odi world cup 2023 indian team : ప్రతిష్టాత్మకంగా అక్టోబర్ 5 నుంచి భారత్ లో జరిగే వన్డే ప్రపంచకప్ కు భారత జట్టును బీసీసీఐ కొద్దిసేపటి క్రితమే ప్రకటించింది. ఆసియా కప్ కోసం 17మందితో కలిసి శ్రీలంకలో ఉన్న టీమిండియా నుంచి 15 మందితో వన్డే వరల్డ్ కప్ టీంను ఎంపిక చేసింది.
చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఈ ఎంపిక చేసింది. రోహిత్ శర్మ కెప్టెన్ గా 15మందితో కూడిన జట్టును ప్రకటించింది.
ఆసియాకప్ తో పునరాగమనం చేసిన శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ లకు వన్డే వరల్డ్ కప్ లో అవకాశం దక్కింది. సీనియర్ పేసర్ బుమ్రా బౌలింగ్ హెడ్ గా పెట్టింది.
ఇక వన్డేల్లో పెద్దగా రాణించలేకపోతున్నా కూడా సూర్యకుమార్ యాదవ్ వైపు సెలక్టర్లు మొగ్గు చూపి ఎంపిక చేయడం విశేషం. ఇక పేస్ ఆల్ రౌండర్లు అయిన ‘శార్ధుల్ ఠాకూర్, హార్ధిక్ పాండ్యా’లను ఎంపిక చేశారు. ఇక స్పిన్ ఆల్ రౌండర్లుగా రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ లకు అవకాశం కల్పించారు. కులదీప్ యాదవ్ ను స్పెషలిస్ట్ స్పిన్నర్ గా అవకాశం ఇచ్చారు.
ఇక టీం సెలక్షన్ లో హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మతోపాటు బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ, సంజూ శాంసన్ లకు అవకాశం దక్కలేదు.
ఆసియా కప్ లో ఆడే జట్టులోని ఈ ముగ్గురిని పక్కనపెట్టి మిగతా టీంనే ప్రకటించారు. కేఎల్ రాహుల్ ను కొనసాగించారు.
Here's the #TeamIndia squad for the ICC Men's Cricket World Cup 2023 🙌#CWC23 pic.twitter.com/EX7Njg2Tcv
— BCCI (@BCCI) September 5, 2023