https://oktelugu.com/

NTR – Devara Movie : బ్రేకింగ్… రెండు భాగాలుగా దేవర, కారణం ఏమిటో చెప్పిన కొరటాల!

ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుండి వస్తున్న మూవీ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. దాదాపు రూ. 350 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం. ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మిస్తున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : October 4, 2023 / 05:45 PM IST

    devara-new-announcement-315431-1

    Follow us on

    NTR – Devara Movie : టాలీవుడ్ లో సీక్వెల్ ట్రెండ్ నడుస్తుంది. బాహుబలి చిత్రంతో మొదలైన ఈ ట్రెండ్… పుష్పతో ఊపందుకుంది. ఆర్ ఆర్ ఆర్, సలార్, కల్కి, స్కంద, పెదకాపు చిత్రాలకు సీక్వెల్స్ ఉన్నాయి. వీటిలో కొన్ని అధికారికంగా ప్రకటించారు కూడా. అనూహ్యంగా దేవర చిత్రానికి సీక్వెల్ ప్రకటించి షాక్ ఇచ్చాడు దర్శకుడు కొరటాల శివ. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. కొరటాల శివ మాట్లాడుతూ ఈ కథ ఎన్టీఆర్ కి చెప్పినప్పుడు ఎగ్జైట్ అయ్యారు. ఒక మంచి కథను కుదించి, హడావుడిగా ఒక భాగంలో ప్రెజెంట్ చేయడం కంటే… రెండు భాగాలుగా విడుదల చేయడం మంచిదని భావించాము అన్నారు.

    కాబట్టి అధికారికంగా దేవర పార్ట్ 2 ఉంటుందని చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. ఈ న్యూస్ చిత్ర వర్గాల్లో హాట్ టాపిక్ కాగా, ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం దేవర షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుపుకుంటుంది. ఇటీవల హైదరాబాద్ లోనే బీచ్ సెట్ వేసి కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. దేవర విడుదలకు మరో ఆరు నెలల సమయం మాత్రమే ఉంది. దీంతో షూటింగ్ త్వరిత గతిన పూర్తి చేస్తున్నారు.

    ఇక దేవర సాగర తీరం నేపథ్యంలో తెరకెక్కుతుంది. సన్నివేశాలు అధిక భాగం సముద్ర ప్రాంతంతో కూడుకొని ఉంటాయి. ఇక రాక్షసులను భయపెట్టే వాడిగా హీరో క్యారెక్టర్ ఉంటుందని కొరటాల శివ తెలిపారు. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. దేవర ఫస్ట్ లుక్ కేక పుట్టించింది. ఫ్యాన్స్ కి ఎంతగానో నచ్చేసింది.

    దేవర చిత్రంలో ఎన్టీఆర్ కి జంటగా జాన్వీ కపూర్ నటిస్తుంది. విలన్ గా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ని తీసుకున్నారు. దేవర చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుండి వస్తున్న మూవీ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. దాదాపు రూ. 350 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం. ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మిస్తున్నారు.