Homeఅంతర్జాతీయంElon Musk Twitter: కోకా-కోలాను కొనబోతున్నా.. మా కోసం చంద్రుడిని కూడా కొనండి...

Elon Musk Twitter: కోకా-కోలాను కొనబోతున్నా.. మా కోసం చంద్రుడిని కూడా కొనండి !

Elon Musk Twitter: అసాధ్యాలతో అద్భుతాలు చేయడం ‘ఎలోన్ మస్క్’కి బట్టర్ తో పెట్టిన విద్య. ఎన్నడూ తన విజయాన్ని చూసి మురిసిపోడు, అది తన తొలి అడుగు మాత్రమే అని నమ్మే మోస్ట్ పవర్‌ఫుల్‌ మెన్. మండిన కొవ్వొత్తి లాగే… గడిచిన కాలం తిరిగి రాదు అని చెప్పే మోస్ట్ ప్రాక్టికల్ మెన్. అన్నిటికీ మించి ఎలోన్ మస్క్ పని రాక్షుసుడు. చేసే ప్రతి పనిలోనూ ఆనందం లేకపోవచ్చు. కానీ.. ఏ పనీ చేయకుండా ఆనందాన్ని పొందలేం అని.. ఆ పనిలోనే తన ఆనందాన్ని వెతుక్కున్న అపర కుబేరుడు.

Elon Musk Twitter
Elon Musk Twitter

అందుకే.. మస్క్ ఒక్కోసారి ఆఫీస్‌లోనే నిద్రపోతాడు. పని పట్ల ‘ఎలోన్ మస్క్’కి ఉన్న ఫ్యాషన్ అది. ఆయన ఆలోచనా విధానమే కాదు, వ్యక్తిత్వం కూడా విభిన్నమైనదే. నచ్చినట్లు మాట్లాడటమే కాదు, నచ్చినట్లు బతుకుతాడు. అనుకుంటే ఏదైనా చేయగలడు. ఎవ్వరికీ భయపడడు. అది ప్రత్యర్థులు అయినా.. రష్యా ప్రెసిడెంట్ అయినా.. ఇంకెవరైనా ఒకేలా నిక్కచ్చిగా ఖచ్చితత్వంతో తాను చెప్పాలనుకున్నది అంతే ఫోర్స్ గా చెప్పగలడు.

Also Read: Acharya Advance Bookings: 2000 థియేటర్స్ లో ఆచార్య.. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఎంత వసూలు చేసిందో తెలుసా!

ఒక్క మాటలో ‘ఎలోన్ మస్క్’ వ్యక్తి కాదు, ఒక శక్తి. తన ఒక్క ట్వీట్‌తో ప్రపంచ పరిస్థితులను తారుమారు చేయగల సత్తా ఉన్న శక్తిని మించిన వ్యక్తి. ఈ భూమి మీద ‘ఎలోన్ మస్క్’ అంత గొప్పగా ప్రభావం చూపగల మనిషి. అందుకే.. ఎలోన్ మస్క్ ఎప్పుడూ వార్తల్లో ఉంటాడు. కాదు, వార్తలే ఆయన చుట్టూ తిరుగుతాయి.

ఇప్పటికే.. ట్విటర్ మస్క్ చేతుల్లోకి వెళ్లిపోయింది. సుమారు $44 బిలియన్లుతో ట్విటర్‌ను మస్క్ హస్తగతం చేసుకుని యావత్తు ప్రపంచానికి షాక్ ఇచ్చాడు. టెస్లా సీఈవోతో పాటు ఇప్పుడు ట్విట్టర్ యజమాని అయిపోయాడు. ఐతే.. తాజాగా మస్క్ మరో సంచలనానికి నాంది పలకబోతున్నాడు. తాజాగా ఆయన చేసిన మెసేజ్ వైరల్ అవుతుంది.

Elon Musk Twitter
Elon Musk Twitter

మస్క్ కొకైన్‌ ను తిరిగి విస్తృతంగా పెంచడానికి కోకా-కోలాను కొనుగోలు చేయబోతున్నా’ అని ట్వీట్ చేశాడు. ఐతే.. ఈ ట్వీట్‌కు కొందరు నెటిజన్లు ప్రతిస్పందిస్తూ.. ‘సర్, మీరు మా కోసం చంద్రుడిని కూడా కొనండి. ఎందుకంటే.. ఈ భూమి మీద చాలా యుద్ధాలు జరుగుతున్నాయి’ అని ఒకరు పోస్ట్ చేయగా..

మరొకరు మరో ట్వీట్ చేస్తూ.. ‘టిక్‌ టాక్‌ ని కూడా కొనుగోలు చేసి, దాన్ని పూర్తిగా తొలగించండి” అంటూ మెసేజ్ చేశాడు. మరి, ప్రశ్నించడం మానేస్తే బానిసత్వానికి అలవాటు పడుతున్నట్లే అని చెప్పే మస్క్.. వీరి ప్రశ్నలకు ఎలాంటి జవాబులు చెబుతాడో చూడాలి.

Also Read:KCR- Jagan: కేసీఆర్ నల్గొండకు.. జగన్ విశాఖకు.. కీలక పర్యటనలు

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
RELATED ARTICLES

Most Popular