Pawan Kalyan : పవన్ కళ్యాణ్ వారాహి యాత్రతో ఏపీ రాజకీయాలు ఎలా మారనున్నాయి?

యాత్ర ఒకేవిడతగా కాకుండా పలు విడతలుగా చేయనున్నారు. దీంట్లో భాగంగా మొదటి విడత అన్నవరం నుంచి భీమవరం వరకు యాత్ర కొనసాగుతుందని నాదెండ్ల తెలిపారు.

Written By: NARESH, Updated On : June 3, 2023 6:23 pm
Follow us on

Pawan Kalyan : ఆంధ్రాలో వారాహి రథం కదిలింది. జనసేనాని యాత్ర మొదలైంది. జనసేనాని సమరశంఖం పూరించనున్నారు. నేరుగా ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టనున్నారు. ఈ నెల 14 నుంచి వారాహి యాత్ర ప్రారంభం కానుంది. అన్నవరం సత్యదేవుని సన్నిధిలో పూజలు అనంతరం యాత్రకు సిద్ధమవుతారు. గత కొంతకాలంగా వారాహి యాత్రపై పుకార్లు షికార్లు చేశాయి. కానీ ఎట్టకేలకు వారాహి యాత్ర షెడ్యూల్ ను పార్టీ హై కమాండ్ ప్రకటించింది అందరి అంచనాలకు భిన్నంగా గోదావరి జిల్లాల నుంచి యాత్ర ప్రారంభిస్తుండడం విశేషం.

పవన్ యాత్రతో ఏపీలో పెనుమార్పునకు నాంది పలుకనుంది. జనంతో సంభాషించే యాత్ర.. జనం నాడి తెలుసుకునే యాత్ర.. నియోజకవర్గాల్లో సమస్యలపై అవగాహన పెంచుకునే యాత్ర.. ఆంధ్ర రాజకీయాల్లో పెనుమార్పునకు దారితీసే యాత్ర. తను చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ జూన్ నుంచే బస్సుయాత్ర చేపట్టబోతున్నారు. అన్నవరం టు భీమవరం బస్సు యాత్ర చేయనున్నారు.

ఏకబికిన యాత్ర చేయడం కంటే జిల్లాల వారీగా చేయడం బెటర్ అని పవన్ భావిస్తున్నాడు. ఈ యాత్రలో వచ్చిన గుణపాఠాలను నేర్చుకొని మరో యాత్రకు శ్రీకారం చుట్టాలని పవన్ భావిస్తున్నాడు.

యాత్ర ఒకేవిడతగా కాకుండా పలు విడతలుగా చేయనున్నారు. దీంట్లో భాగంగా మొదటి విడత అన్నవరం నుంచి భీమవరం వరకు యాత్ర కొనసాగుతుందని నాదెండ్ల తెలిపారు.

రూట్ మ్యాప్ సైతం ప్రకటించారు. ప్రత్తిపాడు నియోజకవర్గం, పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్, ముమ్మిడివరం, అమలాపురం, పి గన్నవరం, రాజోలు.. అక్కడి నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లు, నర్సాపురం, భీమవరంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి తొలి విడత యాత్ర కొనసాగుతోందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. క్షేత్ర స్థాయిలో సమస్యలు తెలుసుకునేందుకు, అధిక సమయం ప్రజల మధ్య గడిపేలా జనసేన నేతలు రూట్ మ్యాప్ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. యాత్ర ప్రకటనతో జనసేన శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

జూన్ 14న మొదలు కాబోతుంది వారాహి యాత్ర.. ఈ యాత్రతో ఏపీ రాజకీయాలు ఎలా మారబోతున్నాయన్న దానిపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.