https://oktelugu.com/

Chandrababu Arrest : చంద్రబాబు అరెస్ట్ తో పార్టీ చేసుకున్న ఎన్టీఆర్!

చంద్రబాబు అరెస్ట్ తో వీకెండ్ పార్టీ చేసుకుంటున్న సీనియర్ ఎన్టీఆర్ అంటూ.. ‘ఆయన పాత డ్యాన్సింగ్ వీడియోలను ‘జగనన్న జగనన్న.. జనమంతా నువ్వన్నా’ పాటకు

Written By:
  • NARESH
  • , Updated On : September 13, 2023 / 11:26 AM IST

    Chandrababu Arrest

    Follow us on

    Chandrababu Arrest  : అన్న ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని ఓన్ చేసుకున్నాడన్న మచ్చ చంద్రబాబుకు ఇప్పటికీ ఉంది.. సొంత పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచాడని జగన్, ప్రత్యర్థులు విమర్శిస్తూనే ఉంటారు.   నందమూరి తెలుగుదేశాన్ని ‘నారా తెలుగుదేశం’ గా మార్చేశారని ప్రత్యర్థులు ఆరోపిస్తుంటారు..   ఆనాడే చంద్రబాబు దుర్బిద్దిని.. ఎన్టీఆర్ మీడియా సాక్షిగా బయటపెట్టాడు. ఇప్పటికీ ఆ వీడియోలు మన కళ్లముందే ఉంటాయి. పాముకు పాలు పోసి పెంచానని.. తననే కాటు వేసిందని ఆవేదన చెందాడు.

    అయితే ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ తో ఎన్టీఆర్ ఆత్మ శాంతించిందని అందరూ రాంగోపాల్ వర్మ పెట్టిన  పోస్టు వైరల్ గా మారింది.. చంద్రబాబు పాపం ఇన్నాళ్లకు పండిందని ఆయన తెగ సంతోషపడుతున్నాడు. ఇక రాంగోపాల్ వర్మ  దీన్ని ఒక సంబరంగా జరిపేస్తున్నారు.

    ఈ క్రమంలోనే తన క్రియేటివిని అంతా జోడించేసి అద్భుతమైన పాటను రూపొందించారు. చంద్రబాబు అరెస్ట్ తో వీకెండ్ పార్టీ చేసుకుంటున్న సీనియర్ ఎన్టీఆర్ అంటూ.. ‘ఆయన పాత డ్యాన్సింగ్ వీడియోలను ‘జగనన్న జగనన్న.. జనమంతా నువ్వన్నా’ పాటకు మిక్స్ చేసి రాంగోపాల్ వర్మ వదిలిన ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చంద్రబాబు వ్యతిరేకులు అయితే తెగ షేర్లు చేస్తున్నారు.

    జగన్ అంటే అభిమానం చూపే రాంగోపాల్ వర్మ.. అదే సమయంలో చంద్రబాబుపై ఇలాంటి సినిమాలు తీశారు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అంటూ ఏడిపించారు. అదే సమయంలో జగన్ కు పాజిటివ్ సినిమాలు తీస్తున్నారు. ‘వ్యూహం’ సినిమా అదే. ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ ను కూడా ఆయన ఈ కోణంలో వ్యగ్యంగా వ్యక్తీకరించడం వైరల్ గా మారింది.