Pawan Kalyan- Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది. కానీ రాజకీయాలు ఇప్పుడే వేడెక్కాయి. ఒకవైపు టీపీపీ యువరాజు లోకేష్‌బాబు పాదయాత్ర చేస్తున్నారు. మరోవైపు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం జన సేనాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ప్రారంభించారు. ఇక అధికార వైసీపీ మరోమారు అధికారంలోకి రావాలని గడప గడపకూ మన ప్రభుత్వం పేరుతో ప్రజలను నేరుగా కలుస్తోంది. సీఎం జగన్ ‘వై నాట్ 175’ అంటున్నారు. ఇదిలా ఉంటే.. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనీయమంటున్న పవన్.. టీడీపీ, బీజేపీతో కలిసి పోటీచేయాలనుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. ఇందుకోసమే లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రారంభించిన వెంటనే జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యవహారాలు ఆపేసి, సినిమాల్లో బిజీ అయిపోయారని ప్రచారం చేశారు. పవన్ తన వారాహి వాహనాన్ని షెడ్‌లో ఉంచేశారు. లోకేష్ యాత్రకు పోటీగా కనిపించకూడద అనే పవన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అనిపించింది.
గోదావరి జిల్లాల నుంచి వారాహి యాత్ర..
అయితే ఈ ప్రచారం అంతా వట్టిదే అన్నట్లు.. పవన్ గోదావరి జిల్లాల నుంచి వారాహియాత్ర ప్రారంభించారు. అన్నవరం నుంచి అమలాపురం వరకు యాత్రలకు చేసిన యాత్ర సూపర్ సక్సెస్ అయింది. సభలకు భారీగా జనం వచ్చారు. గతంలోనూ పవన్ సభలకు జనాలు బాగా వచ్చారు అని ఎవరైనా అనొచ్చు. కానీ దానికీ దీనికీ తేడా వుంది. ఈసారి జనాల రావడమూ ఎక్కువే. హడావుడి అంతకన్నా ఎక్కువే. జెండాలు, కట్ అవుట్ లు, తోరణాలు ఒకటి కాదు, అన్ని విధాలా ఈసారి సినిమా హడావుడి అనే కన్నా రాజకీయ హడావుడి ఎక్కువ కనిపించింది. క
గోదావరి జిల్లాల్లో లోకేష్ ఎంట్రీ..
మరి కొన్ని రోజుల్లో లోకేష్ యువగళం యాత్ర కూడా గోదావరి జిల్లాల్లో అడుగు పెట్టనుంది. ఆయన కోనసీమలో తిరగాల్సి ఉంటుంది. అయితే పవన్‌కు వచ్చినంత మంది జనం లోకేష్ సభలకు కూడా కనిపించాలి. లేదంటే పవన్ చరిష్మా ముందు లోకేష్ ఇమేజ్ చిన్నదైపోతుంది. దీంతో ఏదో ఒకటి చేసి జనాన్ని రప్పించాలని టీడీపీ నేతలు భావిస్తున్నారు.
జనం భారీగా వస్తే..
జనాన్ని టీడీపీ నేతలు భారీగా తీసుకువస్తే.. జనసేనకు వచ్చిన జనమే కదా లోకేష్‌కు కూడా రావాల్సింది. అంటే రెండు పార్టీల అభిమానులు ఒకటే అనుకునే అవకాశం ఉంది. ఇక రేపు జగన్ కూడా గోదావరి జిల్లాలకు వస్తే వైసీసీ కూడా భారీ జన సేకరణ చేయడం ఖాయం. పవన్ సభలను మించి జనాన్ని తరలిస్తుంది.
జనం వేరు.. ఓట్లు వేరు..
ఏ నాయకుడు వచ్చినా సభలు పెట్టినా.. వారికి వచ్చిన జనం అంతా ఓట్లేస్తారనుకుంటే పొరపాటే. సభలకు వచ్చే జనం వేరు ఓట్లు వేసే జనం వేరు. వారు వేసే ఓట్లే గెలుపు ఓటములను నిర్ణయిస్తాయి. జనం వచ్చినంత మాత్రాన గెలిచామనుకుంటే పొరపాటే. యాత్రలతోపాటు ఎన్నికల పోల్ మేనేజ్‌మెంట్, ఇతరత్రా వ్యవహారాలే గెలుపు ఓటములను నిర్ణయిస్తాయి.