One Chance: ఒక్క ఛాన్స్.. ఏపీని ‘అంధకారం’ దిశగా తీసుకెళుతుందా?

One Chance AP Towards ‘Darkness’: వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు ఒక్క ఛాన్స్ ఇస్తే ఏపీ భవిష్యత్ ను మారుస్తానని ఎన్నికల ప్రచారం చేశారు. పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి హామీలను నమ్మిన ఏపీ ప్రజలు 151 సీట్లతో వైసీపీని గెలిపించారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పాలన మూడేళ్లు పూర్తయింది. ఈ మూడేళ్లలో సంక్షేమానికి పెద్దపీఠ వేసిన జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి విషయంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యారు. మూడు రాజధానుల పేరుతో అమరావతిని గాలికొదిలేసినా జగన్మోహన్ రెడ్డి […]

Written By: NARESH, Updated On : April 8, 2022 10:41 am
Follow us on

One Chance AP Towards ‘Darkness’: వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు ఒక్క ఛాన్స్ ఇస్తే ఏపీ భవిష్యత్ ను మారుస్తానని ఎన్నికల ప్రచారం చేశారు. పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి హామీలను నమ్మిన ఏపీ ప్రజలు 151 సీట్లతో వైసీపీని గెలిపించారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పాలన మూడేళ్లు పూర్తయింది. ఈ మూడేళ్లలో సంక్షేమానికి పెద్దపీఠ వేసిన జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి విషయంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యారు.

Andhra Pradesh

మూడు రాజధానుల పేరుతో అమరావతిని గాలికొదిలేసినా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కొత్తగా జిల్లాల విభజన చేపట్టారు. ఏపీ భవిష్యత్ ను మారాస్తానంటూ ఏపీ భౌగోళిక స్వరూపాన్నిమాత్రమే మార్చివేశారు. ఏపీకి రాజధాని పూర్తి స్థాయిలో నిర్మించకుండా జిల్లాలను ఏర్పాటు చేసి సీఎం జగన్మోహన్ రెడ్డి ఏం సాధిస్తారో ఆయనకే తెలియాలి?.

జగన్మోహన్ రెడ్డికి పరిపాలన పట్టు లేదని చెప్పడానికి ఏపీలో విద్యుత్ సంక్షోభం నిలువెత్తు నిదర్శనంగా కన్పిస్తోంది. గత కొద్దిరోజులుగా అనధికారిక విద్యుత్ కోతలను విధించిన ప్రభుత్వం ఇప్పుడు అధికారికంగా చేపట్టబోతుంది. ఏపీలో డిమాండ్ తగిన సరఫరా లేదని, బయట విద్యుత్ కోనే స్థితిలేదని గ్రహించిన డిస్కంలు ఏపీలో పవర్ హాలీడేను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు.

ఏపీలో ప్రస్తుతం జెన్‌కోతోపాటు హిందుజా నుంచి వచ్చే థర్మల్‌ విద్యుత్‌తో కలిపి 90.79 ఎంయూలు అందుబాటులో ఉంది. జల విద్యుత్‌ ప్రాజెక్టుల నుంచి 9.5 ఎంయూలు, పవన, సౌర విద్యుత్‌ కలిపి 26 ఎంయూలు, కేంద్ర విద్యుదుత్పత్తి సంస్థ ఎన్‌టీపీసీ నుంచి 40ఎంయూల వచ్చినా ఏపీలో డిమాండ్‌ మేర ఇంకా 50ఎంయూలు డిస్కంలు కొనాల్సి ఉంటుంది.

ఈ పరిస్థితుల్లో రోజుకు కనీసం రూ.35 కోట్లు అవసరమని అధికారుల అంచనా వేస్తున్నారు. విద్యుత్ ఎక్స్చేంజీల్లో డిమాండ్ భారీగా పెరిగడంతో ఏపీ డిస్కంలు దాఖలు చేసిన బిడ్‌కు ఇక్కడ విద్యుత్‌ దొరకటం లేదని సమాచారం. దీంతో గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో కొద్దిరోజులుగా అప్రకటిత విద్యుత్ కోతలు అమలు అవుతున్నాయి.

బయట విద్యుత్ దొరకని పరిస్థితి ఉండటంతో ఏపీలో రెండు వారాలపాటు అధికారికంగా విద్యుత్ కోతలు అమల్లో ఉంటాయని అధికారులు చెబుతున్నారు. పరిశ్రమలకు 50శాతం విద్యుత్ కోతలు తప్పవని ట్రాన్స్ కో అధికారులు పేర్కొంటున్నారు. దీంతోపాటు వారానికి ఒకరోజు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. దీంతో ఏపీలో క్రాప్ హాలీడ్ లాగే పవర్ హలీడే రానుంది.

మొత్తానికి ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డిని ఏపీలోని అంధకారంలోకి నెట్టివేయడంలో మాత్రం నూటికి నూరు శాతం విజయం సాధించారనే కామెంట్స్ విన్పిస్తున్నాయి. ఇప్పటికైనా సీఎం జగన్మోహన్ రెడ్డి విద్యుత్ కొనుగోలు విషయంలో ముందుచూపు నిర్ణయాలు తీసుకొని ఏపీని ప్రస్తుత పరిస్థితుల నుంచి గట్టెక్కించాలని ఏపీ వాసులు వేడుకుంటున్నారు.