NDA vs PDA : జనం NDA కూటమి వైపా, ప్రతిపక్షాల కొత్త కూటమి వైపా?

ఇక బెంగళూరులో కాంగ్రెస్ నేతృత్వంలో పీడీఏ పేరుతో రాబోయే కూటమిలో 26 పార్టీలున్నాయి. ఇందులోని కూడా ప్రతి రాష్ట్రంలోని పార్టీలు ఉన్నాయి. ఇక వైసీపీ, బీఆర్ఎస్, బీఎస్పీ, బీజేడీ , టీడీపీ, జేడీఎస్, ఎంఐఎం, వంటి పార్టీలు ఈ రెండు కూటముల సమావేశాలకు హాజరు కావడం లేదు.

Written By: NARESH, Updated On : July 17, 2023 6:26 pm
Follow us on

NDA vs PDA : 2024 ఎన్నికలకు రేపు భూమిక తయారవుతోంది. అటు 30 పార్టీలతో ఎన్డీఏ సమావేశం.. ఇటు 26 పార్టీలతో కాంగ్రెస్ నేతృత్వంలో కొత్త కూటమి సమావేశం.. ఒకటి ఢిల్లీలో.. మరొకటి బెంగళూరులో నిర్వహించబోతున్నారు. అసలు ఏం జరుగబోతోంది.

17వ తేదీన డిన్నర్.. 18వ తేదీ సీరియస్ సమావేశం నిర్వహించబోతున్నారు. ఎన్డీఏ సమావేశానికి దాదాపు 30 పార్టీలు అటెండ్ అవుతున్నాయి. భారత్ లోని ఏ పార్టీలు. ఏ రాష్ట్రానికి చెందినవి అన్నవి క్లియర్ కట్ గా పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ ఎన్డీఏ సమావేశానికి హాజరవుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఈయన ఒక్కరే హాజరవుతున్నారు.ఇక మిగతా పార్టీలేవీ హాజరుకావడం లేదు.

ఇక బెంగళూరులో కాంగ్రెస్ నేతృత్వంలో పీడీఏ పేరుతో రాబోయే కూటమిలో 26 పార్టీలున్నాయి. ఇందులోని కూడా ప్రతి రాష్ట్రంలోని పార్టీలు ఉన్నాయి.

ఇక వైసీపీ, బీఆర్ఎస్, బీఎస్పీ, బీజేడీ , టీడీపీ, జేడీఎస్, ఎంఐఎం, వంటి పార్టీలు ఈ రెండు కూటముల సమావేశాలకు హాజరు కావడం లేదు.

జనం NDA కూటమి వైపా, ప్రతిపక్షాల కొత్త కూటమి వైపా? అన్న దానిపై ‘రామ్’గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు..