Pawan Kalyan- Social Media: సమాజంలో మీడియా ప్రభావం చాలా ఎక్కువ. దశాబ్దం క్రితం వరకు ప్రింట్, ఎలక్ట్రానిక్, సినిమాల ప్రభావం ఎక్కువగా ఉండేది. ప్రస్తుతం ఈ మూడు మాధ్యమాలు రాజకీయా పార్టీల అధీనంలోకి వెళ్లాయి. వాస్తవాల వక్రీకరన పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ప్రత్యామ్నాయంగా వేగంగా ఎదుగుతోంది. ప్రస్తుతం ఏ కార్యక్రమానికైనా, వ్యాపారానికైనా సోషల్ మీడియా ప్రధానంగా మారింది. రాజకీయాల్లో దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉఉంంది. ఎవరికి ఎంత సంఖ్యలో ఫాలోవర్లు ఉంటే వారు అంత గొప్ప సెలెబ్రిటీగా పరిగణింపబడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన రాజకీయ నేతలు కూడా ఒకరితో ఒకరు పోటీపడుతూ ఫాలోవర్లను పెంచుకుంటున్నారు. ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ వాడుతున్నప్పటికీ అందరూ ట్విట్టర్ పైనే దృష్టిసారిస్తున్నారు.

టాప్‌లో జనసేనాని..
ఏపీకి సంబంధించిన రాజకీయ నేతల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ అత్యధిక సంఖ్యలో ఫాలోవర్లను కలిగి టాప్‌లో ఉన్నారు. జనసేనాని ట్విటర్ ఫాలోవర్స్ సంఖ్య 5.2 మిలియన్లుగా ఉంది. ఈ జాబితాలో రెండో స్థానంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఉన్నారు. చంద్రబాబు ట్విట్టర్ ఫాలోవర్స్ సంఖ్య 4.9 మిలియన్లు. 2009లోనే ట్విటర్ ఖాతా ప్రారంభించిన చంద్రబాబు 60 సంవత్సరాల వయసు దాటినా యువతతో పోటీపడుతూ ఫాలోవర్లను పెంచుకుంటున్నారు. ఫాలోవర్ల విషయంలో ముఖ్యమంత్రి జగన్ మూడో స్థానంలో నిలిచారు. 2.4 మిలియన్ ఫాలోవర్స్ ఆయన ఖాతాలో ఉన్నారు.
అటు సినిమాలు, ఇటు రాజకీయాలు..
పవన్ కళ్యాణ్‌కు ఎక్కువ ఫాలోవర్లు ఉండటానికి కారణం ఆయన ససినిమారంగంతోపాటు రాజకీయ రంగంలోనూ ఉండడం. దీంతో సినిమాల పరంగానూ పవన్‌కు ఫాలోవర్లున్నారు. పవన్ రెండు రంగాలనూ బ్యాలెన్స్ చేస్తున్నారు. ఏడాదిగా ప్రజాసమస్యలపై పోరరాటం చేస్తున్నారు. తరచుగా ప్రజాక్షేత్రంలో ఉంటున్నారు. దీంతో ఫాలోవర్లు క్రమంగాపెరుగుతున్నారు. సినిమా రంగంలో లేకపోతే చంద్రబాబునాయుడు మొదటిస్థానంలో ఉండేవారు. ఏపీకి చెందిన మిగతా నేతల్లో చాలామంది 2 మిలియన్లలోపు ఫాలోవర్లను కలిగివున్నారు. రాజకీయ పార్టీల వారీగా చూస్తే.. జనసేన ట్విటర్ ఖాతాను 1.9 మిలియన్ ఫాలోవర్లు అనుసరిస్తుండగా, వైసీపీ ట్విట్టర్ ఖాతాను 827 వేలు, తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ ఖాతాను 547 వేల ఫాలోవర్లు అనుసరిస్తున్నారు.
పవన్ దూకుడుతో పెరుగుతున్న ఫాలోవర్స్..
పవన్ కల్యాణ్‌కు ముక్కుసూటితనం ఎక్కువ. ఏదైనా మొహమాటం లేకుండా మాట్లాడుతారు. అధికారం కోసమో, పదవుల కోసమే ఆయన కాంప్రమైజ్ రాజకీయాలు చేయరు. సినిమాల విషయంలోనూ అంతే నిక్కచ్చిగా ఉంటారు. ఇది యూత్‌కు బాగా ఆకర్షిస్తోంది.. మరోవైపు రాజకీయంగానూ ఆయన చాలా దూకుడు ప్రదర్శిస్తున్నారు. ప్రజాసమస్యలపై పోరాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. దీంతో యూత్‌తోపాటు సామాన్యుల అభిమానాన్ని కూడా జనసేనాని చూరగొంటున్నారు. దీంతో సామాజిక మాధ్యమాల్లో ఆయనను ఫాలో అయ్యేవారు వేగంగా పెరుగుతున్నారు.

రాజకీయంగా బలమైన మీడియాగా సోషల్ మీడియా మారిన ప్రస్తుత తరుణంలో పవన్ కల్యాణ్ ఫాలోవర్స్ పెరగడం పార్టీ బలోపేతానికి దోహదపడుతుందన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది.