Pawan Kalyan: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం జనసేన ‘వారాహి విజయ యాత్ర’ ఎంత సెన్సేషన్ సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతుందో మన అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఎన్నడూ లేని విధంగా సరికొత్త పద్దతి లో ముందుకు పోతున్నాడు. అందరినీ కలుపుకుపోతున్నాడు కూడా, ఒక సూపర్ స్టార్ స్థానం లో ఉండి కూడా ఇతర హీరోల పేర్లు తీస్తూ అందరి ఫ్యాన్స్ ఓట్లు కావాలి అని అంటున్నాడు.
ప్రభుత్వం చేస్తున్న అక్రమాల గురించి పూస గుచ్చినట్టు చెప్తూ అందరికి రీచ్ అయ్యేలా చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఈ వారాహి యాత్ర నాలుగు ప్రాంతాలలో జరిగితే అన్నీ ఒక దానిని మించి ఒకటి హిట్ అయ్యాయి. యూత్ ని ఆలోచించేలా చేస్తున్నాయి, ఇక నిన్న జరిగిన ముమ్మిడివరం సభలో ఇండియా లో ఏ సూపర్ స్టార్ కూడా చేయనటువంటి బోల్డు పని చేసాడు పవన్ కళ్యాణ్. దానికి ఇతర హీరోల అభిమానుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది.
ఆయన మాట్లాడుతూ ‘మహేష్ బాబు , ప్రభాస్ , ఎన్టీఆర్ , రామ్ చరణ్ , అల్లు అర్జున్ చిరంజీవి, బాలకృష్ణ అందరి హీరోల అభిమానులకు విజ్ఞప్తి. నాకు వారందరూ ఇష్టమే, నేను వారి సినిమాలు చూస్తాను, మీరు వారిని అభిమానించండి. కానీ రైతులకు, ప్రజా సమస్యలకు కులం లేదు, నేను రాష్ట్రం కోసం పనిచేస్తున్నాను ఒక్కసారి అండగా నిలబడండి, కొంతమంది
ఎన్టీఆర్ గారి అభిమానులు నా అభిమానులు సినిమా పరంగా గొడవలు పడుతున్నారు అంటున్నారు. సినిమా వేరు రాజకీయం వేరు.మహేష్ గారు, ప్రభాస్ గారు నాకంటే పెద్ద హీరోలు. ప్రభాస్ గారు పాన్ ఇండియా హీరో. వారు నాకంటే ఎక్కువ పారితోషికం తీసుకుంటారు. రామ్ చరణ్ , ఎన్టీఆర్ గార్లు ఇప్పుడు గ్లోబల్ స్టార్స్ అయ్యారు. నేను వేరే రాష్ట్రాల్లో, దేశాల్లో తెలియకపోవచ్చు, కానీ వారు తెలుసు. ఇది ఒప్పుకోవడానికి నాకు ఎలాంటి ఈగో లేదు. రాష్ట్ర క్షేమం కోసం అందరి హీరోల అభిమానులు నాకు, జనసేనకు అండగా నిలబడండి, మీ హీరోలను అభిమానించండి’ అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి.
ప్రభాస్, @urstrulyMahesh, @alluarjun, @AlwaysRamCharan, @tarak9999 అందరూ నాకంటే పెద్ద హీరోలు..ప్యాన్ ఇండియా స్టార్లు, గ్లోబల్ స్టార్లు..
అయితే..
– ముమ్మిడివరంలో జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారు#VarahiVijayYatra pic.twitter.com/M3rYQ9Ab0o
— JanaSena Party (@JanaSenaParty) June 21, 2023