https://oktelugu.com/

Chiranjeevi – Pawan Kalyan : చిరంజీవి విశ్వంభర సినిమాలో ఆ కీలకమైన పాత్రలో కనిపించనున్న పవన్ కళ్యాణ్

డైరెక్టర్ వశిష్ఠ కూడా ప్రస్తుతం చిరంజీవి తో షూట్ మొత్తం కొట్టేసి ఎలక్షన్స్ తర్వాత పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ని షూట్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాడు అయితే ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ తన 10 రోజుల డేట్స్ ని కేటాయించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.

Written By:
  • NARESH
  • , Updated On : December 15, 2023 / 10:01 PM IST
    Follow us on

    Chiranjeevi – Pawan Kalyan : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ట డైరెక్షన్ లో విశ్వంభర అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో చిరంజీవి ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోల్ ని పోషించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టుకొని శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఈ సంవత్సరం రెండు సినిమాలు రిలీజ్ చేసిన చిరంజీవి వచ్చే ఏడాది కూడా రెండు సినిమాలు రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక అందులో భాగంగానే ఆయన విశ్వంభర సినిమాకు సంబంధించిన అన్ని విషయాలను కూడా దగ్గరుండి చూసుకుంటూ షూటింగ్ ని చాలా ఫాస్ట్ గా జరిగే విధంగా డిస్కస్ చేసి మరి షూటింగ్ ని పరుగులు పెట్టిస్తున్నట్టుగా తెలుస్తుంది.

    ఇక్కడ వరకు బాగున్నప్పటికీ ఇక ఈ సినిమా చివర్లో 15 నిమిషాలు కనిపించే ఒక స్పెషల్ క్యారెక్టర్ కోసం తమిళ్ నుంచి ఒక హీరోని తీసుకోవాలి అనుకున్నారట దానికి చిరంజీవి కూడా ఓకే చెప్పాడు. ఇక తమిళ్ ఇండస్ట్రీలో ఉన్న ఒక స్టార్ హీరోని క్యారెక్టర్ కోసం సంప్రదించగా ఆయన చేయడానికి ఉత్సాహం చూపించినప్పటికీ ఆయన డేట్స్ ఒక 2 ఇయర్స్ వరకు ఖాళీగా లేకపోవడంతో తను ఆ మంచి క్యారెక్టర్ ని కోల్పోవాల్సి వచ్చింది. ఇక దాంతో ఆ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ని పవన్ కళ్యాణ్ తో చేయించాలనే ఉద్దేశ్యంతో వశిష్ట చిరంజీవి దగ్గర తన అభిప్రాయాన్ని తెలియజేసినట్టుగా తెలుస్తుంది.

    ఇక ఇదే క్రమంలో చిరంజీవి కూడా పవన్ కళ్యాణ్ బాగా సెట్ అవుతాడు అని అనుకొని పవన్ కళ్యాణ్ కి స్క్రిప్ట్ చెబుదామని అనుకుంటూ ఉండగా ఆ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ చిరంజీవి కి కాల్ చేసి క్యారెక్టర్ ఎలాంటిదైనా పర్లేదు మీ సినిమాలో నేను చేయాలని మీరు అనుకుంటున్నట్టు గా తెలిసింది కాబట్టి ఆ 15 నిమిషాల క్యారెక్టర్ నేను చేస్తాను అని చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఎలక్షన్స్ బిజీలో తిరుగుతున్న పవన్ కళ్యాణ్ స్టోరీ వినక పోయిన కూడా చిరంజీవి మీద ఉన్న ఇష్టం తో తను సినిమాకి ఒప్పుకున్నాడు.

    ఇక దాంతో చిరంజీవి వశిష్ఠ తో ఎలక్షన్స్ తర్వాత పవన్ కళ్యాణ్ షూటింగ్ పెట్టుకునే విధంగా ప్లాన్ చేసుకోమని సలహా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దాంతో డైరెక్టర్ వశిష్ఠ కూడా ప్రస్తుతం చిరంజీవి తో షూట్ మొత్తం కొట్టేసి ఎలక్షన్స్ తర్వాత పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ని షూట్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాడు అయితే ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ తన 10 రోజుల డేట్స్ ని కేటాయించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.