Homeఎంటర్టైన్మెంట్Acharya Advance Bookings: 2000 థియేటర్స్ లో ఆచార్య.. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఎంత వసూలు...

Acharya Advance Bookings: 2000 థియేటర్స్ లో ఆచార్య.. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఎంత వసూలు చేసిందో తెలుసా!

Acharya Advance Bookings: మెగాస్టార్ చిరంజీవి మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కిన మెగా మాస్ మూవీ ఆచార్య రేపు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవుతున్న సంగతి మన అందరికి తెలిసిందే..సుమారు మూడేళ్ళ నుండి మెగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఈ సినిమా రేపు సుమారు ప్రపంచవ్యాప్తంగా 2000 కి పైగా థియేటర్స్ లో విడుదల అవ్వబోతున్నట్టు తెలుస్తుంది..KGF 2 మూవీ కి ఇప్పటికి థియేటర్స్ లో మంచి రన్ ఉన్నప్పటికీ కూడా మెగాస్టార్ మూవీ కావడం తో ఆచార్య సినిమాకి థియేటర్స్ భారీ గానే ఇచ్చారు డిస్ట్రిబ్యూటర్లు..ప్రాంతాల వారీగా థియేటర్స్ కౌంట్ ఒక్కసారి చూస్తే నైజం ప్రాంతం లో ఈ సినిమాకి దాదాపుగా 355 థియేటర్స్ ని కేటాయించారు..నైజం ప్రాంతం లో ఉండేదే 420 థియేటర్స్ అయితే ఆచార్య సినిమా దాదాపుగా 90 శాతం థియేటర్స్ లో విడుదల అవ్వబోతుంది..ఇక రాయలసీమ ప్రాంతం లో కూడా ఈ సినిమాకి 260 కి పైగా థియేటర్స్ ని కేటాయించారు.

Acharya Advance Bookings
Acharya Advance Bookings

ఆంధ్ర ప్రాంతం లో 520 కి పైగా థియేటర్స్ లో విడుదల అవుతున్న ఈ సినిమా, ఓవర్సీస్ లో అక్షరాలా 650 కి పైగా థియేటర్స్ లో విడుదల అవ్వబోతుంది..కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా కి కలిపి 200 కి పైగా విడుదల థియేటర్స్ లో విడుదల అవ్వుతున్న ఈ సినిమా,మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా 2000 కి పైగా థియేటర్స్ లో విడుదల కానుంది..ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ సినిమాకి టికెట్ రేట్స్ 50 రూపాయిలు పెంచుకోవచ్చు అని అనుమతి ఇవ్వడం తో డిస్ట్రిబ్యూటర్స్ ఫుల్ హ్యాపీ గా ఉన్నారు..అడ్వాన్స్ బుకింగ్స్ ఆంధ్ర ప్రదేశ్ లో బీభత్సంగా ఉన్నప్పటికీ, తెలంగాణ లో మాత్రం చాలా యావరేజి గా ఉన్నాయి..హైదరాబాద్ వంటి సిటీ లో కూడా ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఇటీవల విడుదల అయినా భీమ్లా నాయక్ , #RRR మరియు KGF సినిమాలతో పోలిస్తే చాలా తక్కువ అని చెప్పాలి.

Also Read: CM Jagan 2024 Election Plan: నా గ్రాఫ్ బాగుంది.. మీ గ్రాఫే పెంచుకోండి.. వచ్చే ఎన్నికల్లో మార్చేస్తా.. ఎమ్మెల్యేలకు జగన్ హితబోధ

కారణం ఏమిటి అంటే ఈ సినిమా నైజం ప్రాంతం లో మల్టీప్లెక్స్ లో 345 రూపాయిలు, సింగల్ స్క్రీన్స్ లో 210 రేట్స్ పెట్టడమే..నైజం ప్రాంతం లో ఇంత రేట్స్ #RRR లాంటి సినిమాలకు తప్ప వేరే సినిమాకి వర్కౌట్ అవ్వదు..పైగా #RRR మరియు KGF చాప్టర్ 2 వంటి సినిమాలను ఎగబడి చూసిన జనాలు వెంటనే మరో పెద్ద సినిమాకి చూడడం కష్టం కాబట్టే నైజం ప్రాంతం లో అడ్వాన్స్ బుకింగ్స్ యావరేజి గా ఉన్నాయి అని..దానికి తోడు 10 వ తరగతి పరీక్షలు కూడా ప్రారంభం అవ్వబోతుండడం ఇవన్నీ ఈ సినిమా పై ప్రభావం చూపించింది అని ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం..కానీ విడుదల తర్వాత మంచి టాక్ వస్తే కచ్చితంగా ఈ సినిమా కేవలం తెలుగు రాష్ట్రాల నుండే 40 కోట్ల రూపాయిల షేర్, ప్రపంచవ్యాప్తంగా 55 కోట్ల రూపాయిల షేర్ వసూలు చేసే అవకాశాలు ఉన్నాయి అని ట్రేడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న వార్త..ఓవర్సీస్ లో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ అద్భుతంగా ఉన్నాయి..అమెరికా లో అయితే కేవలం ప్రీమియర్స్ నుండే ఈ సినిమా 8 లక్షల డాలర్స్ వసూలు చేసే అవకాశం ఉంది అని తెలుస్తుంది..చూడాలి మరి ఈ సినిమా మొదటి రోజు వసూళ్లు ఏ స్థాయిలో ఉండబోతుందో.

Also Read: AP Women Commission: బాధితులకేదీ స్వాంతన? విమర్శలపాలవుతున్న ఏపీ మహిళా కమిషన్

Recommended Videos:

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

3 COMMENTS

  1. […] Husband And Wife Relation: మనదేశంలో సనాతన సంప్రదాయాలు మనుగడలో ఉన్నాయి. దీంతో మనలో చాలా మంది సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు. పూర్వ కాలంలో మన వ్యవస్థలో బాల్య వివాహాలు ఉండేవి. దీంతో వరుడు, వధువు వయసులో భారీ వ్యత్యాసం ఉండేది. దీంతో సహజంగా భర్త వయసు ఎక్కువగా ఉండేది. కాలక్రమంలో వయసు తారతమ్యాలు తగ్గాయి. దీంతో సమ వయసుల వారికే వివాహం చేయడం ఇప్పుడున్న ట్రెండ్. దీంతో భార్యాభర్తల్లో సమభావం ఏర్పడుతోంది. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular