణ్’ అండ ఉంటుందని లోకేష్ ప్రకటించారు. పవన్ తోడునీడగా ఉంటాడని చెప్పాడు. ఇప్పుడు చంద్రబాబుతో ములాఖత్ లో పవన్, బాలయ్య, లోకేష్ లు కలిసి పాల్గొన్నారు. సినీ పరిచయంతో బాలయ్య, పవన్ లు ఇప్పటికే కలిసిపోయారు. ఇప్పుడు నారా ఫ్యామిలీతో మన పవన్ కూడా ఒదిగిపోయారు.

    చంద్రబాబుతో భేటి తర్వాత పవన్ కళ్యాణ్ ముందుండి నడిచారు. బాలయ్య, లోకేష్ లు వెనుక రాగా.. జనసేనాని.. వీరి సైన్యాన్ని నడిపించే యోధుడిగా కనిపించాడు. ఆ ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది. పిక్ ఆఫ్ ది డేగా మారింది. కష్టాల్లో ఉన్న చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీకి పవన్ నే దిక్కు అని ఈ ఫొటో తేటతెల్లం చేస్తోంది.

    అనుకున్నట్టే చంద్రబాబుతో భేటి తర్వాత పవన్ సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి పోటీ చేయబోతున్నాయని పవన్ ప్రకటించారు. బిజెపి సైతం తనతో కలిసి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తాను తీసుకున్న ఈ నిర్ణయం టిడిపి కోసమో, జనసేన కోసమో కాదన్నారు. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసమే ఈ రాజకీయ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.