Pawan Kalyan: ఒకపక్క సినిమాలు చేస్తూ మరో పక్క రాజకీయాలు చెయ్యడం అనేది కత్తి మీద సాము లాంటిది. సినిమాల్లో మంచి మాస్ క్రేజ్ దక్కించుకున్న హీరోలు తమ కెరీర్ మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత రాజకీయాల్లోకి వస్తుంటారు. కానీ పవన్ కళ్యాణ్ తన కెరీర్ పీక్ రేంజ్ లో ఉన్నప్పుడే రాజకీయాల్లోకి వచ్చాడు. అయితే నిజాయితీగా తన కష్టం తో సంపాదించిన డబ్బులతోనే జనసేన పార్టీ ని సమర్ధవతం గా నడుపుతున్నాడు.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నాలుగు సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. రీసెంట్ సమయం లో ఆయన #PKSDT, ఉస్తాద్ భగత్ సింగ్ మరియు రీసెంట్ గా #OG , ఈ షూటింగ్స్ అన్నిట్లో చురుగ్గా ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ తొందరగా పూర్తి చెయ్యాలనే ఆలోచనలో ఉన్నాడు. త్వరలోనే ఆయన పెండింగ్ లో ఉన్న ‘ హరిహర వీరమల్లు’ సినిమాని కూడా పూర్తి చెయ్యబోతున్నాడు.
ఇంత బిజీ షెడ్యూల్స్ లో కూడా ఆయన రాజకీయ కార్యకలాపాలను నిర్లక్ష్యం చెయ్యలేదు. ఎప్పటికప్పుడు పార్టీ స్థితిగతులను తెలుసుకుంటూ, వ్యూహాలను రచిస్తున్నాడు. నిన్నటి వరకు #OG మూవీ షూటింగ్ లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఒక భారీ షెడ్యూల్ ని పూర్తి చేసాడు. ఈ షెడ్యూల్ పూర్తి అవ్వగానే ఆయన తూర్పు గోదావరి జిల్లాలో తుఫాను ద్వారా కొట్టుకుపోయిన పంటలను పరిశీలించి, అక్కడి రైతులకు భరోసా కలిపించి వాళ్లలో ధైర్యం నింపడానికి రెండు రోజుల పాటు ఆయన పర్యటించబోతున్నారు.
ఇలా రెండు పడవల మీద ప్రయాణం చేస్తూ, ఇలా ఎలా ఒక మనిషి ఉండగలడు అని ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయేలా చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఆవిర్భావ దినోత్సవం తర్వాత పవన్ కళ్యాణ్ మళ్ళీ జనాల్లోకి రాబోతుంది ఇప్పుడే, కాబట్టి ఆయనకి జనాలు అడుగడుగునా నీరాజనాలు పలకడం కామన్.