https://oktelugu.com/

IND vs SL : ఏం గెలుపురా బాబూ.. 302 పరుగుల తేడాతో విజయం.. శ్రీలంకను చెడుగుడు ఆడిన టీమిండియా..

ఇలా బ్యాటింగ్, బౌలింగ్ లో టీమిండియా సత్తా చాటి శ్రీలంకను చిత్తు చేసింది. షమీకే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వచ్చింది.

Written By:
  • NARESH
  • , Updated On : November 2, 2023 / 08:58 PM IST
    Follow us on

    IND vs SL : గెలుపు అంటే ఇదీ.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 302 పరుగుల తేడాతో విజయం.. ఆసియాకప్ లో అదే 50 పరుగులకు అటూ ఇటూగా శ్రీలంకను ఔట్ చేసిన టీమిండియా బౌలర్లు ఇప్పుడు కూడా 55 పరుగులకే ఆలౌట్ చేసి షాకిచ్చారు. షమీ నిప్పులు చెరుగుతూ 5 వికెట్లు తీసి సత్తాచాటాడు. సిరాజ్ 3, బుమ్రా 1 వికెట్లతో రాణించారు. భారత బౌలింగ్ దెబ్బకు శ్రీలంక తక్కువకే ఆలౌట్ అయ్యింది.

    అంతకుముందు.. ముంబయిలోని వాంఖడే స్టేడియంలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్ అర్ధసెంచరీలతో భారత్ 50 ఓవర్లలో 357/8 పరుగులు చేసింది. దిల్షాన్ మధుశంక తొలి ఓవర్ రెండో బంతికే రోహిత్ ను ఔట్ చేసి షాకిచ్చాడు. ఆ తర్వాత గిల్, కోహ్లీ రెచ్చిపోయి ఆడి సెంచరీలు మిస్ చేసుకున్నారు.

    అంతకుముందు, శ్రీలంక టాస్ గెలిచింది. కెప్టెన్ కుసాల్ మెండిస్ మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు, ఈ నిర్ణయం తప్పని భారత బ్యాటర్లు రెచ్చిపోవడంతో తెలిసివచ్చింది. స్టాండ్స్‌లో సిక్సులు, ఫోర్లతో అభిమానులను టీమిండియా బౌలర్లు అలరించారు. టాస్ గెలిచి ఉంటే ముందుగా బ్యాటింగ్ చేసి ఉండేవాళ్లమని భారత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా అన్నాడు. భారత్ జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. వరుసగా ఆరు గేమ్‌లు గెలిచిన రోహిత్ శర్మ అండ్ కో ఫేవరెట్‌లుగా గేమ్‌లోకి వచ్చారు. తమ చివరి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ ను 100 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా ఈ మ్యాచ్ లో ఏకంగా 302 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించడం విశేషం.

    గత వారం చిన్నస్వామి స్టేడియంలో ఇంగ్లండ్‌పై ఉత్తమ ప్రదర్శన చేసిన తర్వాత శ్రీలంకకు, పూణేలో ఆఫ్ఘనిస్తాన్‌పై ఓటమితో ఎదురుదెబ్బ తగిలింది. కుసాల్ మెండిస్ నేతృత్వంలోని జట్టు ఆరు గేమ్‌లలో కేవలం రెండు విజయాలను మాత్రమే చేసింది. టోర్నమెంట్ లో ఆ జట్టు ఎలిమినేట్ అయిపోయింది. టీమిండియా చేతిలో ఓటమితో ఎలిమినేట్ అయిపోయింది.

    మొత్తంగా టీమిండియా బ్యాటర్లు దంచి కొట్టడం.. షమీ 5 వికెట్లతో చెలరేగడం.. బుమ్రా తొలి బంతికే వికెట్ తో నడ్డి విరచడం.. సిరాజ్ మూడు వికెట్లతో రెచ్చిపోవడం.. ఇలా బ్యాటింగ్, బౌలింగ్ లో టీమిండియా సత్తా చాటి శ్రీలంకను చిత్తు చేసింది. షమీకే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వచ్చింది.