
నటీనటులు : నాగ శౌర్య , మాళవిక నాయర్, మేఘా చౌదరి , అవసరాల శ్రీనివాస్
డైరెక్టర్ : అవసరాల శ్రీనివాస్
సంగీతం : కళ్యాణి మాలిక్
నిర్మాతలు : టీజీ విశ్వ ప్రసాద్ , దాసరి పద్మజ
Phalana Abbayi Phalana Ammayi Review : గతం లో నాగ శౌర్య – శ్రీనివాస అవసరాల కాంబినేషన్ లో ‘ఊహలు గుసగుసలాడే’ అనే సూపర్ హిట్ చిత్రం వచ్చింది.అటు నాగ శౌర్య కెరీర్ లోను, శ్రీనివాస అవసరాల కెరీర్ లోనే మైల్ స్టోన్ గా నిలిచినా చిత్రం ఇది.ఈ సినిమా నుండి శ్రీనివాస అవసరాల రచన / దర్శకత్వం అంటే ఇండస్ట్రీ లో ఒక బ్రాండ్ గా మారింది.చాలా కాలం తర్వాత మళ్ళీ వీళ్లిద్దరి కాంబినేషన్ లో ‘ఫలానా అబ్బాయి – ఫలానా అమ్మాయి’ అనే సినిమా తెరకెక్కింది.మంచి కాంబినేషన్ కావడం తో ఈ మూవీ పై గతం లో నాగ శౌర్య సినిమాలకు లేని బజ్ మరియు హైప్ ఏర్పడింది.టీజర్ , ట్రైలర్ మరియు పాటలు కూడా పర్వాలేదు అనిపించింది.రొమాంటిక్ కామెడీ ఎంటెర్టైనెర్స్ తియ్యడం లో శ్రీనివాస అవసరాల మాస్టర్ అవ్వడం తో ఈ చిత్రం కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకం ప్రేక్షకుల్లో ఏర్పడింది.మరి ఆ నమ్మకాన్ని ఈ సినిమా నిలబెట్టిందో లేదో చూద్దాం.
కథ :
సంజయ్ (నాగ శౌర్య) బీటెక్ లో చేరిన కొత్తల్లో అతనిని సీనియర్స్ ర్యాగింగ్ చేస్తూ తెగ ఏడిపించేవారు.అలాంటి సమయం లో అతనిని అనుపమ (మాళవిక నాయర్) రక్షిస్తుంది.అలా వీళిద్దరి మధ్య స్నేహం ఏర్పడుతుంది,బీటెక్ అయిపోయిన తర్వాత MS చదవడం కోసం ఇద్దరు లండన్ కి వెళ్తారు.అక్కడ చదువుంటున్న సమయం లో ప్రేమలో పడిపోతారు.అయితే అనుపమ కి MS పూర్తి అయినా తర్వాత వేరే సిటీ లో మంచి ఉద్యోగం వస్తుంది.తనకి చెప్పకుండా ఉద్యోగానికి అప్లై చేసినందుకు.తనకు దూరంగా వెళ్ళిపోతున్నందుకు సంజయ్ బాగా ఫీల్ అవుతాడు.అక్కడి నుండి వీళ్లిద్దరి మధ్య బాగా దూరం పెరిగిపోతుంది.ఆ సమయం లోనే సంజయ్ కి పూజ (మేఘా చౌదరి) తో స్నేహం ఏర్పడుతుంది.పూజ వచ్చిన తర్వాత సంజయ్ జీవితం లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి..? అనుపమ – సంజయ్ మళ్ళీ కలుస్తారా లేదా అనేది వెండితెర మీద చూసి తెలుసుకోవాల్సిందే.
కథనం :
మేడలో మూడు ముళ్ళు వేసిన తర్వాత 7 అడుగులు వెయ్యాలి.ఆ ఏడు అడుగులు నిజ జీవితం లో హీరో హీరోయిన్లు ఎలా వేశారు అనేదే స్టోరీ.అవసరాల శ్రీనివాస్ సినిమాల్లో ప్రేక్షకులు కథ గొప్పగా ఉండాలని ఆశించారు.కథనం బాగుండాలి, అలాగే ఆయన మార్కు కామెడీ టైమింగ్ ఉండాలి.ఈ సినిమాలో అవి మిస్ కాలేదు కానీ, అవి కేవలం కొన్ని సన్నివేశాలకు మాత్రమే పరిమితం అయ్యింది.కాలేజీ లో తీసిన సన్నివేశాలు బాగా వచ్చాయి.హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది.కానీ సినిమా మొత్తం స్లో గా ఉండడమే పెద్ద మైనస్.స్లో గా ఉన్నప్పటికీ కూడా స్క్రీన్ ప్లే మరియు ఎమోషనల్ కనెక్ట్ ఉంటే ఆడియన్స్ కనెక్ట్ అవుతారు.కానీ ఇక్కడ అదే మిస్ అయ్యింది.
నటీనటుల విషయానికి వస్తే నాగ శౌర్య ఈ చిత్రం లో చాలా చక్కగా నటించాడు, ఇంతకు ముందు ఆయన చేసిన సినిమాల్లో కంటే కూడా, ఈ సినిమాలోనే మంచిగా నటించాడు.హీరోయిన్ మాళవిక నాయర్ కూడా బాగా నటించింది.లీడ్ పెయిర్ నటన బాగున్నప్పటికీ కూడా సినిమాలో ఫీల్ గుడ్ మూమెంట్ అనిపించకపోవడం వల్లే, ఎక్కడో ఎదో మిస్ అయిపోయిన అనుభూతి మన అందరిలో కలుగుతుంది.అందుకే ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది.
చివరి మాట : అవసరాల శ్రీనివాస్ మార్కు రైటింగ్ సినిమా మొత్తం కనిపించకపోయినా, కొన్ని సన్నివేశాలు మాత్రం బాగా పేలాయి.ఆ కొన్ని సన్నివేశాల కోసం ఈ సినిమాని చూడాలనుకుంటే మాత్రం చూడొచ్చు.
రేటింగ్ : 2.25 /5