Number of Indian students in US : దూరపు కొండలు నునుపు అంటారు. అగ్రరాజ్యం అమెరికాలో చదువుకోవాలని.. అక్కడ మంచి ఉద్యోగం సంపాదించాలన్నది ప్రతి యువత కల. అందుకే ఎంత రిస్క్ అయినా అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. అమెరికా కూడా శాస్త్ర, సాంకేతిక, ఆర్థిక రంగాల్లో అగ్రగామిగా ఉంది. ఇతర దేశాల్లోని మేధావులను ఆహ్వానిస్తుంటుంది. అందుకే ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజలు అమెరికాలో నివసించాలని.. అక్కడే స్థిరపడాలని ఆశపడుతుంటారు.
![]()
ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా విద్య, ఉపాది, వ్యాపార అవకాశాల కోసం ప్రతి ఏటా అమెరికా వెళ్లే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ఏదో ఒక రకంగా అమెరికాలో స్థిరపడి డాలర్లు సంపాదించాలని అందరూ ఎంతో ఆశపడుతుంటారు. అమెరికాలో అత్యధిక సంఖ్యలో నివసించే వలసదారుల్లో చైనా, ఇండియన్స్ యే ఎక్కువ సంఖ్యలో ఉంటారు. ఇందులో అత్యంత శక్తివంతమైన, బలమైన కమ్యూనిటీ భారతీయులే అనడంలో ఎలాంటి సందేహం లేదు.
భారతీయ కుటుంబాలు అప్పు చేసైనా అమెరికాకు తమ పిల్లలను పంపిస్తున్నారు. చదువుల కోసం భారత్ నుంచి అమెరికాకు వెళ్లే వారి సంఖ్య భారీగా ఉంటోంది. అమెరికాకు చదువుల కోసం వెళ్లే వారి సంఖ్యలో అత్యధిక విద్యార్థులు చైనా వారే. ఆ తర్వాత రెండో స్థానంలో భారతీయ విద్యార్థులున్నారు. అయితే ఈ పరిస్థితి ఇప్పుడు మారింది.
అమెరికా వీసాలు సంపాదించి ఆ దేశానికి వెళుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య భారీగా పెరుగుతోంది. 2021లో భారతీ విద్యార్థుల సంఖ్య 12 శాతానికి పైగా పెరిగింది. ఇదే సమయంలో చైనీయుల సంఖ్య 8 శాతానికి పడిపోయింది.
2021లో అమెరికా విదేశీ విద్యార్థుల రాకపై కరోనా వైరస్ ప్రభావం పడిందని ‘యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్.సీఐఎస్) తన వార్షిక నివేదికలో తెలిపింది.
అమెరికాకు వచ్చే విద్యార్థుల సంఖ్య చూస్తే.. 2020లో 33569మంది చైనా విద్యార్థులు ఉన్నత విద్య కోసం వచ్చారు. ఇక భారత్ నుంచి 25391మందికి పైగా భారతీయ విద్యార్థులు అమెరికా వచ్చారు. భారతీయ విద్యార్థుల్లో 37శాతం మంది మహిళలే కావడం గమనార్హం.
మొత్తం మీద 3,48,992మంది విద్యార్థులతో చైనా మొదటి స్థానంలోనూ.. 2,32,851 మంది విద్యార్థులతో భారత్ రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత వరుసగా దక్షిణ కొరియా, కెనడా, బ్రెజిల్, వియత్నాం, సౌదీ అరేబియా, తైవాన్, జపాన్, మెక్సికోలు దేశాల విద్యార్థులున్నారు.