Odi World Cup 2023: 2023 వరల్డ్ కప్ లో భాగంగా ప్రస్తుతం ఇండియా టీం వరుస విజయాలను అందుకుంటు ముందుకు దూసుకెళ్తుంది. ఇక ఇలాంటి క్రమంలో ఇండియా వరుస విజయాలను అందుకోవడమే కాకుండా ఇండియా టీం నెంబర్ వన్ పొజిషన్ లో కూడా కొనసాగుతుంది. రీసెంట్ గా న్యూజిలాండ్ మీద జరిగిన మ్యాచ్ లో ఈ టోర్నీలో భారత బౌలర్ అయిన మహ్మద్ షమీ 5 వికెట్లు తీసి న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్స్ ని భారీ దెబ్బతీశాడు.
ఆయన వేసిన మొదటి బంతికే వికెట్ తీసి అద్భుతాన్ని క్రియేట్ చేశాడు.ఇక ఈ మ్యాచ్ లో శార్దూల్ ఠాకూర్ ప్లేస్ లో టీం లోకి వచ్చిన మహ్మద్ షమీ అద్భుతమైన బౌలింగ్ చేసి ఇన్ని రోజులు తనని టీమిండియా ఎందుకు టీం లోకి తీసుకోలేదు అనే ఒక క్వశ్చన్ రేజ్ చేశాడు. ఇక ఇలాంటి క్రమంలో రోహిత్ శర్మ కి షార్దుల్ ఠాకూర్ ని తీసుకోవాలా లేదా మహ్మద్ షమీని తీసుకోవాలా అనేది కొరక రాని కొయ్యగా మారింది. ఇక ఇప్పటికే హార్థిక్ పాండ్యా ప్లేస్ లో టీం లోకి వచ్చిన సూర్య కుమార్ యాదవ్ మరోసారి తన పేలవమైన పర్ఫామెన్స్ ను చూపించాడు.ఇక హార్దిక్ పాండ్యా టీమ్ లోకి రాబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే శార్దూల్ ఠాకూర్ ప్లేసులో మళ్ళీ షమీ నే కంటిన్యూ చేయబోతున్నట్టు గా తెలుస్తుంది.
ఎందుకంటే షమీకి ప్రస్తుతం మంచి ఫాం లో ఉన్నాడు.అలాగే షార్దుల్ ఠాకూర్ తన మ్యాజిక్ ని ఏమాత్రం రిపీట్ చేయలేకపోతున్నాడు. ఒకప్పుడు శార్దూల్ ఠాకూర్ ఇండియన్ టీం లో ఉన్నాడు అంటే టీం కిష్ట పరిస్థితిల్లో ఉన్నప్పుడు వచ్చి వికెట్ తీసి ఇండియన్ టీమ్ కి మంచి విజయాలను అందించేవాడు. కానీ ఇప్పుడు ఆయన ఫామ్ ని ఏ మాత్రం అందుకోలేకపోతున్నాడు.ఇక దానివల్లే ఇండియన్ టీమ్ కి బరి నష్టం జరుగుతుంది కాబట్టి ఆయన్ని టీం లోకి తీసుకోవడం కంటే ఆయన ప్లేస్ లో షమీ ని తీసుకోవడం బెటర్ అని కెప్టెన్ రోహిత్ శర్మతో పాటుగా కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇప్పటికే మూడు మ్యాచ్ ల్లో శార్దుల్ ఠాకూర్ కి అవకాశం ఇచ్చారు అయిన కూడా ఆయన తన స్థాయి పర్ఫామెన్స్ అయితే ఇవ్వలేకపోయాడు….
నిజానికి ఇండియా తరుపున ఉన్న బౌలర్లలో ప్రస్తుతం ఉన్న పేస్ బౌలింగ్ డిపార్ట్మెంట్ లో మహ్మద్ షమీ ఇండియన్ టీం కి దొరికిన ఒక ఆణిముత్యం అనే చెప్పాలి.అలాంటి షమీని ఇన్ని రోజుల నుంచి ఆడకుండా బెంచ్ పైన కూర్చోబెట్టడం అనేది టీమిండియా చేసిన తప్పని చెప్పాలి. షమీ ని టీం లోకి తీసుకుంటేనే మ్యాచులు అనేవి ఈజీగా ఇండియా గెలవగలుగుతుంది అంటూ చాలామంది సీనియర్లు సైతం వాళ్ల అభిప్రాయాలని వ్యక్తం చేస్తున్నారు…