https://oktelugu.com/

Ooru Peru Bhairavakona Movie Review: ఊరు పేరు భైరవకోన మూవీ రివ్యూ…

సందీప్ కిషన్ ఖాతాలో ఒక సక్సెస్ పడిందా, లేదంటే ఫ్లాపుల పరంపరని ఇంకా కూడా కొనసాగిస్తున్నాడా అనే విషయాలని బ్రీఫ్ అనాలసిస్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం...

Written By:
  • Gopi
  • , Updated On : February 15, 2024 / 01:22 PM IST
    Follow us on

    Ooru Peru Bhairavakona Review: ప్రస్తుతం తెలుగులో చాలా వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఇక తెలుగులో ఉన్న యంగ్ హీరోలు అందరిలో సందీప్ కిషన్ ఒకరు..ఈయన ప్రతిసారి వైవిధ్యమైన కథాంశాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నప్పటికీ, ఆ సినిమాలు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడంలో చాలావరకు ఫెయిల్ అవుతున్నాయి. ఇక అందులో భాగంగానే ఇప్పుడు కూడా ఊరు పేరు భైరవకోన అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది సందీప్ కిషన్ ఖాతాలో ఒక సక్సెస్ పడిందా, లేదంటే ఫ్లాపుల పరంపరని ఇంకా కూడా కొనసాగిస్తున్నాడా అనే విషయాలని బ్రీఫ్ అనాలసిస్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

    కథ
    ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే బసవ (సందీప్ కిషన్), అతని ఫ్రెండ్ అయిన జాన్(వైవా హర్ష) లు అనుకోని కొన్ని కారణాలవల్ల ఒక దొంగతనం చేస్తారు. ఆ దొంగతనం చేసి భైరవకోన అనే ఊరిలోకి వెళ్తారు. ఇక వీళ్ళ తో పాటుగా గీత ( కావ్య థాపర్) కూడా ఆ ఊర్లోకి ఎంటర్ అవుతుంది. ఇక అక్కడ వీళ్ళ ముగ్గురి జీవితాలు ఎలా మలుపు తిరిగాయి అనే దాని నుంచి కథ మరొక మలుపు తిరుగుతుంది. వీళ్లు దొంగతనం చేసుకొని వచ్చిన బంగారాన్ని అక్కడి ఊరిలో ఉన్న రాజప్ప సొంతం చేసుకుంటాడు. అయితే భైరవకోనలో భయానిక సంఘటనలు జరుగుతూ ఉంటాయి. గరుడ పురాణం లో మిస్సయిన నాలుగు పేజీలకు భైరవకోన కి మధ్య సంబంధం ఏంటి అనే దాని మీద ఈ కథ నడుస్తుంది. ఇక ఇలాంటి క్రమంలోనే ఆ ఊరికి, హీరోకి మధ్య కనెక్షన్ ఏంటి అనేది కూడా ట్విస్ట్ తో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది…

    విశ్లేషణ
    ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే ఈ సినిమాలో దర్శకుడు వీఐ ఆనంద్ ఎంచుకున్న పాయింట్ బాగానే ఉన్నప్పటికీ, విఐ ఆనంద్ ఫస్ట్ హాఫ్ వరకు మాత్రమే సినిమాను చాలా ఎంగేజింగ్ గా తీసుకెళ్ళాడు. ఇక సెకండ్ హాఫ్ లో ఈ సినిమా చాలా వరకు డల్ అయిందనే చెప్పాలి. ముఖ్యంగా ఫిక్షనల్ స్టోరీలను చెబుతున్నప్పుడు దర్శకుడు సినిమా లిబర్టీ ని ఆ స్టోరీని బట్టి తీసుకోవాలి. కానీ వీఐ ఆనంద్ కావలసిన దానికంటే ఎక్కువ సినిమా లిబర్టీ తీసుకొని స్టోరీని సగటు ప్రేక్షకుడికి అర్థమయ్యేలా మలచడం లో కొంతవరకు ఫెయిల్ అయ్యాడు. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ, అలాగే సినిమాని ఎంగేజ్ చేసే సీన్లతో నడిపించాడు,కానీ సెకండాఫ్ లో నడవాల్సిన కోర్ ఎమోషన్ ను మాత్రం చాలా వరకు తగ్గించాడనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ చాలా పెద్దదిగా ఉండడంతో ఆయన అనుకున్న సమయంలో ప్రేక్షకుడికి ఆ పాయింట్ ను చేరువ చేయడంలో చాలావరకు తడబడ్డాడనే చెప్పాలి.

    విఐ ఆనంద్ గత చిత్రాలను కనక చూసుకున్నట్లయితే ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాని మినహాయిస్తే మిగిలిన అన్ని స్టోరీలు కూడా చాలా పెద్దగా ఉండడంతో వాటిని ప్రేక్షకుడికి చేర్చడం లో ప్రతిసారి తను అదే మిస్టేక్ ను చేస్తున్నాడు. ఇక సింపుల్ పాయింట్ తీసుకొని ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేలా సీన్లను రాసుకొని దాన్ని స్ట్రైయిట్ గా ప్రేక్షకులు చెప్తే బాగుంటుంది. కానీ టిపికల్ నరేషన్ లో కొత్తగా ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటూ విఐ ఆనంద్ సినిమాని తెరకెక్కించాలని చూడడమే అతను చేసే ప్రతి సినిమాకి మైనస్ గా మారుతుంది…

    ఆర్టిస్టుల పర్ఫామెన్స్
    ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే సందీప్ కిషన్ ఎప్పటిలాగే తన పూర్తి ఎఫర్ట్ పెట్టి ఈ సినిమాలో నటించాడు. అయినప్పటికీ సినిమాలో కొన్ని ఫ్లాస్ ఉండటం వల్ల ఈ సినిమా సక్సెస్ అవ్వాల్సింది, కానీ జస్ట్ యావరేజ్ సినిమాగా మిగిలి పోవాల్సి వచ్చింది. ఇక వర్ష బోల్లమా పోషించిన క్యారెక్టర్ కూడా ఈ సినిమాకి చాలా ప్లస్ అయింది. ముఖ్యంగా ఈ సినిమాలో ఆమె చేసిన ప్రతి సీన్ కూడా ప్రేక్షకుడిని కట్టిపడేసిందనే చెప్పాలి. వైవా హర్ష , వెన్నెల కిషోర్ ఇద్దరు కూడా మంచి కామెడీ ని పండిస్తూ సినిమాని కొంతవరకు ఎంగేజ్డ్ గా తీసుకెళ్లారు. కావ్య థాపర్ కూడా తన పాత్ర పరిధి మేరకు బాగా చేసిందనే చెప్పాలి. ఇక వీళ్ళ తో పాటుగా మిగిలిన పాత్రలు పోషించిన అందరూ కూడా వాళ్ల పాత్ర పరిధి మేరకు ఓకే అనిపించారు…

    టెక్నికల్ అంశాలు
    టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ సినిమాలో ఉన్న ప్రతి ఒక్క టెక్నీషియన్ తమ పూర్తి ఎఫర్ట్ పెట్టి పని చేశారనే చెప్పాలి. ముఖ్యంగా శేఖర్ చంద్ర మ్యూజిక్ అయితే ఈ సినిమాకి చాలా ప్లస్ అయింది. అలాగే బిజిఎం కూడా చాలా అద్భుతంగా ఇచ్చాడు. ఆయన బిజిఎం వల్లే కొన్ని సీన్లు ప్రేక్షకులను సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టాయి. ఇక రాజ్ తోట సినిమాటోగ్రఫీ కూడా ఈ సినిమాకు చాలా వరకు ప్లస్ అయింది. కొన్ని షాట్స్ అయితే చాలా క్రియేటివ్ గా డిజైన్ చేయడమే, కాకుండా విజువల్స్ ప్రకారం ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ని చాలా కొత్తగా చూపించాడు. అలాగే భైరవకోన ఊరుని తను చూపించిన విధానం అయితే చాలా ఎక్సలెంట్ గా ఉందనే చెప్పాలి. ఎడిటర్ చోటా కే ప్రసాద్ సినిమా మొత్తం స్టొరీ తో నిండిపోవడంతో తనకు ఏ సీన్ కట్ చేయాలి, చేసిన కూడా దాన్ని ఎంత లెంత్ లో కట్ చేయాలి అనేది క్లారిటీ లేకుండా పోయింది. అందువల్లే సినిమాలో ఎడిటింగ్ వర్క్ అనేది సాఫీగా సాగలేదనే చెప్పాలి…

    ప్లస్ పాయింట్స్
    కథ
    సందీప్ కిషన్, వైవా హర్ష , వెన్నెల కిషోర్ల యాక్టింగ్
    కొన్ని థ్రిల్లింగ్ సీన్స్

    మైనస్ పాయింట్స్
    స్లో నరేషన్
    ఆర్టిఫిషియల్ సీన్స్
    కొన్ని సీన్లు ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వకపోవడం

    రేటింగ్
    ఇక ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2.25/5