5G Network In India: ఇప్పుడు ఇండియా అంటోంది 5జీ..

ఎరిక్సన్ కన్జ్యూమర్ ల్యాబ్ ఇటీవల 5జీ వినియోగదారులపై అధ్యయనం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 28 మార్కెట్లను అధ్యయనం చేసినఈ సంస్థ భారత్ లో 50 మిలియన్ల మొబైల్ వినియోగదారులపై సర్వే చేసింది.

Written By: Srinivas, Updated On : October 4, 2023 10:49 am

5G Network In India

Follow us on

5G Network In India: చేతిలో మొబైల్ లేకుండా బతుకలేని కాలం ఇది. చిన్న చిన్న అవసరాలతో పాటు వ్యాపారాలు నిర్వహించడానికి ఫోన్ ఎంతగానో ఉపయోగపడుతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఫోన్లు, నెట్ వర్క్ అభివృద్ధి చెందుతోంది. ఒకప్పుడు డబ్బున్న వారు మాత్రమే ఇంటర్నెట్ వాడేవారు. ఆ తరువాత ప్రత్యేకంగా ఇంటర్నెట్ సెంటర్లు పెట్టి సామాన్యులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రతీ ఒక్కరి చేతిలో ప్రపంచం నిక్షిప్తమై ఉంది. ఈ క్రమంలో సాధారణ స్పీక్ కంటే హై స్పీడ్ నెట్ ను కోరుకుంటున్నారు వినియోగదారులు. వీరి అవసరాలను గుర్తించిన టెలికాం రంగం మొన్నటి వరకు ఉన్న 4జీ నెట్ వర్క్ ను 5జీకి అప్ గ్రేడ్ చేసింది. ఈ క్రమంలో భారత్ లో 5జీ వినియోగదారులు రోజురోజుకు పెరిగిపోతున్నారు.

ఎరిక్సన్ కన్జ్యూమర్ ల్యాబ్ ఇటీవల 5జీ వినియోగదారులపై అధ్యయనం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 28 మార్కెట్లను అధ్యయనం చేసినఈ సంస్థ భారత్ లో 50 మిలియన్ల మొబైల్ వినియోగదారులపై సర్వే చేసింది. ఈ సంస్థ నివేదిక ప్రకారం భారత్ లో ప్రస్తుతం 8 నుంచి 10 కోట్ల మంది 5జీ నెట్ వర్క్ ను వాడుతున్నారని తెలిపింది. ఈ సంఖ్య వచ్చే డిసెంబర్ 2023 నాటికి 3.1 కోట్ల మంది పెరుగుతారని అంచనా వేసింది.

2022 అక్టోబర్ లో 5జీ నెట్ వర్క్ ను లాంచ్ చేశారు. ఈ క్రమంలో భారత్ లో పెద్ద నెట్ వర్క్ సంస్థలైన జియో, ఎయిర్ టెల్ లు 5జీ సేవలను అందిస్తున్నాయి. ఇప్పుడున్న 4జీ వినియోగదారులను 5జీ లోకి కన్వర్ట్ కావాలని సూచలను చేస్తుంది. అత్యధిక వేగంతో ఉన్న 5జీ పై వినియోగదారులు ఇంట్రెస్ట్ పెడుతున్నారు. ఈ క్రమంలో 5జీ వాడేవారి సంఖ్య పెరిగిపోతుంది. మొబైల్ డేటా అప్ లోడ్ వేగం, వీడియో స్ట్రీమింగ్, గేమింగ్, వీడియో కాలింగ్ ఇలా ప్రతీ విషయంలో 5జీ తన పనితనాన్ని చూపిస్తోంది.

5జీ నెట్ వర్క్ విస్తరిస్తున్న నేపథ్యంలో చాలా మంది వినియోగదారులు 5జీ మొబైల్ ను కొనుగోలు చేయాలని చూస్తున్నారు. వీడియో స్ట్రీమింగ్, ఏఆర్ తదితర యాప్ లో కొత్త 5జీ మొబైల్ లు అందిస్తున్నాయి. ఇప్పటికే 5జీ మైబైల్ దారులు భారత్ లో47 శాతం ఏఆర్ ను వినియోగిస్తున్నట్లు ఎరిక్సన్ తెలిపింది. ప్రతీ 10 మంది వినయోగదారుల్లో ఇద్దరు కొత్త మొబైల్ కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొంది. భారత్ లో ఇతర మార్కెట్ల కంటే 15 శాతం యాప్ లు వినియోగిస్తున్నవారు ఎక్కువగా ఉన్నారు. ఈ క్రమంలో కొత్త మొబైల్ ను కొనుగోలు చేస్తున్నారు.