Odi World Cup 2023: వరల్డ్ కప్ లో భాగంగా శ్రీలంక పాకిస్థాన్ మధ్య ఒక మ్యాచ్ జరిగింది. దాంతో పాకిస్తాన్ శ్రీలంక మీద ఒక రివేంజ్ తీర్చుకుంది ఏంటి అంటే రీసెంట్ గా ఏషియా కప్ లో శ్రీలంక టీం పాకిస్తాన్ ని ఓడించి ఇంటికి పంపించింది అందులో భాగంగానే వరల్డ్ కప్ లో ఆడుతున్న ఈ రెండు జట్లు కూడా తలపడడం జరిగింది. ఇక అందులో భాగంగానే ఈ రెండు జట్లు కూడా భారీ స్కోరు చేయడం జరిగింది నిజానికి ఈ మ్యాచ్ శ్రీలంక గెలుస్తుందని అందరూ అనుకున్నారు కానీ పాకిస్తాన్ అందరి ఊహలను తల కిందులు చేస్తూ శ్రీలంక మీద ఘన విజయాన్ని సాధించి వాళ్ల టీమ్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో మరొకసారి ప్రూవ్ చేసుకున్నారు.
ఇక ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక టీమ్ నిర్ణీత 50 ఓవర్లకి 9 వికెట్లను కోల్పోయి 344 పరుగులు చేసింది. శ్రీలంక ప్లేయర్లలో కుశాల్ మెండిస్ సమర విక్రమ ఇద్దరు మాత్రమే సెంచరీలు చేసి శ్రీలంక టీం ని ఆదుకున్నారు. అందులో కుశాల్ మెండిస్ 122 పరుగులు చేయగా సమరవిక్రమ మాత్రం108 పరుగులు చేశాడు ఇక వీళ్లిద్దరు రాణించడంతో శ్రీలంక టీం భారీ స్కోరు అయితే చేయగలిగింది. ఇక పాకిస్తాన్ బౌలర్లలో హసన్ అలీ 4 వికెట్లు తీశాడు.అలాగే హరీష్ రాఫ్ రెండు వికెట్లు తీశాడు. షహీన్ అఫ్రిది, మహమ్మద్ నవాజ్, షాదబ్ ఖాన్ ముగ్గురు తలో వికెట్ తీశారు. ఇక చేజింగ్ కి వచ్చిన పాకిస్తాన్ టీం కి మొదట్లోనే భారీ దెబ్బ తగిలింది.
పాకిస్తాన్ టీం ఓపెనర్ ప్లేయర్ అయిన ఇమాం ఉల్ హక్ అలాగే నెంబర్ త్రీ లో వచ్చే బాబర్ అజమ్ ఇద్దరూ కూడా చాలా తక్కువ స్కోరుకే అవుట్ అయిపోవడం ఆ టీం కి చాలా వరకు మైనస్ అయిందనే చెప్పాలి. 37 పరుగుల వద్ద రెండో వికెట్ ని కోల్పోయిన పాకిస్తాన్ టీం ని ఓపెనర్ ప్లేయర్ అయిన షాఫిక్ అలాగే మహమ్మద్ రిజ్వాన్ ఇద్దరు కూడా మంచి భాగస్వామ్యాన్ని నెలకొలుపుతూ టీం కి భారీ పరుగులు చేయడంలో సక్సెస్ అయ్యారు అలాగే చాలా ఎక్కువ సేపు కన్సిస్టెన్సీ ని మైంటైన్ చేస్తూ ఎక్కువ పరుగులు చేయడం జరిగింది. వీరిద్దరూ కలిసి మూడో వికెట్ కి 175 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడం జరిగింది.
ఇక ముందుగా షఫీక్ ఈ మ్యాచ్ లో సెంచరీ చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ అడటమే కాకుండా ప్లేయర్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 113 పరుగులు చేసిన షఫీక్ అవుటవుగా మహమ్మద్ రిజ్వాన్ మాత్రం చివరీ వరకు ఉండి 133 పరుగులు చేసి నాటౌట్ గా నిలవడమే కాకుండా టీం కి ఒక ఘనమైన విజయాన్ని కూడా అందించాడు… దీంతో పాకిస్తాన్ రెండు మ్యాచ్ ల్లో గెలిచి 4 పాయింట్లు సంపాదించుకొని ప్రస్తుతం పాయింట్స్ టేబుల్ ల్లో రెండోవ స్థానంలో కొనసాగుతుంది…