Pawan Kalyan : పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన తన అభిమానుల్లో, జనసేన సైనికుల్లో మంచి ఉత్సాహాన్ని రేకెత్తించింది. పవన్ మాటల్లో ఎక్కడా ఆవేశపడలేదు. నవ్వుతూనే చురకలంటించారు. అదే సమయంలో తన లక్ష్యాన్ని ఎక్కడా తప్పలేదు. వైసీపీ, జగన్ ప్రభుత్వాన్ని దింపడం కోసమే ఇవన్నీ భరిస్తున్నట్టు తెలిపారు. టీడీపీ ఏకపక్ష సీట్ల ప్రకటనను తప్పుపట్టారు.
తెలుగుదేశం జనసేనతో పొత్తు పెట్టుకుంది. కానీ సీట్ల సర్దుబాటు కొలిక్కి రాలేదు. చంద్రబాబు మిత్ర ధర్మం పాటించడం లేదంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు పొత్తులపై ప్రభావం చూపిస్తున్నాయి. చంద్రబాబు రెండు సీట్లకు అభ్యర్థులను ప్రకటించినందున.. తాను కూడా ఇద్దరు అభ్యర్థులను ప్రకటించినట్లు పవన్ చెప్పుకొచ్చారు. లోకేష్ సీఎం సీటు షేరింగ్ గురించి చేసిన వ్యాఖ్యల పైనా స్పందించారు. పొత్తు కోసమే తాను అన్ని భరిస్తున్నానని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా పొత్తు ధర్మంపై పవన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
చంద్రబాబు రెండు నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించారు కనుక.. తాను కూడా ఇద్దరు అభ్యర్థులను ప్రకటించాల్సి వచ్చిందని చెప్పారు. అయితే అంతవరకు బాగానే ఉంది కానీ.. పొత్తు ధర్మం గురించి పవన్ మాట్లాడడం పై సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. మరి బిజెపి విషయంలో మీ పొత్తు ధర్మం ఏమైందన్న ప్రశ్నలు ఉత్తన్నమవుతున్నాయి. అది పొత్తు ధర్మానికి విరుద్ధం కాదా? అని ఎక్కువ మంది ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో నిలదీసినంత పని చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ ప్రకటనపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. దీనిపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.