https://oktelugu.com/

Pawan Kalyan Varahi Yatra: పవన్ చుక్కలు చూపెట్టబోతున్నారు

2019 ఎన్నికలకు ముందు టిడిపి నుంచి విడిపోయినప్పుడు.. పవన్ చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సందించారు. అప్పట్లో దుమారానికి దారి తీసాయి. నేడు అదే స్థాయిలో వైసీపీ సర్కార్ పై పవన్ పోరాటానికి దిగనున్నారు.

Written By:
  • Dharma
  • , Updated On : August 4, 2023 / 05:03 PM IST

    Pawan Kalyan Varahi Yatra

    Follow us on

    Pawan Kalyan Varahi Yatra: పవన్ వారాహి మూడో విడత యాత్రకు రెడీ అవుతున్నారు. తొలి రెండు విడత యాత్రలకు ఉభయగోదావరి జిల్లాలను టార్గెట్ చేసుకున్న ఆయన.. మూడో విడత మాత్రం విశాఖ పై గురిపెట్టారు.ఎన్నెన్నో సంచలనాలకు వేదికగా మారనుంది ఈ యాత్ర.ముఖ్యంగా జగన్ సర్కార్కు పవన్ చుక్కలు చూపించనున్నారు.

    ఈనెల పది నుంచి 19 వరకు 9 రోజులు పాటు యాత్ర కొనసాగనుంది. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నాలుగు నియోజకవర్గాల్లో జరగనుంది. విశాఖలో పవన్ అభిమానులు ఎక్కువ. జనసేనకు గ్రాఫ్ ఉన్న జిల్లాల్లో ఉభయగోదావరి తర్వాత విశాఖదే అగ్రస్థానం. అందుకే అక్కడ వారాహి యాత్ర చేయడానికి పవన్ సిద్ధపడ్డారు. తొలుత రాయలసీమ జిల్లాల్లో అనుకున్నా.. చివరకు విశాఖ వైపు మొగ్గు చూపారు. ఇప్పటికే రెండు విడత యాత్రలో సంచలనాలకు పవన్ వేదికగా మారారు. ఈసారి క్షేత్రస్థాయిలో వైసిపి ప్రభుత్వ వైఫల్యాలను టార్గెట్ చేయనున్నారు.

    2019 ఎన్నికలకు ముందు టిడిపి నుంచి విడిపోయినప్పుడు.. పవన్ చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సందించారు. అప్పట్లో దుమారానికి దారి తీసాయి. నేడు అదే స్థాయిలో వైసీపీ సర్కార్ పై పవన్ పోరాటానికి దిగనున్నారు. ల్యాండ్, మైన్, వైన్ మాఫియాలపై విరుచుకుపడనున్నారు. గత ఎన్నికల ముందు పవన్ చేసిన విమర్శలు మీడియాలో అంతగా ఫోకస్ కాలేదు. మీడియా ప్రాధాన్యం ఇవ్వలేదు,.. జగన్ మీడియా కవరేజ్ చేయలేదు.దీంతో సోషల్ మీడియా వేదికగానే జనసైనికులు పవన్ చేసిన విమర్శలను వైరల్ చేసేవారు. అయితే నాడు పవన్ చేసిన విమర్శలే చంద్రబాబును దారుణంగా దెబ్బతీశాయి. ఇప్పుడు అదే పరిస్థితిని జగన్ ఎదుర్కోబోతున్నారు.

    ఈసారి పవన్ యాత్రకు మీడియా ఎనలేని ప్రధానిమిస్తోంది. ముఖ్యంగా ఎల్లో మీడియా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. విశాఖలో భూకబ్జాలు, రుషికొండలాంటి విధ్వంసాలను పవన్ కళ్ళకు కట్టినట్టు చూపించే అవకాశం ఉంది. ఈ ప్రజల్లోకి బలంగా చర్చకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే మీడియా వేయికళ్లతో పవన్ వారాహి మూడో యాత్ర కోసం ఆశగా ఎదురుచూస్తోంది. అయితే అధికార వైసీపీలో మాత్రం ఓకింత ఆందోళన నెలకొంది. పవన్ యాత్ర కచ్చితంగా సంచలనాలకు వేదికగా మారనుందని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.