Pawan Kalyan : అల్లుడంటే ఆ మామకు ప్రాణం. అందుకే యాక్సిడెంట్ జరిగిందని తెలియగానే ఆగమేఘాలపై ఆస్పత్రిలో వాలిపోయాడు పవన్ కళ్యాణ్. తన సోదరి విడాకుల తర్వాత సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ లను తనే చూసుకున్నాడు. వారి అవసరాలు తీర్చాడు. అందుకే సాయిధరమ్ తేజ్ పైన పవన్ కు అంత ప్రేమ.
తాజాగా బ్రో రిలీజ్ ఫంక్షన్ లోనూ ఆ ప్రేమ కనిపించింది. నిజానికి బ్రో సినిమాలో పవన్ కళ్యాణ్ ది చిన్న పాత్ర. సినిమా మొత్తం సాయిధరమ్ తేజ్ చుట్టూనే తిరుగుతుంది. అయితే పవన్ నటించడం వల్ల ఇంత హైప్ వచ్చేసింది.
బ్రో రిలీజ్ ఈవెంట్ మీద సాయిధరమ్ తేజ్ ఎప్పటి నుంచో కోరుతున్న ఓ కోరికను తీర్చాడు పవన్ కళ్యాణ్. ఒక ఖరీదైన కాస్లీ చైన్ కావాలని సాయి కోరాడట.. మామయ్య పవన్ ను ఎప్పుడూ అడిగేవాడట.. ఆయన గుర్తుగా ఉంచుకోవాలని.. ఇవ్వాలని అడిగేవాడట..
ఆ కోరికను తాజాగా పవన్ తీర్చాడు. బ్రో రిలీజ్ వేదికపై ఒక నల్లటి పూసల దండల లాంటి ఒక చైన్ ను వేదికపైనే సాయిధరమ్ తేజ్ కు గిఫ్ట్ ఇచ్చాడు. అది చూసి ఉబ్బితబ్బిబైన సాయిధరమ్ తేజ్ వెంటనే మెడలో వేసుకున్నాడు. దానికి పవన్ ఫ్యాన్స్ ఈలలు గోలలు అన్నీ ఇన్నీ కావు.