https://oktelugu.com/

Pawan Kalyan – Ali : ఆలీతో గొడవలు నిజమే… అలా తేల్చేసిన పవన్ కళ్యాణ్!

అనూహ్యంగా పవన్ కళ్యాణ్ ఓజీ మూవీలో ఆలీ నటిస్తున్నారనే ప్రచారం జరిగింది. అది నిజం కాకపోవచ్చు. ఆ వీడియోలో మరొక ఆసక్తికర విషయం ఉంది. అదేంటంటే బండ్ల గణేష్ తో ఉన్న ఫోటో పవన్ జోడించారు. ఆలీ మాదిరే బండ్ల గణేష్ ని కూడా పవన్ కళ్యాణ్ దూరం పెట్టారనే వాదన ఉంది. పవన్ కళ్యాణ్-బండ్ల గణేష్ కలిసి కనిపించి రెండేళ్లు కావస్తుంది. ఈ ఊహాగానాల మధ్య బండ్ల గణేష్ ఫోటోను పవన్ వీడియోలో జోడించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Written By:
  • Shiva
  • , Updated On : July 16, 2023 / 11:38 AM IST
    Follow us on

    Pawan Kalyan – Ali : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంస్టాగ్రామ్ లో అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ఆయన మొదటి పోస్ట్ గా ఆసక్తికర వీడియో షేర్ చేశారు. చెప్పాలంటే తన సినిమా ప్రయాణాన్ని ఫోటోల రూపంలో చూపించారు. తన మొదటి సినిమా నుండి ఇప్పటి వరకు పని చేసిన దర్శకులు, నిర్మాతలు, సంగీత దర్శకులు, నటులతో కూడిన ఫోటోలు ఆ వీడియోలో ఉన్నాయి. అలాగే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి నిన్నటి తరం టాప్ స్టార్స్ తో ఆయన దిగిన ఫోటోలు పొందుపరిచారు.

    ఈ తరం టాప్ స్టార్స్ ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లు కలిసిన సందర్భాల ఫోటోలు కూడా ఉన్నాయి. ఇతర పరిశ్రమలకు చెందిన టాప్ స్టార్స్ ని పవన్ కలిసిన ఫోటోలు ఉన్నాయి. టాలీవుడ్ కమెడియన్స్ తో పాటు మరికొందరు నటులతో పవన్ ఉన్న ఫోటోలు వీడియోలో జత చేశారు. అయితే ఆలీతో దిగిన ఫోటో మాత్రం ఆయన పెట్టలేదు. కాబట్టి ఆలీ మీద పవన్ కళ్యాణ్ కి కోపం తగ్గలేదని, ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని చెప్పకనే చెప్పారని నెటిజెన్స్ అభిప్రాయం.

    గత ఏడాది ఆలీ కూతురు వివాహం జరిగింది. హైదరాబాద్ లో పెళ్లి కాగా గుంటూరులో మరోసారి రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ రెండు కార్యక్రమాలకు పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు. పవన్ విభేదాల కారణంగానే మీ అమ్మాయి పెళ్లి రాలేదా? అని ఆలీని అడిగితే, ఆయన కొట్టిపారేశారు. పెళ్లికి పిలవడానికి వెళ్ళినప్పుడు పవన్ నాతో ఆప్యాయంగా మాట్లాడారు. 15 నిమిషాలకు పైగా నాకు సమయం కేటాయించారు. ఫ్లైట్ మిస్ కావడం వలనే పవన్ పెళ్ళికి రాలేకపోయారని వివరణ ఇచ్చారు.

    తాజా పరిణామంతో ఆయన అబద్దం చెప్పారనే అనుమానం కలుగుతుంది. 2019 ఎన్నికలకు ముందు ఆలీ వైసీపీ పార్టీలో చేరారు. ఆ పార్టీ తరపున ప్రచారం చేశారు. పవన్ కళ్యాణ్ కి అత్యంత సన్నిహితుడైన ఆలీ ప్రత్యర్థి పార్టీలో చేరడంతో ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. ఈ క్రమంలో పవన్-ఆలీ మధ్య మాటల యుద్ధం కూడా జరిగింది. పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఆలీ కనిపించడం లేదు. అదంతా రాజకీయాల వరకే మేము వ్యక్తిగతంగా మిత్రులమే అని ఆలీ చెబుతున్నా ఆ పరిస్థితి లేదు.

    అనూహ్యంగా పవన్ కళ్యాణ్ ఓజీ మూవీలో ఆలీ నటిస్తున్నారనే ప్రచారం జరిగింది. అది నిజం కాకపోవచ్చు. ఆ వీడియోలో మరొక ఆసక్తికర విషయం ఉంది. అదేంటంటే బండ్ల గణేష్ తో ఉన్న ఫోటో పవన్ జోడించారు. ఆలీ మాదిరే బండ్ల గణేష్ ని కూడా పవన్ కళ్యాణ్ దూరం పెట్టారనే వాదన ఉంది. పవన్ కళ్యాణ్-బండ్ల గణేష్ కలిసి కనిపించి రెండేళ్లు కావస్తుంది. ఈ ఊహాగానాల మధ్య బండ్ల గణేష్ ఫోటోను పవన్ వీడియోలో జోడించడం ప్రాధాన్యత సంతరించుకుంది.