Operation Valentine Review : ఆపరేషన్ వాలెంటైన్ ఫుల్ మూవీ రివ్యూ…

ముఖ్యంగా ఆ వార్ ఎపిసోడ్స్ కి ముందు మనవాళ్లు పాకిస్తాన్ వెళ్లి రావడం లాంటివి కొన్ని సీన్స్ ని కట్ చేసి పక్కన పెడితే బాగుండేది... ఇక ఈ సినిమాకి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా రిచ్ గా ఉన్నాయి...

Written By: Gopi, Updated On : March 1, 2024 10:17 am
Follow us on

Operation Valentine Review : సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం డిఫరెంట్ సినిమాలకి డిమాండ్ ఎక్కువగా పెరుగుతుంది. అందుకే ప్రతి ఒక్క హీరో వైవిధ్యమైన కథాంశాలను ఎంచుకొని ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఇక అందులో భాగంగానే ఈ వారం పూల్వామా అటాక్స్ ను బేస్ చేసుకొని వరుణ్ తేజ్ హీరోగా ‘ఆపరేషన్ వాలంటైన్’ అనే సినిమా తెరకెక్కింది. ఇక గత కొన్ని రోజుల నుంచి వరుణ్ తేజ్ వరుస సినిమాలతో ఎక్స్పరిమెంట్లు అయితే చేస్తున్నాడు. అవేవీ పెద్దగా సక్సెస్ కానప్పటికీ ఇప్పుడు కూడా ఇంకొక ఎక్స్పరిమెంట్ తో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది వరుణ్ తేజ్ కి ఒక మంచి సక్సెస్ దక్కిందా లేదా అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

కథ

పుల్వామా అటాక్స్ లో సీఆర్పీఎఫ్ జవాన్ల మీద జరిగిన దాడి కి ప్రతీకారంగా అర్జున్ అనే ఒక పైలట్ ఫైటర్ తన టీమ్ తో పాకిస్తాన్ మీద ఎలాంటి రివెంజ్ తీర్చుకున్నాడు అనే ఒక చిన్న పాయింట్ తోనే ఈ సినిమా తెరకెక్కింది. అయితే ఈ సినిమా కథ ఒరిజినల్ స్టోరీ కావడంతో దానికి కొంచెం ఫిక్షన్ స్టోరీని కూడా కలిపి ఈ సినిమాని తెరకెక్కించారు…

విశ్లేషణ

ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే పుల్వామా ఎటాక్స్ మీద సినిమా చేయాలని ఒక మంచి థాట్ డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింగ్ కి రావడం మంచి విషయం. దాన్ని కథగా రాసుకొని వరుణ్ తేజ్ లాంటి ఒక టాలెంటెడ్ హీరోని ఎంచుకొని సినిమా చేయడం కూడా బాగుంది. ఇక ఆయన కథ బాగా రాసుకున్నప్పటికీ దాన్ని ప్రేక్షకులకు నచ్చేలా తీయడం లో మాత్రం డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. ఎందుకంటే ఎంతసేపు ఓకే ఫార్ములా ని బేస్ చేసుకొని ఈ సినిమాని నడిపారు. ఎంతసేపు అటాక్ చేద్దామా అనే టెంప్లేట్ లోనే ఈ సినిమా నడుస్తూ ఉంటుంది. ఇక మనవాళ్లు జెట్ ఫ్లైట్స్ వేసుకొని ఏదో వెకేషన్ కి వెళ్లి వచ్చినట్టుగా పాకిస్తాన్ కి వెళ్లి వస్తూనే ఉంటారు. పాకిస్తాన్ వాళ్ళు మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళిపోండి లేదంటే చచ్చిపోతారని వార్నింగ్ ఇవ్వడం, మనవాళ్లు మళ్లీ జెట్ ఫ్లైట్ చేసుకొని వెనక్కి రావడం ఇవన్నీ ఆడియన్ ఓపికకి పరీక్ష పెడతాయి. నిజానికి ఈ సినిమా పేరుని ‘ఆపరేషన్ వాలంటైన్ ‘ అని కాకుండా ‘ప్రాజెక్ట్ వజ్ర ‘ అని కూడా పెట్టొచ్చు. ఆపరేషన్ వాలంటైన్ అనేది వాలెంటైన్స్ డే కి వ్యతిరేకంగా పెట్టినట్టుగా తెలుస్తుంది.ఇక మన మీద జరిగిన అటాక్ ని తిప్పి కొట్టే కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కింది. కానీ ఈ సినిమాలో మాత్రం అంత గొప్ప గా ఏమీ చూపించలేదు. నిజానికి ఈ సినిమా స్క్రీన్ ప్లే చాలా దారుణంగా రాసుకున్నారు. ఒక్క హై ఎలిమెంట్ లేకుండా, ప్రేక్షకుడు ని అసలు ఎంగేజ్ చేయకుండా ఎగ్జిక్యూషన్ పరంగా దర్శకుడు మొత్తం ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. ఒక దేశభక్తి మీద వచ్చిన సినిమాలో ఎలాంటి గూస్ బంస్ ఎపిసోడ్స్ ఉండాలి. ఇందులో ఏ ఒక్కటి కూడా మనకు అలాంటి ఎపిసోడ్ అయితే కనిపించదు. వరుణ్ తేజ్ మరొకసారి చాలా మంచి ప్రయోగాత్మకమైన సినిమా అయితే చేశాడు. కానీ ఏం లాభం దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. ప్రాపర్ రైటింగ్ లేకుండా దర్శకుడు సినిమాను తెరకెక్కించడమే ఈ సినిమాకు చాలా పెద్ద మైనస్ అయింది. ఇక ఆపరేషన్ వాలంటైన్ లో ఎంతసేపు పాకిస్తాన్ మీదనే ఫోకస్ చేశారు. అదే చైనా వాడు మనకు వైరస్ ని పంపించాడు అలా వాళ్ల మీద కూడా ఫోకస్ చేసి వాళ్ల మీద కూడా దాడి చేస్తే సరిపోయేది కదా అనే డౌట్ సినిమా చూసే ఆడియన్స్ కి తప్పకుండా వస్తాయి. ఇలా భారతీయుల అందరి ఎమోషన్ ని క్యాష్ చేసే ఒక యూనిక్ పాయింట్ తో వచ్చినప్పటికీ దర్శకుడు మాత్రం దాన్ని మనకు చేరువ చేయడంలో సక్సెస్ సాధించలేకపోయాడు. ఇక దానికి తోడుగా రీసెంట్ గా బాలీవుడ్ లో ‘ఫైటర్ ‘ అనే ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా ఈ సినిమా ఒకే టెంప్లేట్ లో ఒకేలా ఉండడం వల్ల ఆ సినిమా చూసిన వాళ్ళకి ఈ సినిమా చూసే అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు. అర్జున్ కి ఒక లవ్ స్టోరీ కూడా ఉంటుంది కానీ దాన్ని కరెక్ట్ గా పుల్ ఆఫ్ చేయడంలో దర్శకుడు మరోసారి తడబడ్డాడు. ఇలా దర్శకుడు కి ప్రతిభ లేకపోవడమే ఈ సినిమాని విజయ తీరాలకు చేర్చలేకపోయింది అనేది మాత్రం వాస్తవం…

నటీనటుల పర్ఫామెన్స్…

నటీనటుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే వరుణ్ తేజ్ అన్ని సినిమాల మాదిరిగానే ఈ సినిమాలో కూడా తన పూర్తి ఎఫర్ట్ ని పెట్టాడు. తను ఒక్కడే వన్ మ్యాన్ షో చేసినప్పటికీ దర్శకుడు సినిమాను నడిపించిన విధానం సరిగ్గా లేకపోవడంతో ఆయన క్యారెక్టర్ కూడా బాగా ఎలివేట్ అయితే అవదు. ఇక హీరోయిన్ పాత్ర చేసిన ‘మనుషి చిల్లర్ ‘ ఓకే అనిపించింది. అలాగే వరుణ్ తేజ్ కి ఆమెకి మధ్య వచ్చే కొన్ని లవ్ సీన్స్ లో పర్ఫామెన్స్ కూడా ఓకే అనేలా ఉంటుంది… ఇక మిగిలిన ఆర్టిస్టులు అయిన నవదీప్, సంపత్ రాజ్ అభినవ గోమఠం లాంటివారు వాళ్ళపాత్రలా పరిధిలో చాలా బాగా నటించారు. ఇక ముఖ్యంగా నవదీప్ అయితే చాలా మంచి ఆర్టిస్ట్ కానీ అతన్ని వాడుకోవడంలో దర్శకుడు పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. అసలు అతన్ని ఇలాంటి క్యారెక్టర్ లో ఎందుకు తీసుకున్నారో కూడా సినిమా చూసిన వాళ్లకి అర్థం అవ్వదు…ఇక సాయి మాధవ్ బుర్ర రాసిన డైలాగ్ ఒక్కటి కూడా రిజిష్టర్ అవ్వదు.

టెక్నికల్ అంశాలు

ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ సినిమా విజువల్ గా ఓకే అనిపించినప్పటికీ ప్రేక్షకున్ని ఎంగేజ్ చేయడం మాత్రం పెద్దగా సక్సెస్ అయితే సాధించలేదు. మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే అనేలా ఉంది. ఇక వందేమాతరం సాంగ్ అయితే ప్రేక్షకులకు ఒక హై మూమెంట్ ని ఇచ్చిందనే చెప్పాలి. ఇక ఈ సాంగ్ ను మినహా ఇస్తే, ఎంటైర్ సినిమాలో హై మూమెంట్ అనేది మనకు ఎక్కడ కనిపించదు. ఈ సాంగ్ ఇవ్వడంలో మిక్కీ జే మేయర్ చాలా వరకు సక్సెస్ అయ్యాడు… ఇక హరి కే వేదాంతం సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్ అయితే టాప్ నాచ్ లో ఉన్నాయనే చెప్పాలి. ముఖ్యంగా కొన్ని షాట్స్ అయితే చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశాడు. ఇక నవీన్ నూలీ ఎడిటింగ్ ఓకే అనిపించినప్పటికీ కొన్ని సీన్స్ షార్ప్ ఎడ్జ్ లో ట్రిమ్ చేస్తే బాగుండేది అనిపించింది. ముఖ్యంగా ఆ వార్ ఎపిసోడ్స్ కి ముందు మనవాళ్లు పాకిస్తాన్ వెళ్లి రావడం లాంటివి కొన్ని సీన్స్ ని కట్ చేసి పక్కన పెడితే బాగుండేది… ఇక ఈ సినిమాకి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా రిచ్ గా ఉన్నాయి…

ప్లస్ పాయింట్స్

కథ
వరుణ్ తేజ్ యాక్టింగ్

మైనస్ పాయింట్స్

స్క్రీన్ ప్లే
డైరెక్షన్

రేటింగ్
ఈ సినిమా మేము ఇచ్చే రేటింగ్ 2/5

చివరి లైన్
దేశభక్తి సినిమా కాబట్టి వీలైతే ఒకసారి చూడవచ్చు…