PAK vs AUS: ఇదో థ్రిల్లింగ్ మ్యాచ్.. నరాలు తెగే ఉత్కంఠ.. మొదట టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 176 పరుగులు చేసింది. అనంతరం ఆస్ట్రేలియా తడబడి చివరకు 4 ఓవర్లలో 50 పరుగులకు పైగా చేయాలి. పాకిస్తాన్ గెలుపు పక్కా అని స్డేడియంలో అభిమానులంతా సంబరపడిపోతున్నారు.

కానీ ఇది కదా టీ20. గేర్ మార్చిన ఆస్ట్రేలియన్ వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ వరుసగా మూడు సిక్సులు కొట్టి ఆస్ట్రేలియాకు చిరస్మరణీయ విజయాన్ని అందించి ఏకంగా ప్రపంచకప్ టీ20 ఫైనల్ కు చేర్చాడు. మ్యాచ్ లో మాథ్యువేడ్ ఇచ్చిన సులభమైన క్యాచ్ ను నేలపాలు చేసి పాకిస్తాన్ పాలిట ఆ దేశ క్రికెటర్ హసన్ అలీ విలన్ గా మారాడు. ఇప్పుడు పాకిస్తాన్ ఓటమికి, ఆస్ట్రేలియా గెలుపునకు ప్రధాన కారణం వీరిద్దరే.
177 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియాకు ఓపెన్ వార్నర్ 30 బంతుల్లో 49 పరుగులు చేసి శుభారంభం అందించాడు. ఆ తర్వాత మార్ష్ 28 పరుగులు చేశాడు. కెప్టెన్ ఫించ్ డకౌట్ అయ్యాడు. తర్వాత వార్నర్, మార్స్, మ్యాక్స్ వెల్ వరుసగా ఔట్ కావడంతో ఆస్ట్రేలియా ఓటమి అంచున నిలిచింది. చివరి 4 ఓవర్లలో 50కి పైగా పరుగులు చేయాలి. ఈ క్రమంలోనే గేర్ మార్చిన స్టాయినిస్, మాథ్యువేడ్ ఆస్ట్రేలియాను గెలిపించారు.
ముఖ్యంగా మాథ్యువేడ్ వరుసగా మూడు సిక్సులు కొట్టి ఆస్ట్రేలియాను ఫైనల్ చేర్చాడు. మొదట్లోనే వేడ్ ఇచ్చిన సులభమైన క్యాచ్ ను పాకిస్తాన్ క్రికెటర్ హసన్ అలీ నేలపాలు చేసి పాకిస్తాన్ ఓటమికి కారణమయ్యాడు. 2 ఓవర్లలో 22 పరుగులు చేయాల్సిన దశలో మూడు సిక్సులు కొట్టి ఒక ఓవర్ మిగిలి ఉండగానే ఆస్ట్రేలియాను విజేతగా నిలిపాడు.
Also Read: టీమిండియా ఇంటిదారి పట్టడంతో బిజీగా ట్విట్టర్: పోస్టులు, మీమ్స్ తో రచ్చ