Sim Swap fraud : టెక్నాలజీ ఎంతలా అభివృద్ధి చెందుతుందో.. దానితో ఎన్ని ఉపయోగాలు ఉంటున్నాయో.. అన్నే అనర్థాలు ఉంటున్నాయి. ఈజీ మనీ కోసం ఇప్పటికే సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. మనిషి జీవితాన్ని సులభం చేస్తున్న టెక్నాలజీ.. చిన్నచిన్న పొరపాట్లతో నిండా ముంచేస్తుంది. దీని కట్టడికి ప్రభుత్వాలు ఓవైపు చర్యలు తీసుకుంటుండగానే సైబర్ కేటుగాళ్లు మరో కొత్తరకం మోసానికి తెర తీశారు. తాజాగా ఓ కొత్త సైబర్ నేరం వెలుగులోకి వచ్చింది. సిమ్ స్వాప్ పేరుతో ఖాతాల్లోని డబ్బులను దోచేస్తున్నారు. ఇతంకీ సిమ్ స్వాప్ అంటే ఏంటి.? దీని బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం..
స్విమ్ స్వాప్ అంటే..
మొబైల్ ఫోన్‌లేని జీవితాన్ని ఊహించుకోవడం కష్టమైన ఈ రోజుల్లో దానిని తమ నేరానికి వస్తువుగా మార్చుకుంటున్నారు సైబర్ కేటుగాళ్లు. సిమ్ కార్డు ద్వారా కొత్త నేరానికి తెర తీశారు. రకరకాల మార్గాల్లో యూజర్ల మొబైల్ నంబర్ సమచారాన్ని సేకరిస్తున్నారు. ఏ వివరాలతో సిమ్ కార్డును తీసుకున్నారు? ఎవరి పేరుపై సిమ్ కార్డు ఉంది? లాంటి వివరాలను సేకరించిన తర్వాత.. మొబైల్ ఫోన్ పోయిందని, సిమ్‌కార్డు పోయిందన్న కారణంతో కస్టమర్ కేర్‌కు కాల్ చేస్తారు. సంబంధిత వివరాలను తెలిపి కొత్త సిమ్ కావాలని కోరుతారు. ఇందుకోసం యూజర్ల ఫేక్ ఐడీను రూపొందిస్తున్నారు.
యూజర్లకు తెలియకుండానే..
ఇలా చేయగానే సదరు సిమ్ యూజర్‌కు తెలియకుండానే అతని నంబర్ డీ యాక్టివ్ అవుతుంది. ఈ సమయంలో డూప్లికేట్ సిమ్ కార్డు పొందిన సైబర్‌నేరగాళ్లు ఓటీపీ సహాయంతో మీ ఖాతాల్లోని సొమ్మును దర్జాగా కొట్టేస్తున్నారు. ఇలాంటి నేరాలు ఇటీవల ఎక్కువగా నమోదవుతున్నాయి. మొన్నటికి మొన్న ఓ మహిళా లాయర్ సిమ్ స్వాప్ బారిన పడిన బ్యాంక్ అకౌంట్‌లో డబ్బును కోల్పోయింది.
ఈ మోసం బారిన పడకూడదంటే..
· మీ మొబైల్‌కు ఫోన్ మెసేజ్ రాక చాలా కాలం అయితే వెంటనే అలర్ట్ అవ్వాలి. మీ సిమ్ యాక్టివేట్‌లో ఉందో లేదో ఇతరులకు కాల్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు.
· ఒకవేళ మీ ఫోన్ నుంచి కాల్స్ వెళ్లకపోతే వెంటనే కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసి మీ సిమ్ యాక్టివేట్‌లో ఉందో లేదో అడిగి తెలుసుకోవాలి.
· ఇక సిమ్ స్వాపింగ్ కోసం మీరు దరఖాస్తు చేసుకుంటే టెలికాం సంస్థల నుంచి మీ ఫోన్‌కు ఒక మెసేజ్ వస్తుంది. కాబట్టి ఫోన్‌లో వచ్చిన టెక్ట్స్ మెసేజ్‌లను అలా వదిలేయకుండా గమనిస్తుండాలి.
· ఇక క్రమం తప్పకుండా మీ బ్యాంక్ అకౌంట్‌పై కూడా ఓ కన్నేసి ఉంచాలి. అప్పుడప్పుడు బ్యాలెన్స్ చెక్ చేయడం, ట్రాన్సాక్షన్ హిస్టరీ చూడడం వంటి చేస్తుండాలి.
· ఇక మీ ఫోన్‌ను ఎక్కువ కాలం స్విఛ్ ఆఫ్ చేయడం కానీ, ఎక్కువ కాలం ఫ్లైట్ మోడ్‌లో ఉంచడం లాంటివి కానీ చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల మీ సిమ్ కార్డ్ స్వాపింగ్‌కు గురైందన్న విషయం తెలిసే అవకాశం ఉండదు.