ODI World Cup 2023 : వచ్చే నెల అక్టోబర్ నుంచి వరల్డ్ కప్ స్టార్ట్ అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే… ఈ వరల్డ్ కప్ కోసం ఇప్పటికే బీసీసీఐ ఇండియన్ టీం లో ఆడే ఇండియన్ ప్లేయర్ల స్క్వాడ్ ని ప్రకటించడం జరిగింది. అందులో చాలామంది ప్లేయర్లు ఉన్నప్పటికీ తిలక్ వర్మ ని మాత్రం సెలెక్ట్ చేయలేదు. అయితే ఇంతకుముందు నుంచి తిలక్ వర్మ కి బాగా హైప్ ఇస్తూ ఇతను చాలా బాగా ఆడుతున్నాడు అంటూ చెప్పుకుంటూ వచ్చారు. ఇతను వరల్డ్ కప్ లో పక్కా ఉంటాడు అని అనుకున్న టైంలో తిలక్ వర్మ ను అసలు వరల్డ్ కప్ లో సెలెక్ట్ చేయలేదు. 15 మందితో కూడిన ఇండియా టీమ్ స్క్వాడ్ ని మన చీఫ్ సెలెక్టర్ అయినా అజిత్ అగర్కర్ అనౌన్స్ చేయడం జరిగింది.అయితే తిలక్ వర్మ పేరు ఇందులో లేకపోవడం చాలా బాధని కలిగించే విషయం అనే చెప్పాలి.
ఇక ఇప్పుడు అనే కాదు తెలుగు ప్లేయర్ల ను వరల్డ్ కప్ కి ఎప్పుడు సెలెక్ట్ చేయడం లేదు.ఈ వివక్ష అనేది ఇప్పుడు కాదు చాలా సంవత్సరాల నుంచి తెలుగు ప్లేయర్లు ఎదురుకుంటు వస్తున్నారు.
2003లో వీవీఎస్ లక్ష్మణ్ కూడా చాలా బాగా ఆడినప్పటికీ అతన్ని వరల్డ్ కప్ టీంలో సెలెక్ట్ చేయలేదు. అలాగే 2019లో అంబటి రాయుడు చాలా మంచి పర్ఫామెన్స్ ఇస్తూ వచ్చినప్పటికీ అతన్ని సెలక్టర్లు పట్టించుకోలేదు. ప్రస్తుతం తిలక్ వర్మ పరిస్థితి కూడా అలానే ఉంది. ఎందుకు వీళ్లు తెలుగు వాళ్ళని అంత చిన్న చూపు చూస్తూ వరల్డ్ కప్ లోకి సెలెక్ట్ చేయడం లేదే అర్థం కావడం లేదు.
ఇక మన తెలుగు బౌలర్ అయిన మహమ్మద్ సిరాజ్ ని వరల్డ్ కప్ టీం లో సెలెక్ట్ చేసిన విషయం తెలిసిందే. బౌలర్ల విషయం పక్కన పెడితే ప్రేత్యేకం గా బ్యాట్స్ మెన్స్ విషయం లోనే ఇండియన్ సెలక్టర్లు ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావడం లేదు…